గుండె సంబంధిత సమస్యలు.. ఈనాడు- ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు

author img

By

Published : Sep 22, 2022, 5:05 PM IST

AWARENESS PROGRAMS ON HEART PROBLEMS

AWARENESS PROGRAMS : నవయువకుల నుంచి నడివయస్కుల వరకు గుండె లయ తప్పుతోంది. ఆధునిక భారతంలో హృద్రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దీనికితోడు పోస్టు కొవిడ్ ఆందోళనలు తోడవుతున్నాయి. ఈ నేపథ్యంలో గుండె జబ్బులు - నివారణ, పోస్ట్ కొవిడ్ లక్షణాలు- నియంత్రణ అనే అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా ఈటీవీ - ఈనాడు అవగాహన సదస్సులు నిర్వహించింది.

AWARENESS PROGRAMS ON HEART PROBLEMS : మంచి ఆహార అలవాట్లు, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ..శారీరక వ్యాయామం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుందని ప్రముఖ వైద్యుడు కొసరాజు కమలాకర్ రావు అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో ఈటీవీ- ఈనాడు ఆధ్వర్యంలో గుండె సంబంధిత, శ్వాసకోశ వ్యాధులు, కొవిడ్ అనంతరం వస్తున్న సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. గుండె సమస్యలున్నవారు సకాలంలో వైద్యసహయం పొందాలని డాక్టర్ యు.రాజేష్ బాబు సూచించారు. సదస్సుకు వచ్చిన వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సదస్సుకు హాజరైన ప్రజలు డాక్టర్ల ద్వారా పలు అనుమానాలను నివృతి చేసుకున్నారు. ఈనాడు- ఈటీవీ ఇలాంటి సదస్సులు పెట్టడం వల్ల తమకు ఎంతో ఉపయోగంగా ఉందని సదస్సుకు హాజరైన చీరాల పట్టణ పౌరులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

విజయనగరంలోని తిరుమల మెడికోవర్ వైద్యశాలలో గుండె సమస్యలపై ఈనాడు-ఈటీవీ అవగాహన సదస్సు నిర్వహించారు. గుండె, నాడీ సంబంధిత సమస్యల కారణంగా చిన్నవయసులోనే అకాల మరణం చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోందని హృద్రోగ నిపుణులు శరత్ కుమార్ పాత్రో వెల్లడించారు. గుండె జబ్బులపై ముందస్తు అవగాహనతో ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. కొవిడ్ అనంతర ఆరోగ్య సమస్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలను పలువురు నిపుణులు విపులీకరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.