AP TOP NEWS: ప్రధాన వార్తలు @7PM
Published on: May 10, 2022, 7:00 PM IST

AP TOP NEWS: ప్రధాన వార్తలు @7PM
Published on: May 10, 2022, 7:00 PM IST
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 7 PM
- అడ్మిషన్లు పెంచుకునేందుకే పదోతరగతి ప్రశ్నాపత్రం లీక్: చిత్తూరు ఎస్పీ
పదోతరగతి ప్రశ్నపత్నం లీక్ కేసులో మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేసినట్లు చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి వెల్లడించారు. చిత్తూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో ఆయన్ను అరెస్టు చేశామన్నారు. ఇన్విజిలేటర్ల వివరాలు ముందుగానే తీసుకుని మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డారన్నారు.
- పరిశ్రమలకు పవర్ హాలిడే ఉపసంహరిస్తున్నాం : మంత్రి పెద్దిరెడ్డి
Minister Peddireddy on power Holiday: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గడంతో పరిశ్రమలకు విధించిన పవర్ హాలిడేను ఉపసంహరిస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.
- పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు: మంత్రి అంబటి
పోలవరం కాపర్‌డ్యాం మళ్లీ నిర్మించాలా? లేదా అనేది నిపుణులు, కేంద్ర సంస్థల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినట్లు జలవనురలశాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
- నారాయణ అరెస్టు న్యాయం అనుకుంటే.. మంత్రి బొత్సను అరెస్టు చేయాలి కదా? : ఎంపీ రఘురామ
MP RRR: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌పై ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. నారాయణ పాఠశాలలో ప్రశ్నాపత్రం లీకైందని ఆ విద్యాసంస్థల అధినేత నారాయణను అరెస్ట్ చేశారు. మరి అలాంటప్పడు 36 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు తప్పుచేశారని కేసు నమోదు చేశారు కాబట్టి విద్యాశాఖ మంత్రిని కూడా అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు.
- ఉద్యోగంలో జూనియర్.. అక్రమాల్లో సీనియర్.. ఏకంగా రూ.70 లక్షలు!
FRAUD: అనంతపురం జిల్లా ఉరవకొండ పంచాయతీ కార్యాలయంలో అక్రమాలు వెలుగు చూశాయి. జూనియర్ అసిస్టెంట్ హరికృష్ణ రూ.70 లక్షలు స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. చలానాల డబ్బు కాజేసినట్లు గుర్తించిన పంచాయతీ అధికారులు, హరికృష్ణకు మెమో జారీచేశారు. ఇప్పటివరకు అతడి నుంచి రూ.50 లక్షలు కట్టించుకున్నాారు. మిగతా రూ.20 లక్షలు ఇవ్వకుండానే జూనియర్ అసిస్టెంట్ హరికృష్ణ పరారయ్యాడు.
- పంచాయతీ భవనాన్ని కూల్చి.. శిథిలాలు అమ్మేసుకున్న గ్రామపెద్ద
Bihar Panchayat building Sold: మొన్న రైల్ ఇంజిన్, నిన్న ఇనుప బ్రిడ్జి... ఈరోజు ఏకంగా పంచాయతీ భవనం... ఇలా బిహార్‌లో ప్రభుత్వ ఆస్తుల విక్రయానికి అడ్డుకట్ట లేకుండా పోయింది. అనుమతులు లేకుండా ప్రభుత్వ భవనాన్ని కూల్చేసి.. శిథిలాలను విక్రయించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
- ఆత్మహత్యను ఆపిన కందిరీగలు.. సెల్‌టవర్ ఎక్కిన మహిళ యూటర్న్!
Wasps Fails Woman Suicide: భర్తపై కోపంతో ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకుంది ఆ మహిళ. మొబైల్ టవర్ పైకి కూడా ఎక్కింది. కానీ కందిరీగలు చేసిన పనికి ఆమె ఆత్మహత్యయత్నం విఫలమైంది. ఇంతకీ ఏమైందంటే?
- PM WANI WiFi: మరింత వేగంగా ఉచిత వైఫై.. ఆ సేవలకు శ్రీకారం
RailTel launches PM-WANI: రైల్వేస్టేషన్లలో మరింత వేగవంతమైన ఉచిత వైఫై అందించేందుకు 'పీఎం- వాణి' సేవలకు శ్రీకారం చుట్టింది రైల్‌టెల్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 6,102 రైల్వే స్టేషన్లలో రైల్‌టెల్ వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయి.
- 'పంత్ అతడిలా ఆడితే.. దిల్లీకి మరిన్ని విజయాలు'
దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశారు. టీ20 ఫార్మాట్లో 'ఆండ్రీ రస్సెల్'లాగా ఒకే టెంపోలో ఆడాలని చెప్పారు.
- స్విమ్ సూట్లో హీటెక్కిస్తున్న శ్రియ.. ఫొటోలు వైరల్!
హీరోయిన్ శ్రియ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్విమ్ సూట్లో ఆమె షేర్ చేసిన చిత్రాలు హీటెక్కిస్తాయి. ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన శ్రియ.. స్మిమ్ సూట్లో బీచ్‌లో సందడి చేసింది. తన కూతురు, భర్తతో సరదాగా గడిపింది. ఈ సందర్భంగా ఆమె దిగిన పొటోలు సెగలు పుట్టిస్తున్నాయి.

Loading...