రైతుల విజ్ఞాపన యాత్రను అడ్డుకున్న పోలీసులు.. అరెస్టు

author img

By

Published : Jan 10, 2022, 2:39 PM IST

రైతుల విజ్ఞాపన యాత్రను అడ్డుకున్న పోలీసులు

FARMER ORGANISATIONS TO CM OFFICE: రైతు సంఘాలు తలపెట్టిన విజ్ఞాపన యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద రైతులను అరెస్టు చేశారు.

FARMER ORGANISATIONS TO CM OFFICE : సుబాబుల్‌, జామాయిల్, సరుగుడు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ సీఎం క్యాంపు కార్యాలయానికి రైతు సంఘాలు చేపట్టిన విజ్ఞాపన యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయం సమీపంలో రైతులను అరెస్ట్ చేసి తాడేపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు.

గత ప్రభుత్వం టన్నుకు 5 వేల రూపాయలు ఇస్తే.. ప్రస్తుతం 15 వందలే ఇస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సుబాబుల్ పంటకు గిట్టుబాటు ధర నిర్ణయించేందుకు నియమించిన మంత్రి వర్గ ఉపసంఘం తక్షణమే స్పందించాలని డిమాండ్ రైతు నేతలు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి బాధలు చెప్పుకునేందుకు వస్తే.. పోలీసులు అరెస్ట్ చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం నివాసం, క్యాంప్ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు..
అఖిలపక్ష రైతు సంఘాలు.. విజ్ఞాపన యాత్రకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం నివాసం, క్యాంపు కార్యాలయ పరిసరాల్లో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. జామాయిల్, సుబాబుల్, సరుగుడు కర్రకు మద్ధతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... రైతు సంఘాలు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి విజ్ఞాపన యాత్ర చేపట్టారు.

ఇదీ చదవండి:

SECURITY AT CM CAMP OFFICE: సీఎం నివాసం, క్యాంప్ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.