అర్జెంటుగా లావు తగ్గాలా..? వాళ్లు చిటికెలో పిండేస్తారు..!!

author img

By

Published : Sep 24, 2022, 5:56 PM IST

weight loss

weight loss: ప్రతి మనిషికీ సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది.. మనం తీసుకునే నిర్ణయాన్ని అది ఖచ్చితంగా జడ్జ్ చేస్తుంది. కానీ.. మనం దాన్ని పట్టించుకోం కదా..! "ఛస్ నోర్మూసుకో.." అని దాని గొంతు నొక్కేస్తాం. ఎందుకంటే.. అది సిన్సియర్ ఆఫీసర్ లా డ్యూటీ చేస్తుంది.. అన్నీ రూల్స్ మాట్లాడుతుంది.. రోడ్డుకు లెఫ్ట్ సైడే నడవాలనే చెప్తుంది.. కానీ, మనం అడ్డదారిలో హైవే ఎక్కాలని చూస్తాం.. యాక్సిడెంట్ అయి"పోతాం.."

weight loss: ఏమన్నా అంటే.. అందరూ హర్ట్ అయిపోతారుగానీ.. ఓ విషయం చెప్పండి. 100 కేలరీలు ఒంట్లో చేరిపోయే తిండి ఏదో తిన్నామని అనుకుందాం. అవి కరగాలంటే.. ఒళ్లు వంచి ఆ మేరకు ఏదో ఒక వర్కవుట్ చేయాలి. అప్పుడే ఆ కేలరీస్ బర్న్ అవుతాయి. ఇది సింపుల్ సూత్రం కదా? ఇది తెలియడానికి మేధాశక్తి అవసరం లేదు కదా! సర్టిఫైడ్ డాక్టర్స్ కూడా ఇదే చెప్తారు. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలని సూచిస్తారు. కానీ.. మనలో చాలా మంది బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు మరి. పరీక్షకు చదవరుగానీ.. పాసైపోవాలి.. కుదిరితే ఫస్ట్ క్లాస్ రావాలని కోరుకున్నట్టుగా.. ఆరోగ్యం విషయంలోనూ ఇలాగే బిహేవ్ చేస్తున్నారు.

అల్లావుద్దీన్ అద్భుత దీపం కథలో.. "కుల్జా సిమ్.. సిమ్" అనే మంత్రం చదవగానే.. "జీనీ" బయటకు వచ్చేసి అల్లావుద్దీన్ కోరిక తీరుస్తాడు. సేమ్ టూ సేమ్.. మనుషులు తమ ఆరోగ్యం విషయంలోనూ ఇలాగే ఆలోచిస్తున్నారు. కానీ.. అదెలా సాధ్యం? తిన్న తిండిని వాష్ రూమ్ లో వదిలేస్తే సరిపోతుందా..? ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును కూడా మైదానంలోనో.. మరో చోటనో.. కరిగించాలి. కానీ.. అలా చేయరు. "హబ్బో.. అదంతా మనవల్ల ఎక్కడవుతుంది బాస్..? ఏదైనా షార్ట్ కట్ ఉంటే చెప్పండి" అంటారు.

సరిగ్గా అప్పుడే వచ్చేస్తారు సోషల్ మీడియా డాక్టర్లు. "అయ్యో ఎంతమాటా..? మేం ఉన్నది అందుకే కదా..! మా క్లినిక్ కు వచ్చేయండి.. కందగడ్డలా ఉన్న మిమ్మల్ని.. కలకంద స్వీట్ లా మార్చేస్తాం" అంటారు. వెంటనే.. ఓ డ్రీమ్ సీన్ వేసుకొని వెళ్లిపోతారు. కానీ.. వాళ్లు సర్టిఫైడ్ డాక్టర్లా? వాళ్లు వాడుతున్న మెడిసిన్ ఏంటి? వాళ్లు చేసే ట్రీట్ మెంట్ ద్వారా ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఇవేవీ ఆలోచించకుండా.. వెళ్లి బెడ్ మీద పడుకుంటారు. అలా వెళ్లిన ఓ ఇద్దరి పరిస్థితి ఏమైందో.. తెలుసుకోండి.

