Political Parties: 'ఆనాడు ఒప్పుకుని.. ఇప్పుడు 3 రాజధానులనడం ప్రజలను వంచించడమే'

author img

By

Published : Sep 14, 2022, 10:23 PM IST

POLITICAL SUPPORT TO FARMERS

Political Parties Support To Mahapadayatra : రాజధాని రైతులకు మద్దతుగా రాజకీయపక్షాలు వారి వెంట నడుస్తున్నాయి. మూడో రోజు రైతుల పాదయాత్రలోనూ వైకాపా మినహా మిగతా రాజకీయ పక్షాల నేతలు పాల్గొన్నారు. అన్యాయంపై రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతిస్తే తప్పేంటని రాజకీయ పక్షాలు ప్రశ్నించాయి.

మూడో రోజు రైతుల వెంట.. రాజకీయ పార్టీలు

POLITICAL SUPPORT TO FARMERS : రాజధాని రైతుల పాదయాత్రలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం నుంచి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, తెనాలి శ్రావణ్‌కుమార్, జీవీ ఆంజనేయులు.. రైతుల వెంట నడిచారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతికి ఒప్పుకుని.. ఇప్పుడు మూడు రాజధానులు అనడం ప్రజలను వంచించడమేనని ఆనంద్ బాబు అన్నారు.

పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసుల ద్వారా ప్రయత్నిస్తోందని తెనాలి శ్రావణ్ కుమార్ ఆరోపించారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. హైకోర్టు తీర్పును అమలు చేయాలని జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. రైతుల పాదయాత్ర కోసం జీవీ ఆంజనేయులు రూ.5 లక్షలు విరాళం అందజేశారు. ముఖ్యమంత్రికి మూడు రాజధానులు కావాలంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని బుచ్చయ్య చౌదరి సవాలు విసిరారు.

రాజధాని రైతుల పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని గుంటూరు జిల్లా భాజపా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ అన్నారు. రైతుల పాదయాత్రలో పాల్గొన్న ఆయన.. ముఖ్యమంత్రి, మంత్రులపై విరుచుకుపడ్డారు. ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చిన నాయకులకు విధ్వంసం తప్ప పరిపాలన చేతగాదన్నారు. రైతుల పోరాటానికి ఆమ్‌ఆద్మీ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ తెలిపారు.

జనసేన పార్టీకి చెందిన నేతలు రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు. సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన నాయకులు సైతం ఎర్ర జెండాలతో రైతుల వెంట నడిచారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.