TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM

author img

By

Published : May 9, 2022, 1:05 PM IST

Topnews

.

  • Cyclone Asani: తీవ్రంగా మారిన 'అసని'.. కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు
    Cyclone Asani: పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో తీవ్ర 'అసని' తుపానుగా మారింది. దీంతో మంగళవారం ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీరానికి వచ్చే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తాంధ్రలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలుండగా.. ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • విద్యార్థులు, యువతే లక్ష్యం.. విశాఖలో జోరుగా మత్తు ఇంజెక్షన్ల అమ్మకం
    Illegally selling of pentazocine lactate injections: విశాఖపట్నంలో మత్తు ఇంజెక్షన్ల అక్రమ దందా జోరుగా సాగుతోంది. వారంలో రెండోసారి మత్తు ఇంజెక్షన్లను పట్టుకున్నారు పోలీసులు. పశ్చిమబంగా నుంచి పెంటాజోసిన్ లాక్టేట్ ఇంజెక్షన్లు తీసుకొచ్చి.. లీలామహల్ జంక్షన్​లో విక్రయిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • B.pharmacy Student Case: బీఫార్మసీ విద్యార్థిని కేసు.. నిందితుడు అరెస్ట్​
    B.pharmacy student case: బీఫార్మసీ విద్యార్థిని మృతి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. రెండు వారాల్లో కేసు దర్యాప్తు పూర్తి చేసి... ఛార్జిషీట్ దాఖలు చేస్తామని డీఎస్పీ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఇద్దరు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం- ఫుల్​ స్ట్రెంథ్​తో సుప్రీంకోర్టు!
    Supreme Court Judges: సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్​ సుధాంశు ధులియా, జస్టిస్​ జంషెడ్​ బి.పర్దీవాలా ప్రమాణ స్వీకారం చేశారు. సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ వారి చేత ప్రమాణం చేయించారు. వారి రాకతో సుప్రీం కోర్టులో పూర్తిస్థాయిలో న్యాయమూర్తుల నియామకం జరిగినట్లయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • షాహీన్​బాగ్​కు మళ్లీ బుల్డోజర్లు.. టెన్షన్​ టెన్షన్​
    Shaheen Bagh protests: అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమంలో భాగంగా దిల్లీలోని షాహీన్​బాగ్​లో మరోసారి బుల్డోజర్లు దర్శనమిచ్చాయి. దీంతో పెద్దసంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • దావూద్​ కేసులో వారికి ఎన్​ఐఏ ఉచ్చు.. 20 చోట్ల సోదాలు
    NIA raids today: దావూద్‌ ఇబ్రహీం, అతడి ముఠా వ్యవహారాలపై విచారణ ముమ్మరం చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్​ఐఏ.. ముంబయిలోని 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. డి కంపెనీపై నమోదు చేసిన కేసులో విచారణ వేగవంతం చేసినట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • పాస్​వర్డ్​లకు ఇక గుడ్​బై! సరికొత్త 'లాగిన్' దిశగా గూగుల్, యాపిల్!!
    పాస్​వర్డ్​లను గుర్తు పెట్టుకోవడంలో సమస్యలు, అవి సరిగా లేకపోవడం వల్ల జరుగుతున్న నష్టాలను తీవ్రంగా పరిగణించాయి దిగ్గజ టెక్ సంస్థలు. 'పాస్​వర్డ్​లెస్ అథెంటికేషన్​' విధానాన్ని వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నాయి. ఫాస్ట్ ఐడెంటిటీ ఆన్​లైన్(ఫిడో)​ అలయన్స్​ ఆధ్వర్యంలో గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్​ ఇందుకోసం కలిసి పనిచేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
    Gold Rate Today: బంగారం, వెండి ధరలు ఆదివారంతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ధోనీ.. క్రీజులోకి వెళ్లేముందు బ్యాట్ ఎందుకు​ కొరుకుతాడంటే?
    IPL 2022 CSK Play offs: మైదానంలో క్రీజులోకి వెళ్లేముందు మహేంద్ర సింగ్ ధోనీ ఎందుకు బ్యాట్​ కొరుకుతాడో వివరించాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ అమిత్​ మిశ్రా. మరోవైపు.. చెన్నై జట్టు ఇప్పుడు ప్లేఆఫ్స్​, నెట్‌ రన్‌రేట్‌ విషయమై ఆలోచించట్లేదని మహీ చెప్పాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • సామ్​తో విజయ్​ బర్త్​డే సెలబ్రేషన్స్​.. వాటిని నమ్మొద్దంటున్న విశ్వక్​
    కొత్త సినిమా కబుర్లు మిమ్మల్ని పలకరించేందుకు వచ్చేశాయి. ఇందులో విజయ్ దేవరకొండ, సమంత, యశ్​, విశ్వక్​సేన్​ చిత్రాల సంగతులు ఉన్నాయి. ఆ వివరాలు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.