TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM

author img

By

Published : May 9, 2022, 9:01 AM IST

TOP NEWS

.

  • RAIN IN AP: రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు... నేలకొరిగిన పంట పొలాలు, చెట్లు
    అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. భీకర గాలుల ధాటికి పంటల తీవ్రంగా దెబ్బతిన్నాయి. పిడుగులు పడి పలువురు మృతిచెందారు. చాలా చోట్ల రహదారులు జలమయం అయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • పాసుపుస్తకాల జారీ విధానం అస్తవ్యస్తం.. సకాలంలో అందక రైతుల ఇక్కట్లు
    రాష్ట్రంలో పట్టాదారు పాసు పుస్తకాల జారీ విధానం అస్తవ్యస్తంగా తయారైంది. వీటి పంపిణీలో రెవెన్యూ సిబ్బంది కొందరు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. పాసుపుస్తకాలు లేక రైతులు బ్యాంకు రుణాలను, ఇతర ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • విదేశాల నుంచి 31 లక్షల టన్నుల బొగ్గు దిగుమతి: మంత్రి పెద్దిరెడ్డి
    Coal export: బొగ్గు కొరతను అధిగమించడానికి 31 లక్షల టన్నులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని.. విద్యుత్‌ సంస్థలు నిర్ణయించినట్లు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఏపీపీడీసీఎల్‌ 13 లక్షల టన్నుల బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు టెండర్లను పిలిచినట్లు ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • సీఆర్‌జెడ్‌ అనుమతి లేకుండానే పనులు.. హెటిరోపై సంయుక్త కమిటీ నివేదిక
    Joint Committee report to NGT: అనకాపల్లి జిల్లాలోని హెటిరో లేబొరేటరీ పరిశ్రమ నిర్వాహకులు.. సీఆర్‌జెడ్‌ అనుమతి లేకుండా కొన్ని పనులు చేపట్టినట్లు సంయుక్త కమిటీ పేర్కొంది. పరిశ్రమ కార్యకలాపాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కమిటీ.. ఈ మేరకు ఎన్‌జీటీకి తన నివేదికను సమర్పించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • బస్సులో సీక్రెట్​ క్యాబిన్​.. డౌట్​ వచ్చి చూస్తే 1900 కిలోల వెండి..
    Silver ornaments seized: రెండు రోజుల వ్యవధిలో అక్రమంగా తరలిస్తున్న 1900 కిలోల వెండిని సీజ్​ చేశారు రాజస్థాన్ పోలీసులు. ఆగ్రా నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు గుజరాత్​కు తరలిస్తున్నట్లు గుర్తించారు. వెండిని సీజ్​ చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'ఇడ్లీ అమ్మ' కు కొత్త ఇల్లు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మహీంద్రా
    Anand Mahindra Idly Amma House: 'ఇడ్లీ అమ్మ'కు ఇల్లు కట్టించి ఆమె కల నెరవేర్చారు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్​ మహీంద్రా. తమిళనాడుకు చెందిన కమలాత్తాళ్​కు సొంత ఇల్లు కట్టిస్తానని గతంలో ట్విట్టర్​ వేదికగా ఆయన ప్రకటించారు . ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కొత్త ఇంటిని కానుకగా ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • గొటబాయకు షాక్​.. 'ప్రభుత్వం' ఏర్పాటుకు ప్రతిపక్షం నో
    Srilanka SJB Party Rejects Offer: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని ఆ దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇచ్చిన పిలుపును ప్రధాన ప్రతిపక్షం ఎస్‌జేబీ తిరస్కరించింది. దేశంలో అత్యవసర పరిస్థితిని అమలు చేస్తున్న నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదనను తోసిపుచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • సెప్టెంబర్ కల్లా 'ఎస్​సీఐ' వేలం.. త్వరలోనే ఆర్థిక బిడ్లకు ఆహ్వానం!
    ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌సీఐ) కోసం ప్రభుత్వం.. ఫైనాన్షియల్ బిడ్లను ఆహ్వానించే అవకాశముంది. సంస్థ నాన్-కోర్ ఆస్తుల విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆర్థిక బిడ్లను పిలువనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఆ ఒలింపిక్స్​లో తెలుగోడి జోరు... మరో స్వర్ణం గెలిచిన షూటర్
    Telangana shooter Dhanush Gold medal: బధిరుల కోసం నిర్వహించే ఒలింపిక్స్​లో తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్ మరో స్వర్ణ పతకం సాధించాడు. ఇప్పటికే పురుషుల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో పసిడి గెలిచిన అతను.. తాజాగా మిక్స్‌డ్‌ టీమ్‌లో ప్రియేషతో కలిసి బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • సంక్రాంతికి విజయ్ కొత్త సినిమా.. కీలక పాత్రల్లో సీనియర్​ స్టార్స్​!
    Vijay Vamsipaidipally movie: తమిళ స్టార్ విజయ్​-వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లు మరోసారి స్పష్టం చేసింది మూవీటీమ్​. ఈ మూవీలో సీనియర్‌ నటులు ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, ప్రభు, శరత్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారని అధికారికంగా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.