బిగ్​బాస్​ రియాల్టీ షో... అశ్లీలతపై ఘాటుగా స్పందించిన హైకోర్టు

author img

By

Published : Sep 30, 2022, 2:11 PM IST

High Court

High Court on Bigg Boss reality show: బిగ్​బాస్​ రియాల్టీ షోపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిగింది. వివరణ ఇచ్చేందుకు కేంద్రం తరఫు న్యాయవాది సమయం కోరడంతో ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబరు 11కు వాయిదా వేసింది.

High Court on Bigg Boss reality show: బిగ్​బాస్ షోలో అశ్లీలత పెరిగిందని సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దాఖలు చేసిన పిల్​పై హైకోర్టు విచారణ జరిపింది. బిగ్​బాస్ రియాల్టీ షోలో ఐబీఎఫ్ గైడ్​లైన్స్ పాటించలేదని పిటిషన్ తరఫు న్యాయవాది శివప్రసాద్ రెడ్డి వాదనలు వినిపించారు. అశ్లీలత ఎక్కువగా ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది... ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

అశ్లీలతపై న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు కేంద్రం తరఫు న్యాయవాది... సమయం కావాలని కోర్టును కోరారు. ప్రతివాదులకు నోటీసులపై తదుపరి వాయిదాలో నిర్ణయిస్తామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను అక్టోబరు 11కు వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.