TOP NEWS: ప్రధాన వార్తలు@5PM

author img

By

Published : May 12, 2022, 4:57 PM IST

TOP NEWS

TOP NEWS: ప్రధాన వార్తలు@5PM

  • మంత్రి అంబటిపై అయ్యన్నపాత్రుడు సంచలన ట్వీట్‌
    మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి తెదేపా నేత అయ్యన్నపాత్రుడు సంచలన ట్వీట్‌ చేశారు. ఓ యూట్యూబ్‌ ఛానల్‌ యాంకర్‌ను లైంగింకంగా వేధించిన వ్యవహారంలో కాంబాబుపై చర్యలు ఖాయమంటూ అయ్యన్న ట్వీట్‌ చేశారు. 'సార్‌ మీ ఇంటర్వ్యూ కావాలంటూ.. కాంబాబుకు యూట్యూబ్‌ ఛానల్‌ యాంకర్‌ వాట్సాప్ మెసేజ్‌ చేసింది. ఇంటర్వ్యూ ఇస్తే.. నాకేం ఇస్తావు అంటూ రిప్లై ఇచ్చాడు కాంబాబు. అక్కడితో ఆ వ్యవహారం ఆగలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆక్వా ఉత్పత్తుల క్వాలిటీ పెంచడానికి చర్యలు తీసుకోవాలి: సీఎం జగన్
    ఆక్వా ఉత్పత్తుల క్వాలిటీ పెంచడానికి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సీఎం అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల అభివృద్ధి బోర్డు.. ఐదేళ్ల కాలంలో రూ.3.5 లక్షల కోట్ల ఎగుమతులు సాధించే దిశగా అడుగులు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'గడప గడపకు ప్రభుత్వం'పై.. విపక్షాల అసత్య ప్రచారం: సజ్జల
    YSRCP Gadapa Gadapaku Program: 'గడప గడపకు ప్రభుత్వం' కార్యక్రమంపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలను నిలదీసే వారంతా తెలుగుదేశానికి చెందిన వారేనని సజ్జల పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఫ్యాషన్ ప్రియుల కోసం "హైలైఫ్‌ బ్రైడ్స్‌" ప్రదర్శన.. ఎప్పుడంటే?
    Highlife Brides Expo : వివాహన్ని మరపురాని మధుర క్షణంగా గుర్తుంచుకోవాలని కోరుకుంటారు వధూవరులు. అలాంటి వారికోసం విజయవాడలో ఈనెల 17, 18 తేదీల్లో "హైలైఫ్‌ బ్రైడ్స్‌" ప్రదర్శన జరగనుంది. వధువుల ఫ్యాషన్‌ అవసరాలతోపాటు లైఫ్‌స్టైల్‌ ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో అమ్మకానికి ఉంచుతామని నిర్వాహకులు తెలిపారు. రెండు రోజులపాటు నోవాటెల్‌ హోటల్‌లో జరిగే ఈ ప్రదర్శన పురస్కరించుకుని నిర్వహించిన ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాజద్రోహం చట్టం అమలు నిలిపివేత నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : చంద్రబాబు
    Chandrababu on Article 124(A): రాజద్రోహం చట్టం (124 ఏ) అమలును నిలిపివేస్తూ.. దేశ అత్యున్నత ధర్మాసనం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వాగతించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'తాజ్​మహల్​లో హిందూ దేవతా విగ్రహాలు' పిటిషన్ కొట్టివేత
    Taj Mahal 22 rooms case: తాజ్​మహల్​లోని 22 గదుల్లో హిందూ దేవతా విగ్రహాలు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్​ను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. గదులను తెరిచేలా పురావస్తు శాఖ అధికారులను ఆదేశించాలని దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'జ్ఞాన్​వాపి మసీదు దగ్గర సర్వే చేపట్టాల్సిందే'
    Gyanvapi Mosque Survey: ఉత్తర్‌ప్రదేశ్‌ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు-శృంగార్‌ గౌరీ ఆలయ ప్రాంగణంలో సర్వే నిర్వహించాల్సిందేనని జిల్లా కోర్టు స్పష్టంచేసింది. సర్వే కమిషనర్​ను మార్చాలన్న ముస్లిం పెద్దల పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈనెల 17లోగా సర్వే పూర్తి చేయాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'కోమా'లోకి పైలట్.. విమానం నడిపిన ప్రయాణికుడు.. ఫోన్లో మాట్లాడుతూ ల్యాండింగ్!
    Florida plane landing: పైలట్​ ఒక్కసారిగా కుప్పకూలడం వల్ల ప్యాసెంజరే విమానాన్ని సేఫ్​గా ల్యాండ్ చేసిన ఘటన అమెరికా ఫ్లోరిడాలో జరిగింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సిబ్బంది సాయంతో అతను విమానాన్ని నడిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మార్కెట్లకు భారీ నష్టాలు- సెన్సెక్స్ 1158 పాయింట్లు డౌన్
    స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1158 పాయింట్లు పతనమై 52,930 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 359 పాయింట్లు క్షీణించి 15,808 వద్ద ముగిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మహేశ్​బాబు​ మాటలు నాకు అర్థం కాలేదు: ఆర్జీవీ
    బాలీవుడ్​పై మహేశ్​బాబు చేసిన వ్యాఖ్యలు బీటౌన్​లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ విషయంపై తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్​గోపాల్​వర్మ స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.