కేస్ నంబర్ 1 : వియాత్నాం దేశానికి చెందిన ఆమె వయసు 29 ఏళ్లు. బాడీలో పలుచోట్ల కొవ్వు పేరుకుపోయిందని బాధపడేది. అది చూసిన ఓ ఫ్రెండ్.. ఓ బ్యూటీ క్లినిక్ పేరు చెప్పింది. "చిటికెలో నిన్ను స్లిమ్ గా చేస్తారు పో" అని పంపించింది. ఆమెను పరీక్షించిన డాక్టర్(?).. కొవ్వు కరిగించడానికి ట్రీట్మెంట్ చేయాలని.. బ్రిటన్ నుంచి ఖరీదైన ఇంజెక్షన్ తేవాలని సూచించింది. మొత్తం 10 ఇంజక్షన్లు వేసుకోవాలని చెప్పి.. ఏకంగా 13 మిలియన్లు వసూలు చేసింది. కానీ.. ఆ మందును ఆమెకు చూపించలేదు. దాని పేరు.. డోస్.. ఈ వివరాలు కూడా చెప్పలేదు. ఇంజక్షను వేసి "ఇక, నీ పని అయిపోయినట్టే పో.." అని ఇంటికి పంపించారు.

సుమారు 10 రోజుల తర్వాత.. ఫలితం మొదలైంది. వెయిట్ తగ్గడం కాదు.. సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడం! తుంటి భాగం.. పొత్తికడుపు ఉబ్బింది. తీవ్రమైన నొప్పితో.. వేరే ఆసుపత్రికి పరిగెత్తింది. పరిశీలించిన వైద్యులు.. బ్యూటీ క్లిన్ వాళ్లు ఇంజెక్షన్ వేసిన ప్రాంతం చుట్టూ ఉన్న కణజాలం ఇన్ఫెక్షన్ సోకి.. నెక్రోటిక్‌గా మారిందని చెప్పారు. ఈ సమస్య ప్రాణాంతకమని.. ఆమెను బతికించాలంటే.. ఎన్నో ఆపరేషన్లు చేయాలని చెప్పేశారు.

సీన్ కట్ చేస్తే.. 6 నెలలు ఆసుపత్రి బెడ్ మీదనే పడుకుంది. కనీసం 30 ఆపరేషన్లు జరిగాయి. ఈ కాలంలో.. ఆమె ఒంటి మీద ఎక్కడపడితే అక్కడ చీము గడ్డలు ఏర్పడ్డాయి. హెవీ బ్లీడింగ్ జరిగింది. ప్రాణాలతో ఆసుపత్రి దాటి వెళ్తానని ఆమె అనుకోలేదు. కానీ.. చివరకు వైద్యులు వియవంతంగా ఆ ఇన్ ఫెక్షన్ తొలగించారు.

కేస్ నెంబర్ 2 : హోచిమిన్ జిల్లా-8కి చెందిన మహిళ వయసు 43 ఏళ్లు. ఈమె.. వెయిట్ తగ్గించుకునేందుకు మందులు వాడడం మొదలు పెట్టింది. కానీ.. రిజల్ట్ సరిగా లేదు. దీంతో.. "వెయిట్ లాస్ ఇంజెక్షన్" గురించి ఎవరో చెప్పారు. వెంటనే వెళ్లి మెడికల్ షాపులో అడిగింది. "ఎస్.. మేడం. మా దగ్గర కావాల్సినన్ని ఉన్నాయి." అని చెప్పారు. ఆ సూదిమందు దక్షిణ కొరియా నుండి దిగుమతి చేసుకున్నామని.. ధర ఎక్కువగా ఉంటుందని చెప్పి.. 4 లక్షల 30 వేలు వసూలు చేసి.. ఐదు ఇంజెక్షన్లు ఇచ్చారు.

"ఈ ఇంజెక్షన్ గురించి డాక్టర్ ఒపీనియన్ తీసుకోవాలా?" అంటే.. అబ్బే అవసరం లేదండీ.. ఫుల్ సేఫ్టీ. సింపుల్ గా మీరే ఇంజెక్ట్ చేసుకోవచ్చు" అని చెప్పారు మెడికల్ షాపు సిబ్బంది. దీంతో.. ఇంటికెళ్లి తన మేనకోడలితో ఇంజక్షన్ చేయించుకుంది. ఏడు రోజుల తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్. నడుము, కాళ్లు, పొత్తికడుపు.. ప్రాంతంలోంచి రక్తం కారుతోంది. వెంటనే మెడికల్ షాప్ కు ఫోన్ చేస్తే.. కట్ చేసి, నంబర్ బ్లాక్ లిస్టులో పెట్టేశారు. దీంతో.. అనివార్యంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.

