నేను అటెండర్​గా ఉద్యోగం ప్రారంభించాను.. నాకు లంచం వద్దు

author img

By

Published : Sep 15, 2022, 9:09 PM IST

bribe

Government Employee Innovative Presentation: ఏ ప్రభుత్వ శాఖ చూసిన ఏం ఉంది గర్వకారణం.. అన్ని ప్రభుత్వ శాఖలు అవినీతి మయం అని ప్రజల్లో బలంగా నాటుకు పోయిన మాట. అందులో రెవెన్యూ శాఖ మాటకి వస్తే ఇది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టేబుల్​ కింద చేయి తడవినిదే పని కాని పరిస్థితి అలా ఉన్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగస్థులు. కానీ ఇక్కడున్న ఈ ప్రభుత్వ ఉద్యోగి మాత్రం అందుకు విభిన్నంగా "నాకు లంచం వద్దు" అని తన మెడలో ఓ కార్డు పెట్టుకొని వినూత్నంగా తన భావాన్ని వ్యక్తీకరిస్తున్నాడు. అతను ఏంటో అతని మాటలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Government Employee Innovative Presentation: తెలంగాణ సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం ఆసక్తికర సంఘటన జరిగింది. తహశీల్దార్ కార్యాలయంలో ఎఆర్​ఐగా విధులు నిర్వహించే చిలకరాజు నర్సయ్య అనే ఉద్యోగి "నాకు లంచం వద్దు" అని రాసి ఉన్న కార్డును ధరించి విధులకు హజరయ్యారు. దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అటెండర్​గా ఉద్యోగం ప్రారంభించిన నేను ఇప్పుడు ఎఆర్​ఐగా పదోన్నతి పొందానని తనకు ఇది చాలా సంతృప్తిగా ఉందని నర్సయ్య తెలిపారు. లంచం తీసుకోకూడదు అనే నిర్ణయం సొంతంగా తీసుకుందని పేర్కొన్నారు. ఈ నిర‌్ణయాన్ని సాటి ఉద్యోగులు స్వాగతించాలని ఆయన కోరారు.

"ఈరోజు మాకుటుంబ సభ్యుల అనుమతి, వారి ప్రోత్సహంతో ఈ నిర్ణయం తీసుకున్న.. అటెండర్​గా ఉద్యోగం ప్రారంభించి ఇప్పుడు ఎఆర్​ఐగా పదోన్నతి పొందాను. నాకు ఇది చాలా సంతృప్తిగా ఉంది. లంచం తీసుకోకూడదు అనే నిర్ణయం సొంతంగా తీసుకుంది. ఈ నిర‌్ణయాన్ని సాటి ఉద్యోగులు స్వాగతించాలని కోరుకుంటున్నాను. నేను ఇలా కార్డుపై ప్రదర్శించి రెండో రోజు. నా జీవితాంతం ఇలానే ఆఫీస్​కి వస్తానని నిర్ణయించుకున్నా."-చిలకరాజు నర్సయ్య, ఎఆర్​ఐ పాలకీడు

bribe

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.