Police case on Mohan Babu: సినీనటుడు మోహన్​ బాబుపై ఫిర్యాదు.. వెంటనే...

author img

By

Published : Oct 20, 2021, 12:11 PM IST

Police case on Mohan Babu

మా(Maa elections 2021) ఎన్నికల పంచాయితీ రోజుకో మలుపు తిరుగుతోంది. విష్ణు ప్యానెల్​ వర్సెస్ ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మాటల యుద్ధం నేటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం.. ప్రముఖ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్​ బాబుపై పోలీసు కేసు(Police case on Mohan Babu) నమోదైంది. మా కొత్త కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మోహన్​బాబు తమ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని ఓ సామాజిక వర్గం వారు పోలీసులను ఆశ్రయించారు.

మా(Maa elections 2021) ఎన్నికలు ముగిశాయి. మాటల యుద్ధం మాత్రం కొనసాగుతోంది. ప్రతిరోజూ ఏదో ఒక ఇష్యూతో 'మా'.. చర్చనీయాంశం అవుతూనే ఉంది . మోహన్ బాబుపై పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు(Police case on Mohan Babu)తో మా మరోసారి వార్తలకెక్కింది. తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీసులకు మేకలు, గొర్రెల పెంపకందారులు(GMPS) ఫిర్యాదు(Police case on Mohan Babu) చేశారు. మోహన్ బాబు తమ మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని వారు తెలిపారు.

  • అసలు మోహన్​బాబు ఏమన్నారంటే...

' సినిమా ఎన్నికల్లో ఏంటీ గొడవలు.. ఏంటీ బీభత్సం.. ఏంటీ ఘర్షణలు.. ప్రజలందరూ చూస్తున్నారు. ఆ విషయం గమనిస్తున్నారా.. అసలు? సోషల్ మీడియా పెరిగిపోయింది. అందరి దగ్గరీ సెల్​పోన్లు ఉంటున్నాయి.. అందరి ఫోన్లలో కావాల్సినంత డేటా ఉంటోంది. ఇవాళ.. గొర్రెలు, మేకలు మేపుకునే వాడి దగ్గర కూడా సెల్​పోన్ ఉంది. అతను కూడా జరిగిందంతా... చూసేస్తున్నాడు. మన గొడవలు వాడికి కూడా తెలుస్తున్నాయి..' అని మోహన్ బాబు కామెంట్ చేశారు.

మోహన్ బాబు వ్యాఖ్యలు తమ గౌరవాన్ని, వృత్తిని కించపరిచేలా ఉన్నాయని మేకలు, గొర్రెల పెంపకందారులు తెలిపారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులను ఆశ్రయించిన వారిలో సంఘం జిల్లా అధ్యక్షుడు కలికినేని తిరీశ్​తోపాటు నేతలు బసినబోయిన గంగరాజు, రాము, లాలయ్య ఉన్నారు.

Police case on Mohan Babu
సినీనటుడు మోహన్​ బాబుపై ఫిర్యాదు..

ఇదీ చదవండి: Maa elections 2021: 'సీసీ టీవీ వీడియోలు బయటపెట్టాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.