"కొవ్వును కరిగించే ఫాస్ఫాటిడైల్‌కోలిన్ (PCC) అనే మెడిసిన్.. అయానిక్ డిటర్జెంట్ డియోక్సికోలేట్ సోడియంలో కరిగిందని చెప్పారు. దీని ఫలితంగా.. ఇలాంటి దారుణ పరిస్థితి వచ్చిందని చెప్పారు. నిజానికి ఈ మందును.. పల్మనరీ ఎంబోలిజం లేదా బ్లడ్ లిపిడ్ రోగాలతో బాధపడుతున్న వారికి మాత్రమే సిఫారసు చేస్తామని చెప్పారు. కానీ.. కొన్ని సంస్థలు కొవ్వు కరిగించే విషయంలో ఈ మందును.. 'సర్వరోగ నివారిణి'గా ప్రచారం చేశాయని అన్నారు. వైద్యులకు తెలియకుండా వీటిని తీసుకుంటే.. కొన్ని సార్లు ప్రాణాలు కూడా పోతాయని చెప్పారు. ఇలాంటి కేసులు.. అక్కడ వందల సంఖ్యలో నమోదయ్యాయి. వియత్నామీస్ వార్తా సంస్థ ZING ఈ కేసు వివరాలు వెల్లడించింది. కాబట్టి.. బీ కేర్ ఫుల్. కృత్రిమంగా కొలెస్టరాల్ తగ్గించుకోవాలనుకునే వారికి.. ఈ కేస్ స్టడీస్ ఖచ్చితంగా ఓ లెసన్.

ఇక్కడ.. మీ కోసం ఓ ఇన్ స్పైరింగ్ ఎగ్జాంపుల్.. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఎంత ఫిట్ గా ఉంటాడో తెలిసిందే. పక్కాగా డైట్ మెయింటెయిన్ చేస్తాడు.. వర్కవుట్స్ చేస్తాడు. ఓ రోజు సాయంత్రం.. ఎప్పటిలాగే ఎంత తినాలో అంతే తిన్నాడు. కానీ.. ఆ రోజు అర్ధరాత్రి వేళ ఎందుకో బాగా ఆకలి వేస్తోంది. బ్రెయిన్ తినాల్సిందే అంటోంది.. మనసు మాత్రం వద్దంటోంది. ఇలా చాలా సేపు యుద్ధం సాగింది. చివరకు ఓ కండీషన్ మేరకు.. ఆకలి తీర్చుకోవడానికి రాజీ కుదిరింది. మొత్తానికి తినేసి వెళ్లి పడుకున్నాడు. ఆ తర్వాత మార్నింగ్ నిద్ర లేచాడు. రాత్రి ఎక్స్​ట్రా తిన్నదాన్ని కరిగించేందుకు.. 2 వందల డిప్స్ ఎక్కువగా కొట్టాడట! ఇది కదా.. కమిట్ మెంట్ అంటే..!

నిజాయితీగా నిజాలు మాట్లాడుకుంటే.. 24 గంటల్లో వ్యాయామానికి ఒక్క గంట దొరకదా? అంత బిజీనా? అంటే.. "నో" అని ఖచ్చితంగా చెప్పొచ్చు. వరల్డ్ రిచెస్ట్ పర్సన్ ఎలన్ మస్క్​కు కూడా రోజుకో గంట వర్కవుట్ చేస్తాడు. అలాంటిది మనకు టైమ్ లేదనడం వట్టిమాట. నిండైన బద్ధకం అది. నిజంగా మిమ్మల్ని మీరు ప్రేమిస్తే.. మీ ఆరోగ్యాన్ని ప్రేమిస్తే.. దుప్పటిని ఒక్క తన్ను తన్నండి.. రెండు నిమిషాల్లో గ్రౌండ్ లో ఉంటారు. అంతేకానీ.. షార్ట్ కట్​లో ట్రై చేసి.. ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. "సక్సెస్​కు షార్ట్ కట్ లేదు బాసూ..."

వీటిపైనా ఓ క్లిక్కేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.