TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM
Published on: May 10, 2022, 10:59 AM IST

TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM
Published on: May 10, 2022, 10:59 AM IST
.
- Asani Effect: 'అసని' తుపాను బీభత్సం...విశాఖకు విమాన రాకపోకలు రద్దు
RAINS IN AP: రాష్ట్రంలో అసని తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో గాలివానలు కురుస్తున్నాయి. ఈదురు గాలులకు చెట్లు నేలకొరుగుతున్నాయి. తీర ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా మారుతోంది. వర్షాలు, ఈదురుగాలులో పంటలు, ఇళ్లు ధంసమవుతుండటంతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విద్యార్థినితో ఆకతాయిల అసభ్య ప్రవర్తన... నలుగురు అరెస్ట్
HARASSMENT: రాష్ట్రంలో రోజురోజుకు అకతాయిల ఆగడాలు పెరిగిపోతున్నాయి. అమ్మాయి కనిపిస్తే చాలు వెంబడించి వేధిస్తున్నారు. అసభ్యకరంగా ప్రవర్తించి హింసిస్తున్నారు. తాజాగా చంద్రగిరిలో ఓ విద్యార్థినిని.. ఐదుగురు ఆకతాయిలు అడ్డుకుని అసభ్యకరంగా ప్రవర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- Arrest: మద్యం తరలింపునకు రోజుకో కొత్త ఐడియా..కానీ
ARREST: అక్రమ మద్యం తరలించేందుకు కొందరు వ్యక్తులు వినూత్న ఆలోచనలకు పదును పెడుతున్నారు. కొందరు ఇటుకల మధ్యన రవాణా చేస్తే, మరి కొందరు పాల వాహనాల్లో మద్యం తరలిస్తున్నారు. ఇది అంత ఒక ఎత్తయితే.. తాజాగా ఉరవకొండలో వాహనం వెనక భాగంలో ఒక అరను ఏర్పాటు చేసుకొని మద్యం తరలిస్తున్నారు. అయితే పోలీసుల తనిఖీల్లో పట్టుబడడంతో ఈ వ్యవహారం బయటపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- Minister Botsa: "వైకాపాను కాపాడుకోవాల్సిన బాధ్యత...అందరిపై ఉంది"
Minister Bosta: కార్యకర్తలు పార్టీకి ఎంతో ముఖ్యమని... వారిని తొక్కేయకూడదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని... నిర్లక్ష్యం వహించకూడదని తెలిపారు. జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రులు... పార్టీ బలోపేతంపై చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'షవర్మా'పై బ్యాన్.. మేయర్ ఆదేశాలు.. త్వరలో మరిన్ని నగరాల్లోనూ..!
Shawarma banned in Tamil nadu: యువత ఎంతో ఇష్టంగా తినే షవర్మాను తమ మున్సిపాలిటీ పరిధిలో నిషేధిస్తున్నట్లు ప్రకటించారు తమిళనాడు వెల్లూర్ జిల్లా గుడియాథం మేయర్. షవర్మా ఆరోగ్యానికి హాని చేస్తోందన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు.. మరణాలు
India Corona Cases: భారత్‌లో కొవిడ్ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 2288 కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. 12-14 ఏళ్ల వయసుగల 3 కోట్లమందికిపైగా యువత టీకా తొలి డోసు పొందినట్లు కేంద్రం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తాలిబన్ల కిరాతకానికి బలైన భారతీయ ఫొటో జర్నలిస్టుకు 'పులిట్జర్'
పాత్రికేయ రంగంలో అత్యున్నత పురస్కారమైన 'పులిట్జర్'.. ఈ ఏడాది నలుగురు భారతీయుల్ని వరించింది. గతేడాది తాలిబన్లకు, అఫ్గాన్ భద్రతా బలగాలకు మధ్య పోరును చిత్రీకరించేందుకు వెళ్లి, ప్రాణాలు కోల్పోయిన ఫొటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీ వీరిలో ఒకరు. సిద్ధిఖీని పులిట్జర్ వరించడం ఇది రెండోసారి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తగ్గిన బంగారం ధర.. తెలంగాణ, ఏపీలో ఎంతంటే?
Gold Rate Today: బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- Tennis: ఆగయా నయా నాదల్.. దిగ్గజాలనే ఆటాడేసుకుంటున్నాడుగా
Madrid open Carlos alcaraz: చిన్నతనంలో ఆ పిల్లాడు చూసిన తొలి టెన్నిస్ టోర్నీ అది.. అప్పుడు దిగ్గజం నాదల్ టైటిల్ గెలిచాడు.. అది చూసి తన ఆరాధ్య ఆటగాడి లాగే ఆ ట్రోఫీని సొంతం చేసుకోవాలని ఆ పిల్లాడు నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు 19 ఏళ్ల వయసులో ఆ లక్ష్యాన్ని సాధించాడు. అది కూడా నాదల్, జకోవిచ్‌లపై నెగ్గి విజేతగా నిలిచాడు. ఆ టోర్నీ మాడ్రిడ్ ఓపెన్.. ఇప్పుడు కుర్రాడిగా మారిన ఆ పిల్లాడి పేరు కార్లోస్ అల్కరస్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బాలీవుడ్ నన్ను భరించలేదు.. అక్కడ నటించి టైమ్ వేస్ట్: మహేశ్
Mahesh Bollywood entry: బాలీవుడ్ ఎంట్రీ విషయంపై మరోసారి స్పష్టతనిచ్చారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు. బాలీవుడ్ తనను భరించలేదని, హిందీ సినిమాల్లో నటించి సమయం వృథా చేయాలనుకోవట్లేదని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

Loading...