రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు.. ఒక్కరోజే 4,955 కేసులు, ఒకరు మృతి

author img

By

Published : Jan 15, 2022, 4:44 PM IST

Updated : Jan 15, 2022, 5:22 PM IST

రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు

16:42 January 15

రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు

కరోనా హెల్త్ బులిటెన్
కరోనా హెల్త్ బులిటెన్

AP Corona Cases: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే 4,955 మందికి వైరస్ సోకగా.. ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి 397 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,870 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 35,673 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.

విశాఖ జిల్లాలో 1,103, చిత్తూరు 1,039, నెల్లూరు 397, కడప 377, గుంటూరు 326, కర్నూలు 323 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించారు.

దేశంలో కరోనా ఉపద్రవం..
భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజే.. 2,68,833 కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 402 మంది మరణించారు. 1,22,684 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. కరోనా​ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 16.66 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • మొత్తం మరణాలు: 48,57,52
  • యాక్టివ్ కేసులు: 14,17,820
  • మొత్తం కోలుకున్నవారు: 34,94,7,390

దేశంలో ఒమిక్రాన్ కేసులు..
దేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6,041కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

అంతర్జాతీయంగా..
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 31,71,780 మందికి కరోనా సోకింది. 7,629 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 32,42,68,862కి చేరగా.. మరణాలు 55,46,837కు పెరిగింది.

  • అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 8,05,620 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. 2,140 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 6.6 కోట్లు దాటింది.
  • ఫ్రాన్స్​లో ఒక్కరోజే 3,29,371 కేసులు వెలుగుచూశాయి. మరో 191 మంది చనిపోయారు.
  • బ్రిటన్​లో మరో 99,652 మంది వైరస్ బారిన పడ్డారు.​ 270 మంది మృతి చెందారు.
  • ఇటలీలో 1,86,253 కొత్త కేసులు బయటపడగా.. 360 మంది మరణించారు.
  • స్పెయిన్​లో 1,62,508 మందికి కొత్తగా వైరస్​ సోకింది. మరో 139 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి :

వ్యాక్సినేషన్‌లో దూసుకెళ్తున్న దేశాలు.. భారత్ ఎన్నో స్థానమంటే?

Last Updated :Jan 15, 2022, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.