TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM

author img

By

Published : May 13, 2022, 10:59 AM IST

TOP NEWS

..

  • SI Suicide: సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని.. సర్పవరం ఎస్​ఐ గోపాలకృష్ణ ఆత్మహత్య
    SI Suicide: కాకినాడ జిల్లా సర్పవరం ఎస్​ఐ గోపాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఇంట్లోనే సర్వీస్‌ రివాల్వర్‌తో ఆయన కాల్చుకున్నట్లు సమాచారం. అయితే అధికారులు మాత్రం.. మిస్‌ ఫైర్‌ జరిగి ఎస్సై మృతి చెందారని చెబుతున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Loss to Farmers: అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లిన 'అసని' తుపాను
    Loss to farmers: అసని తుపాను ప్రభావంతో రాష్ట్రంలో కురిసిన వర్షాలకు.. అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలుచోట్ల కోత కోసిన వరి పనలు నీట నాని మొలకలొస్తున్నాయి. తడిసిన ధాన్యాన్ని ఎలా అమ్ముకోవాలో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తగ్గేదేలే అంటున్న పుష్పరాజ్​లు.. భారీగా పట్టుబడ్డ ఎర్రచందనం
    RED SANDALWOOD: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎర్రచందనం దుంగలను తరలించే ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి జిల్లాలో రూ.4 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు, శ్రీసత్యసాయి జిల్లాలో 40 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ATTACK: మాకంటే స్పీడ్​గా వెళ్తావా.. ఆర్టీసీ బస్సును ఆపి
    ATTACK: విజయవాడలో ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. తమ బైక్​ను ఆర్టీసీ బస్సు ఓవర్​ టేక్​ చేసిందని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సును ఆపి డ్రైవర్​తో గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా బస్సు అద్దాలు పగలగొట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాజ్యసభ ఎన్నికలకు మోగిన నగారా.. 15 రాష్ట్రాల్లో 57 స్థానాలకు..
    Rajya Sabha polls 2022: 15 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్​ విడుదల చేసింది భారత ఎన్నికల సంఘం. 57 మంది ఎంపీల పదవీకాలాలు జూన్​ 21 నుంచి ఆగస్టు ఒకటిలోపు పూర్తి కానున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 2, ఆంధ్రప్రదేశ్‌లో 4 స్థానాలున్నాయి. జూన్​ 10న పోలింగ్​, అదే రోజు ఓట్ల లెక్కింపు ఉండనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దిల్లీలో ఒక్కరోజే వెయ్యి మందికి కరోనా​.. భారత్​లో ఎన్ని కేసులంటే?
    India Corona Cases: దేశంలో కరోనా కేసులు స్థిరంగానే నమోదవుతున్నాయి. ఒక్కరోజే మరో 2,841 మందికి వైరస్​ సోకింది. మరో 9 మంది మరణించారు. కొత్త కేసుల్లో దిల్లీలోనే వెయ్యికిపైగా ఉండటం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఉత్తర కొరియాను కుదిపేస్తున్న కరోనా.. 3.5 లక్షల మంది క్వారంటైన్​!
    North Korea Covid Cases: ఉత్తర కొరియాను కొవిడ్​ మహమ్మారి కుదిపేస్తోంది. గురువారం ఒక్కరోజే 18వేల మందిలో జ్వరం లక్షణాలు కనిపించినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. అందులో ఒకరికి ఒమిక్రాన్​ వేరియంట్​ నిర్ధరణ అయింది. మొత్తంగా 3.5 లక్షల మందికిపైగా జ్వరపీడితులుగా మారినట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రూ. 700 తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం ఎంతంటే?
    Gold Rate Today: బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • థామస్​ కప్​లో భారత్ సంచలనం.. 43 ఏళ్ల తర్వాత సెమీస్​కు.. పతకం ఖాయం
    Thomas cup 2022: థామస్‌ కప్‌లో భారత్‌ చరిత్ర సృష్టించింది. 43 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ సెమీఫైనల్‌ చేరిన భారత్‌ ఈ టోర్నీలో తొలిసారి పతకం ఖాయం చేసుకుంది. స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన పురుషుల జట్టు క్వార్టర్‌ఫైనల్లో మలేసియాను ఓడించింది. మరోవైపు ఉబెర్‌ కప్‌లో అమ్మాయిల పోరాటం క్వార్టర్‌ఫైనల్లోనే ముగిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అనుష్క, సమంత, కీర్తి సురేష్‌ బాటలో యువ నాయికలు
    ఇప్పుడంతా పాన్‌ ఇండియా ట్రెండ్‌. అగ్ర కథానాయకుల నుంచి.. కుర్ర హీరోల వరకు అందరూ ఇదే పంథాలో నడుస్తున్నారు. మంచి కథ కుదిరిందంటే చాలు.. హిందీ సహా నాలుగైదు భాషల్లో విడుదల చేసి సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడీ ఫీవర్‌ కథానాయికల్ని పట్టుకుంది. అనుష్క, సమంత, కీర్తి సురేష్‌ వంటి అగ్ర కథానాయికలంతా ఇప్పటికే పాన్‌ ఇండియా కథలతో అదృష్టం పరీక్షించుకున్నారు. ఇప్పుడీ రేసులోకి కొత్తతరం నాయికలు వచ్చి చేరుతున్నారు. మెరుపులు మెరిపించేందుకు సెట్స్‌పై చకచకా ముస్తాబవుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.