రాష్ట్రంలో తగ్గుతున్న చిన్నారుల సంఖ్య ... ఒక్కరితోనే సరిపెట్టుకుంటున్న జంటలు

author img

By

Published : May 13, 2022, 6:04 AM IST

child

పూర్వం గంపెడు సంతానం ఉండంట గొప్ప.. తర్వాత అది ఇద్దరు, ముగ్గురు వరకి వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఒక్కరే చాలు అనే దగ్గరి ఆగిపోతుంది. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5 ప్రకారం రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ పద్ధతులను 94% మంది మహిళలు పాటిస్తున్నారు. దీని ప్రభావం తల్లుల ఆరోగ్యంపై కనిపిస్తోంది. ఈ కేటగిరీలో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో ఉంది.

నలభై, యాభై ఏళ్ల క్రితం గంపెడు సంతానం ఉండటం గొప్ప.. రెండు మూడు దశాబ్దాల క్రితం అది ఇద్దరు, ముగ్గురు చాలనే దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఒక్కరే చాలు అనే దగ్గర ఆగిపోతోంది. దీనివల్ల కుటుంబాల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతోంది. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ పాటిస్తున్నవారి సంఖ్య మరీ ఎక్కువైనట్లు కనిపిస్తోంది. సగటున రాష్ట్రంలోని ప్రతి 10 కుటుంబాలకు పిల్లలు 17 మందే ఉంటున్నారు. ఈ సంఖ్య మరీ తగ్గకుండా చూడాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (2019-21) చివరి రౌండ్‌ వివరాల ప్రకారం సంతానోత్పత్తి రేటు (టోటల్‌ ఫెర్టిలిటీ రేటు) 2.0గా ఉంది. 2015-16లో ఇది 2.2గా ఉండేది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది 1.7గా రికార్డయింది. జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే 1992-1993 లెక్కల ప్రకారం రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 2.59గా ఉండేది. గత కొన్ని దశాబ్దాలుగా జనాభా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణ పథకాలు అమలు చేస్తోంది. సంతానం తగ్గింపునకు ముందుకొచ్చే వారికి ప్రోత్సాహకాలు ప్రకటించింది. వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించింది. 1992 నుంచి 1999 వరకు విస్తృత స్థాయిలో జరిగిన ప్రచారంవల్ల కుటుంబ నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెరిగింది. దీనివల్ల సంతానం సంఖ్య క్రమంగా తగ్గింది. అయితే జనాభా పరిమితి ఇంతకుమించి తగ్గకుండా చూడటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే యువత సంఖ్య తగ్గిపోతుందని వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కుటుంబ నియంత్రణ చర్యలవల్ల 35 నుంచి 40 సంవత్సరాల వయసువారు తగ్గుతూ వస్తున్నారు. ఈ వయసువారు తగ్గడంతో పిల్లల సంఖ్య తగ్గిపోతోంది.

మగధీరా.. కు.ని.కి వెనకేల!

కుటుంబ నియంత్రణ పద్ధతులను మహిళలే ఎక్కువగా పాటిస్తున్నారు. పురుషుల నుంచి స్పందన చాలా తక్కువగా ఉంది. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5 ప్రకారం రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ పద్ధతులను 94% మంది మహిళలు పాటిస్తున్నారు. దీని ప్రభావం తల్లుల ఆరోగ్యంపై కనిపిస్తోంది. ఈ కేటగిరీలో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌, సిక్కిం, త్రిపుర, తమిళనాడు ఉన్నాయి. పురుషుల్లో 2 నుంచి 5 శాతం మంది మాత్రమే కుటుంబ నియంత్రణ పాటిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో పురుషులు వేసెక్టమీ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు 7 రాష్ట్రాల్లో 90% మంది పిల్లలు ఆసుపత్రుల్లో జన్మిస్తున్నారు. కేరళలో ఇది 100%గా ఉంది. తక్కువగా నాగాలాండ్‌లో 46%గా రికార్డయింది.

ఇదీ చదవండి: 'ఇది అత్యంతర అరుదైన కేసు కాదు.. ఉరిశిక్ష విధింపు సరికాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.