భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్​.. ఈరోజు రాత్రి 7 తర్వాత ఆన్‌లైన్‌ టికెట్లు

author img

By

Published : Sep 22, 2022, 5:28 PM IST

Cricket match Online tickets

T20 Tickets: హైదరాబాద్‌ జింఖానా గ్రౌండ్స్‌లో టీ-20 మ్యాచ్‌కు ఇవాళ్టి విక్రయ కోటా టికెట్లు పూర్తయినట్లు హెచ్‌సీఏ అధికారులు వెల్లడించారు. టికెట్ల కోసం వరుసలో ఉన్నవారిని పోలీసులు వెనక్కి పంపించారు. ఆన్‌లైన్‌ టికెట్లు రాత్రి 7 తర్వాత అందుబాటులో ఉంటాయని హెచ్‌సీఏ తెలిపింది.

T20 Tickets: హైదరాబాద్​ జింఖానా మైదానంలో భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు సంబంధించిన ఆఫ్‌లైన్‌ టికెట్ల విక్రయాలు పూర్తయినట్లు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) నిర్వాహకులు వెల్లడించారు. అయితే ఆన్‌లైన్‌ టికెట్లు ఈరోజు రాత్రి 7 తర్వాత అందుబాటులో ఉంచుతామన్నారు. ఈనెల 25న భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ ఉప్పల్‌ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ వీక్షించడం కోసం టికెట్ల కొనుగోలుకు అంచనాలకు మించి క్రికెట్‌ అభిమానులు వచ్చారు. భారీ సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొంతమంది అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు.

తొక్కిసలాట: భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్​ వేదికగా ఈ నెల 25న జరగనున్న టీ-ట్వంటీ మ్యాచ్​ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు భారీగా తరలిరావడంతో.. సికింద్రాబాద్​ జింఖానా మైదానం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టిక్కెట్ల కోసం నాలుగైదు రోజుల నుంచే భారీగా అభిమానులు తరలివచ్చారు. హెచ్​సీఏ టిక్కెట్లను బ్లాక్​లో అమ్ముతోందంటూ ఆందోళనలు చేపట్టారు. ఓ న్యాయవాది ఏకంగా హెచ్​ఆర్సీలో పిటిషన్​ వేశాడు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఆఫ్​లైన్​లో టికెట్లు ఇస్తామని హెచ్​సీఏ ప్రకటించడంతో.. క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు.

చాలా మంది తరలివస్తారనే అంచనాలు ఉన్నప్పటికీ.. సరైన ఏర్పాట్లు చేయలేదు. మెయిన్​ గేట్​ ద్వారా ఒక్కసారిగా అభిమానులు తోసుకొచ్చారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్​ చేశారు. తోపులాటలో కొందరు స్పృహ తప్పి పడిపోయారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సాంకేతిక సమస్యతో ఆన్​లైన్​ పేమెంట్లకు అంతరాయం కలిగింది. నగదు తీసుకుని సిబ్బంది టికెట్లు విక్రయిస్తున్నారు.

భారత్-ఆసీస్​ మ్యాచ్​ టికెట్ల వ్యవహారం కొంతకాలంగా ప్రహసనంగా మారింది. హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పాస్​ల జారీలోనూ గందరగోళం ఏర్పడింది. కొవిడ్​ పరిస్థితుల వల్ల క్రికెట్​ మ్యాచులు వీక్షించేందుకు అభిమానులకు పెద్దగా అవకాశం రాలేదు. ఐపీఎల్​ మ్యాచ్​లు కూడా హైదరాబాద్​లో నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో చాలా కాలం తర్వాత హైదరాబాద్​లో మ్యాచ్​ జరుగుతుండటంతో.. అభిమానులు టిక్కెట్ల కోసం ఎగబడ్డారు. అయితే సులభ ప్రక్రియలో టిక్కెట్లు ఇవ్వడంలో హెచ్​సీఏ పూర్తిగా విఫలమైంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.