ఏపీఎస్‌ఎఫ్‌సీ వ్యవహారాలపై త్వరలో ఆర్‌బీఐ భేటీ!

author img

By

Published : Oct 13, 2021, 7:06 AM IST

rbi

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ కార్యకలాపాలపై ఆరా తీసిన రిజర్వుబ్యాంకు అధికారులు త్వరలో ఈ అంశంపై ఒక సమావేశం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్పొరేషన్‌ ఆస్తులు, డిపాజిట్ల స్వీకరణ, వాటి వడ్డీ చెల్లింపులు ఆ నిధులు ఏం చేశారనే అంశాలపై సమాచారం సేకరించిన తర్వాత ఆ కార్పొరేషన్‌ పెద్దలను ఈ సమావేశానికి పిలుస్తారని తెలిసింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ కార్యకలాపాలపై ఆరా తీసిన రిజర్వుబ్యాంకు అధికారులు త్వరలో ఈ అంశంపై ఒక సమావేశం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్పొరేషన్‌ ఆస్తులు, డిపాజిట్ల స్వీకరణ, వాటి వడ్డీ చెల్లింపులు ఆ నిధులు ఏం చేశారనే అంశాలపై సమాచారం సేకరించిన తర్వాత ఆ కార్పొరేషన్‌ పెద్దలను ఈ సమావేశానికి పిలుస్తారని తెలిసింది. ఏపీఎస్‌ఎఫ్‌సీ ఒక నాన్‌ బ్యాంకింగు ఫైనాన్షియల్‌ కంపెనీగా నమోదయింది. రిజర్వుబ్యాంకు ఇలాంటి కంపెనీలను పర్యవేక్షిస్తుంది. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ ఎండీగా ప్రస్తుతం ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ వ్యవహరిస్తున్నారు. రిజర్వుబ్యాంకు సమావేశానికి ఆయనతో పాటు మరికొందరిని పిలిచే అవకాశం ఉంది. ఈ సమావేశంపై ఆర్‌బీఐ ప్రాంతీయ సంచాలకుల నుంచి ఇప్పటికే కార్పొరేషన్‌కు సమాచారం అందింది.

ఏమిటీ ఏపీఎస్‌ఎఫ్‌సీ?

రాష్ట్ర ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ను 2020 ఏప్రిల్‌లో ఏర్పాటుచేశారు. వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో సమానంగా నిధుల సమీకరణకు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలూ పనిచేయవచ్చని రాష్ట్ర ఆర్థికశాఖ 2020 మార్చిలో జీవో 17 విడుదల చేసింది. అందులోభాగంగానే ఏపీఎస్‌ఎఫ్‌సీ ఈ ఏడాది జులై నుంచి అంతర్గత డిపాజిట్లు స్వీకరించింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక అవసరాలు పెరగడం, అప్పులు కూడా చాలకపోవడంతో వనరుల సమీకరణ పేరుతో అనేక మార్గాలపై దృష్టి సారించింది. బహిరంగ మార్కెట్లో 6-8% వడ్డీకి అప్పు తీసుకుంటున్న క్రమంలో అంతర్గత డిపాజిట్లను ప్రభుత్వమే వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఇందుకు ఈ కార్పొరేషన్‌ను రంగంలోకి దించారు. ఆతర్వాత నిధుల సమీకరణ ప్రయత్నాలు జరిగాయి. ఏడాదికి పైగా ఉంచే నిధులపై 5% వడ్డీ ఇస్తామని తెలిపారు. విద్యాసంస్థలు, మరికొన్ని కార్పొరేషన్ల నుంచి ఈ నిధులు డిపాజిట్ల రూపంలో స్వీకరించారు.

కార్యకలాపాలే లేకుండా ఆదాయం ఎలా?

ఈ కార్పొరేషన్‌కు ఎలాంటి వ్యాపారం లేకుండా ఆదాయం ఎలా ఆర్జిస్తుందని, వడ్డీలు ఎలా చెల్లిస్తుందనేది చర్చనీయాంశం. రిజర్వుబ్యాంకు ఈ విషయమై ప్రశ్నించింది. ఈ కార్పొరేషన్లు ప్రైమరీ బిజినెస్‌ విధివిధానాలను ఆచరించాలి. మొత్తం ఆస్తుల్లో 75% వరకు ఫైనాన్షియల్‌ ఆస్తులు ఉండటంతో పాటు, నిరంతరం ఆదాయం ఆర్జించే మార్గాలు ఉండాలి. ఆ నిబంధనలు ఎంతవరకు పాటించిందనేది ప్రశ్నార్థకమే. వీరి డిపాజిట్లకు వడ్డీ ప్రభుత్వమే చెల్లించాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఇది రుణమే అవుతుంది. ఈ డిపాజిట్ల స్వీకరణ బదలాయింపు అంతా పీడీ ఖాతాల రూపంలోనే జరిగినందున ఆర్‌బీఐ ఆ ఖాతాల పూర్తి లావాదేవీలు పరిశీలిస్తే తప్ప ఈ కార్పొరేషన్‌ విషయాలు తెలిసే అవకాశం లేదన్నది నిపుణుల విశ్లేషణ.

ఇదీ చదవండి: Women Disrimination: రాకెట్ల కాలంలోనూ రాతికాలపు ఆచారాలే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.