"బెయిల్ ఇప్పిస్తా.. ఖర్చవుతుంది.." మంత్రి పీఏ పేరుతో ఆడియో వైరల్!

author img

By

Published : Jun 23, 2022, 8:53 AM IST

Updated : Jun 23, 2022, 11:03 AM IST

audio viral

Audio Viral: ఓ నిందితుడికి స్టేషన్‌ బెయిల్‌ ఇప్పించేందుకు మంత్రి పీఏ పేరిట ఓవ్యక్తి డబ్బులు డిమాండ్‌ చేశాడు. అతడు మాట్లాడిన ఆడియో సంభాషణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సంఘటన.. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో జరిగింది.

Audio Viral: ఇప్పుడే ఏసీపీతో మాట్లాడా.. స్టేషన్‌ బెయిల్‌ ఇప్పిస్తా.. ఏం కాదు మీరు స్టేషన్‌కి వెళ్లి కలవండి.. మంత్రి పీఏ మల్లికార్జున్‌ సార్‌ చెప్పాడని చెప్పండి’... ‘కొంత డబ్బులు ఖర్చవుతాయి. ఏసీపీ, సీఐలకు అడ్జస్ట్‌ చేయాలి. డబ్బులు మాత్రం తక్షణమే కావాలి. ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు. చెప్తే పోలీసులు బద్నామ్‌ అవుతారు. ఎంత మొత్తమనేది నేను చెప్తా’ అంటూ ఓ నిందితుడికి స్టేషన్‌ బెయిల్‌ ఇప్పించేందుకు మంత్రి పీఏ పేరిట డబ్బులు డిమాండ్‌ చేసిన ఆడియో వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

audio viral

తెలంగాణలోని కరీంనగర్‌ నగరంలో గత నెల 17న పోలీసులు అనుమతులు లేని తాగునీటి శుద్ధి కేంద్రాలను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కొన్నింటిపై కేసులు నమోదు చేశారు. ఇలా కేసు నమోదైన ఓ బాధితుడికి స్టేషన్‌ బెయిల్‌ ఇప్పించే విషయమై అతనితో మంత్రి పీఏనంటూ చెప్పుకున్న వ్యక్తి మాట్లాడిన 3.53 నిమిషాల నిడివి గల రెండు ఆడియో సంభాషణలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయంపై సంబంధిత మంత్రి గంగుల కమలాకర్‌ వివరణ ఇచ్చారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే సదరు పీఆర్‌వో ఆడియోలో తన పీఏగా చెప్పుకొన్న వ్యక్తిని విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు.

మరోపక్క ఈ వ్యవహారంలో పోలీసుల ప్రస్తావన అందులో ఉన్నందున అదనపు డీజీపీ, ఇన్‌ఛార్జి ఐజీ నాగిరెడ్డి జిల్లా పోలీసుల నుంచి వివరణ కోరినట్లు తెలిసింది. ఈ ఆడియో సంభాషణలో పోలీసుల పేర్లను ప్రస్తావించడం పట్ల కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ సత్యనారాయణను వివరణ ఇచ్చారు. అదనపు డీసీపీ నేతృత్వంలో పూర్తిస్థాయి విచారణ చేయిస్తున్నట్లు ఆయన చెప్పారు.

Last Updated :Jun 23, 2022, 11:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.