Dussehra tour దసరా ప్రయాణాలకు తిప్పలు తప్పేలా లేవు...

author img

By

Published : Sep 11, 2022, 8:55 AM IST

Etv Bharat

Dussehra దసరాకు సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న వారికి రైళ్లలో నిరీక్షణ జాబితా చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. పలు మార్గాల్లో ప్రయాణించే రైళ్లలో బెర్తులన్నీ నిండిపోయాయి. వెయిటింగ్‌ లిస్ట్‌ వందల్లో ఉంటోంది. అటు బస్సు ఛార్జీల మాటెత్తితేనే ప్రయాణికులు ఉలిక్కి పడుతున్నారు. ఇక ఇదే సమయంలో ప్రైవేటు ట్రావెల్స్‌ వారు మాంచి దూకుడులో ధరలను పెట్టారు.

Travel Troubles: దసరాకు సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న వారి పరిస్థితి అయోమయంగా మారింది. రైళ్లలో వెయిటింగ్ లిస్టు చూస్తే కళ్లు తిరుగుతున్నాయి. పలు మార్గాల్లో ప్రయాణించే రైళ్లలో బెర్తులన్నీ నిండిపోయాయి. వెయిటింగ్‌ లిస్ట్‌ వందల్లోకి చేరింది. మరికొన్ని రైళ్లలో ఈ పరిమితి దాటి రిగ్రెట్‌ చూపిస్తోంది. వరుసగా ఆర్టీసీ టికెట్‌ ఛార్జీలు పెంచేయడంతో... బస్సు ప్రయాణాలు అంటే, ప్రజలు ఉలిక్కి పడుతున్నారు.

రైళ్లలో రిజర్వేషన్‌కు ప్రయత్నిస్తే బెర్తులు దొరకడం లేదు

బంధుమిత్రులతో కలిసి సరదాగా దసరా పండుగ చేసుకుందామన్న వారికి.. ప్రయాణ అసౌకర్యాలతో నిరాశ తప్పేలా లేదు. ఉద్యోగాలు, వ్యాపారులు, చదువుల నిమిత్తం పట్టణాలు,నగరాల్లో ఉంటున్నవారే ఎక్కువ. పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు రైళ్లలో రిజర్వేషన్‌కు ప్రయత్నిస్తే బెర్తులు లేవు. అక్టోబరు 3న దుర్గాష్టమి, 4న నవమి, 5న విజయదశమి కావడంతో ఈ నెల 30, అక్టోబరు 1, 2 తేదీల్లో ఎక్కువ మంది పల్లెలకు పయనమవుతున్నారు. ఆయా తేదీల్లో రైళ్లలో బెర్తులన్నీ నిండిపోయాయి. విజయవాడ నుంచి శ్రీకాకుళం రోడ్‌ వైపు వెళ్లే హౌరా, భువనేశ్వర్‌ రైళ్లలో నిరీక్షణ జాబితా వందల్లో ఉంది. ఫలక్‌నుమా, గువాహటి, కోణార్క్‌, హౌరా-యశ్వంత్‌పూర్‌, మెయిల్‌, ఈస్ట్‌కోస్ట్‌, విశాఖ, తిరుపతి-పూరీ ఎక్స్‌ప్రెస్‌ల్లో స్లీపర్‌ బెర్తులన్నీ నిండిపోయి... వెయిటింగ్ లిస్ట్ 100 నుంచి 200 వరకు ఉంటోంది. గువాహటి ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్‌క్లాస్‌ వెయిటింగ్‌ లిస్ట్ 294 ఉంది. ఫలక్‌నుమాలో ఈ నెల 30 నుంచి అక్టోబర్ 5 వరకు నిరీక్షణ పరిమితి దాటి రిగ్రెట్‌ చూపిస్తోంది.

షాక్ కొడుతున్న బస్సు ఛార్జీలు

విజయవాడ నుంచి అనంతపురం వెళ్లేందుకు మూడు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో అక్టోబర్ 1, 2 తేదీల్లో స్లీపర్‌క్లాస్‌లో రిగ్రెట్‌ చూపిస్తోంది. ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌లో అక్టోబర్ 1న స్లీపర్‌ వెయిటింగ్‌ లిస్ట్‌ 232, రెండో తేదీన రిగ్రెట్‌ చూపిస్తోంది. విజయవాడ నుంచి తిరుపతి మీదుగా వెళ్లే కేరళ, శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌ల్లో స్లీపర్‌క్లాస్‌ నిరీక్షణ జాబితా ఎక్కువగా ఉంది. పద్మావతి, తిరుమలలోనూ ఇదే పరిస్థితి. విశాఖ నుంచి దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లు అన్నింటిలో వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఎలాగైనా ఊరు వెళ్లాలనుకునేవాళ్లు స్లీపర్‌క్లాస్‌కు బదులు కొంత ఎక్కువ మొత్తం వెచ్చించి ఏసీ త్రీటైర్‌లో వెళ్లాలనుకున్నప్పటికీ, అందులోనూ బెర్తులు లభించక తల పట్టుకుంటున్నారు. బస్సు ఛార్జీలు చూస్తేనే ప్రజలు షాక్ అవుతున్నారు. రైళ్లలో స్లీపర్‌క్లాస్‌ ఛార్జీలతో పోలిస్తే ఆర్టీసీ ఛార్జీలే ఎక్కువ. ఈ ఏడాది ఏప్రిల్‌, జులైల్లో ఆర్టీసీ ఛార్జీలు పెంచేసింది. సూపర్‌లగ్జరీ, ఏసీ ఇంద్రలో టిక్కెట్‌ ధర భారీగా పెరిగింది. ప్రైవేటు ట్రావెల్స్‌లో అయితే 2వేల వరకు ధరలున్నాయి. ఇంత ఎక్కువ ధరలు వాయిస్తుంటే... పండగ పూట ప్రయాణమెలా చేయాలని సామాన్యులు పెదవి విరుస్తున్నారు.

దసపా ప్రయాణాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.