వైరలవుతున్న బాబాయ్, అబ్బాయ్‌ల ట్వీట్లు... ఏముందంటే..?
Updated on: Sep 24, 2022, 6:16 PM IST

వైరలవుతున్న బాబాయ్, అబ్బాయ్‌ల ట్వీట్లు... ఏముందంటే..?
Updated on: Sep 24, 2022, 6:16 PM IST
NTR Health University: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఎన్టీఆర్ పేరు తొలగింపుపై వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్, నందమూరి బాలకృష్ణ ఈ అంశంపై ట్వీట్లు చేశారు. ఇందులో నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్లు వైరల్‌గా మారాయి.
Nandamuri Balakrishna on NTR Name change issue: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చడంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. ‘‘మార్చేయడానికి.. తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదు. ఓ సంస్కృతి, నాగరికత, తెలుగుజాతి వెన్నెముక.. ఎన్టీఆర్. తండ్రి గద్దెనెక్కి ఎయిర్‌పోర్టు పేరు మార్చారు.. ఇప్పుడు కుమారుడు గద్దెనెక్కి వర్సిటీ పేరు మారుస్తున్నారు. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు.. పంచభూతాలున్నాయి.. తస్మాత్ జాగ్రత్త. మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు’’ అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
Jr. NTR on NTR Name change issue: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్ స్పందించారు. ఎన్టీఆర్, వైఎస్‌ఆర్ విశేషాదరణ పొందిన గొప్ప నాయకులని జూనియర్ ఎన్టీఆర్ కొనియాడారు. వర్సిటీ పేరు మార్పుతో ఎన్టీఆర్ కీర్తిని చెరిపివేయలేరని స్పష్టం చేశారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ పేరును చెరిపివేయలేరని ట్విటర్ వేదికగా తెలిపారు.
''ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ పొందిన నాయకులే. ఈ విధంగా ఒకరి పేరు తొలగించి మరొకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదు... ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు.'' -ట్విట్టర్లో జూనియర్ ఎన్టీఆర్
-
— Jr NTR (@tarak9999) September 22, 2022
ఇవీ చదవండి:
