ఏళ్లనాటి సమస్యకు పరిష్కారం.. సీఎంకు ధన్యవాదాలు: ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య

author img

By

Published : May 11, 2022, 4:17 PM IST

వెంకట్రామిరెడ్డి

Leaders of survey department employee unions met CM Jagan: ముఖ్యమంత్రి జగన్ ను సర్వే విభాగ ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపినట్లు ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్య పరిష్కారమైనందుకుగానూ ధన్యవాదాలు తెలిపినట్లు వివరించారు.

Leaders of survey department employee unions met CM Jagan: ముఖ్యమంత్రి జగన్ ను సర్వే విభాగ ఉద్యోగ సంఘాల నేతలు కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్య పరిష్కారమైనందుకుగానూ ధన్యవాదాలు తెలిపినట్లు ఆయన వివరించారు.

సర్వే విభాగంలో 400 మందికి పదోన్నతులు కల్పించేందుకు సీఎం చర్యలు తీసుకోనున్నారని తెలిపారు. గత రెండేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు ఆగాయని.. జూన్‌లో సాధారణ బదిలీలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని పేర్కొన్నారు. జూన్ 30 నాటికి సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేస్తామన్నట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేస్తామన్నారన్నారు వెంకట్రామిరెడ్డి. పీఆర్సీపై పెండింగ్ జీవోలు ఇవాళ ఇస్తారని ఆశిస్తున్నామని వెంకట రెడ్డి అన్నారు. పెండింగ్‌ అంశాలు, సీపీఎస్‌పై ఇవాళ్టి కౌన్సిల్‌ సమావేశంలో చర్చించనున్నట్లు వివరించారు.

" సీఎంకు కృతజ్ఞతలు తెలిపాం. సర్వే విభాగంలో 400 మంది పదోన్నతులకు సీఎం చర్యలు తీసుకోనున్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్య పరిష్కారమైంది.గత రెండేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు ఆగాయి. జూన్‌లో సాధారణ బదిలీలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. జూన్ 30 నాటికి సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేస్తామన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేస్తామన్నారు.పీఆర్సీపై పెండింగ్ జీవోలు నేడు ఇస్తారని ఆశిస్తున్నాం. పెండింగ్‌ అంశాలు, సీపీఎస్‌పై ఇవాళ్టి కౌన్సిల్‌ సమావేశంలో చర్చిస్తాం. - వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్‌ "

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.