Three Capitals Withdrawn: 3 రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న ప్రభుత్వం

author img

By

Published : Nov 22, 2021, 12:01 PM IST

Updated : Nov 22, 2021, 3:10 PM IST

Government's sensational decision on three capitals

15:06 November 22

వికేంద్రీకరణ బిల్లు పూర్తిగా రద్దు చేయాలి: ఎంపీ రామ్మోహన్

  • వికేంద్రీకరణ బిల్లు పూర్తిగా రద్దు చేయాలి: ఎంపీ రామ్మోహన్
  • ప్రభుత్వం మదిలో కుట్ర ఏమైనా ఉందా అని అనుమానం: రామ్మోహన్‌
  • ప్రజలను గందరగోళం చేయకుండా స్పష్టత ఇవ్వాలి: ఎంపీ రామ్మోహన్
  • అమరావతిపై తెదేపా ఆది నుంచీ గట్టిగా పోరాడుతోంది: ఎంపీ రామ్మోహన్
  • రైతుల పాదయాత్ర స్పందన చూసి ప్రభుత్వం ఆలోచించింది: రామ్మోహన్‌
  • రాజధానిపై జగన్ స్వయంగా ప్రకటన చేయాలి: ఎంపీ రామ్మోహన్‌
  • మరో నాటకానికి జగన్‌ తెరలేపుతున్నారని అనుమానం: ఎంపీ రామ్మోహన్‌
  • అమరావతిపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు తెదేపా పోరు ఆగదు: రామ్మోహన్‌

14:49 November 22

శుక్రవారంలోపు పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశం

  • అమరావతి రాజధాని వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ
  • 3 రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దు వివరాలు సమర్పించాలని ఆదేశం
  • వివరాల సమర్పణకు కొంత సమయం కోరిన అడ్వకేట్‌ జనరల్‌
  • శుక్రవారంలోపు పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశం
  • విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు

13:28 November 22

మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు సరికాదు: ఎంపీ రఘురామరాజు

  • రైతులను చూసి 3 రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకోలేదని పెద్దిరెడ్డి అన్నారు: ఎంపీ రఘురామరాజు
  • భాజపా నేతలను చూసి 3 రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకున్నారా? : ఎంపీ రఘురామరాజు
  • మంత్రి పెద్దిరెడ్డి అలా మాట్లాడడం సరికాదు : ఎంపీ రఘురామరాజు
  • చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రైతులను పరామర్శించలేదని అప్పట్లో జగన్‌ అన్నారు : ఎంపీ రఘురామరాజు
  • ఇప్పుడు జగన్‌ కూడా వరద ప్రాంతాలను హెలికాప్టర్‌లో చూసి వెళ్లిపోయారు : ఎంపీ రఘురామరాజు
  • వరదల్లో 70-80 మంది ప్రాణాలు కోల్పోయారు : ఎంపీ రఘురామరాజు
  • వరద ప్రాంతాల్లో సీఎం క్యాంపు పెట్టి పర్యవేక్షిస్తే బావుండేది : ఎంపీ రఘురామరాజు

13:02 November 22

చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్‌ మాత్రమే: మంత్రి పెద్దిరెడ్డి

  • మూడు రాజధానుల ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి స్పందన
  • చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్‌ మాత్రమే: మంత్రి పెద్దిరెడ్డి
  • శుభం కార్డుకు మరింత సమయం ఉంది: మంత్రి పెద్దిరెడ్డి
  • సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్‌: పెద్దిరెడ్డి
  • నేను ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నా: మంత్రి పెద్దిరెడ్డి
  • ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ కాదు: మంత్రి పెద్దిరెడ్డి
  • అమరావతి రైతుల పాదయాత్ర లక్షలమందితో సాగుతోందా?: మంత్రి పెద్దిరెడ్డి
  • అమరావతి రైతుల పాదయాత్ర... పెయిడ్‌ ఆర్టిస్టుల పాదయాత్ర: మంత్రి పెద్దిరెడ్డి
  • రైతుల పాదయాత్ర చూసి చట్టం ఉపసంహరించుకోలేదు: మంత్రి పెద్దిరెడ్డి

12:02 November 22

ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

  • మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటూ నిర్ణయం
  • చట్టం ఉపసంహరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం

12:01 November 22

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: అమరావతి ఐకాస

  • ప్రజావ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాల్సిందే: అమరావతి ఐకాస
  • ఇకనైనా అమరావతి ప్రాంతాన్ని త్వరగా అభివృద్ధి చేయాలి: అమరావతి ఐకాస
  • ఇన్నాళ్లూ అమరావతిని విమర్శించినవాళ్లు క్షమాపణ చెప్పాలి: అమరావతి ఐకాస
  • మహాపాదయాత్ర కొనసాగుతుంది: అమరావతి ఐకాస
  • ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలి: అమరావతి ఐకాస
  • ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించేవరకూ ఉద్యమం ఆగదు: అమరావతి ఐకాస

11:49 November 22

మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న ప్రభుత్వం

  • మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
  • మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న రాష్ట్ర ప్రభుత్వం
  • చట్టాన్ని ఉపసంహరించుకున్నట్లు హైకోర్టుకు తెలిపిన అడ్వకేట్‌ జనరల్‌
  • వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను కేబినెట్‌ రద్దుచేసింది: ఏజీ
  • చట్టం రద్దుపై కాసేపట్లో అసెంబ్లీలో సీఎం ప్రకటన చేస్తారు: అడ్వకేట్‌ జనరల్‌
  • త్రిసభ్య ధర్మాసనం ముందు వివరాలు నివేదించిన అడ్వకేట్ జనరల్
  • విచారణ మధ్యాహ్నం 2.15 గం.కు వాయిదా వేసిన త్రిసభ్య ధర్మాసనం
Last Updated :Nov 22, 2021, 3:10 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.