Krishna river dispute: కృష్ణా జలాల పంపిణీపై క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ప్రారంభం

author img

By

Published : Nov 23, 2021, 10:34 PM IST

Krishna river dispute

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదంలో(Water dispute between Telangana and AP) భాగంగా.. కృష్ణా ట్రైబ్యూనల్‌లో మూడు రోజుల క్రాస్‌ ఎగ్జామినేషన్‌(Krishna Tribunal tribunal started cross-examination) మంగళవారం ప్రారంభమైంది. తెలంగాణ సాక్షి ఘనశ్యాం ఝాను ఆంధ్రప్రదేశ్‌ సీనియర్‌ న్యాయవాది వెంకటరమణి క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేశారు. ఎస్‌ఆర్‌బీసీ, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా నీటి వినియోగం వంటి అంశాలపై ప్రశ్నలు అడిగారు.

Water dispute between Telangana and Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపకం విషయంలో.. కృష్ణా ట్రైబ్యునల్‌లో మూడు రోజుల క్రాస్‌ ఎగ్జామినేషన్‌(Krishna Tribunal tribunal started cross-examination) మంగళవారం ప్రారంభమైంది. జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ ధర్మాసనం ముందు తెలంగాణ సాక్షి ఘనశ్యాం ఝాను ఆంధ్రప్రదేశ్‌ సీనియర్‌ న్యాయవాది వెంకటరమణి క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేశారు. ఆర్‌డీఎస్‌ వినియోగం సంవత్సరానికి 15.9 TMC నుంచి 4.52 TMCలకు తగ్గించబడిందని, కృష్ణా తొలి ట్రైబ్యునల్‌ భవిష్యత్ అవసరాలకు కేటాయింపులు చేస్తున్నప్పుడు.. బయటి బేసిన్ అవసరాల కంటే బేసిన్ అంతర్గత ప్రాజెక్ట్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని షరతు విధించిందని.. ఏపీ న్యాయవాది ప్రశ్నలకు తెలంగాణ సాక్షి సమాధానమిచ్చారు. వీటితోపాటు.. ఎస్‌ఆర్‌బీసీ, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌(pothireddypadu head regulator) ద్వారా నీటి వినియోగం.. తదితర అంశాలపై వెంకటరమణి అడిగిన ప్రశ్నలకు.. ఘనశ్యాం ఝా సమాధానమిచ్చారు. క్రాస్‌ ఎగ్జామినేషన్‌ రేపు కూడా కొనసాగనుందని అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

Somasila project: జలాశయం తెగిపోయిందని వదంతులు..జనం పరుగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.