CM KCR ON DALITHA BANDHU: ఎన్నికల సంఘం పరిధి దాటిందనిపిస్తోంది: కేసీఆర్

author img

By

Published : Oct 20, 2021, 11:52 AM IST

CM KCR ON DALITHA BANDHU: ఎన్నికల సంఘం పరిధి దాటిందనిపిస్తోంది: కేసీఆర్

దళితబంధుపై ఎన్నికల సంఘం నిర్ణయం.. తన పరిధిని అతిక్రమించినట్లుగా కనబడుతోందని తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR ON DALITHA BANDHU) అభిప్రాయపడ్డారు. ఏ పథకాన్ని చేపట్టాన్ని దాన్ని విజయతీరాలకు తీసుకెళ్లానని స్పష్టం చేశారు. అదే నమ్మకంతో హుజూరాబాద్​ ఉప ఎన్నిక ముగియగానే దళిత బంధు కొనసాగుతుందని భరోసా ఇచ్చారు. యాదాద్రి పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

CM KCR ON DALITHA BANDHU: ఎన్నికల సంఘం పరిధి దాటిందనిపిస్తోంది: కేసీఆర్

దళిత బంధు(CM KCR ON DALITHA BANDHU) నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశం.. చిన్న ఆటంకం మాత్రమేనని తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR ON DALITHA BANDHU)​ వ్యాఖ్యానించారు. ఈ పథకం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని స్పష్టం చేశారు. హుజూరాబాద్​ ఉప ఎన్నిక ముగియగానే దళితులందరికీ నిధులు అందిస్తానని హామీ ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఇప్పటి వరకూ ఏ పథకం చేపట్టినా.. దానిని విజయవంతంగా అమలు చేసినట్లు చెప్పారు. యాదాద్రి పర్యటనలో భాగంగా మంగళవారం.. మీడియా సమావేశంలో కేసీఆర్ స్పష్టం చేశారు.

ఎన్నికల సంఘం పరిధి దాటిందనిపిస్తోంది

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని నిలిపివేయాలని ఆదేశించి... ఎన్నికల సంఘం తన పరిధిని అతిక్రమించిందేమో అనిపిస్తోంది. దళితబంధు కొనసాగుతున్న పథకం. దళితబిడ్డలెవరూ ఆవేదన చెందవద్దు. ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. ఫలితాలు వెలువడిన వెంటనే.. నవంబరు 4 తర్వాత అందరికీ స్వయంగా దళితబంధు నిధులను అందజేస్తా. ఇప్పటి వరకూ ప్రతి పథకాన్ని విజయతీరాలకు చేర్చాను. దళితబంధు అమలుపై ఎన్నికల సంఘం ఆదేశం చిన్న ఆటంకం మాత్రమే. - సీఎం కేసీఆర్‌

ఈసీ నిర్ణయం

తెలంగాణలో ఈ నెల 30న జరగనున్న హుజూరాబాద్‌ ఉపఎన్నిక నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం(CM KCR ON DALITHA BANDHU) తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌కు ఈసీ లేఖ రాసింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న తరుణంలో ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. హుజూరాబాద్‌ ఉపఎన్నిక పూర్తయ్యే వరకు దళితబంధు అమలును నిలిపివేయాలని.. ఎన్నిక తర్వాత యథావిధిగా కొనసాగించవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

హుజూరాబాద్ ఉపఎన్నిక పూర్తయ్యే వరకు దళితబంధు నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే ప్రక్రియను నిలిపివేయనున్నట్లు కరీంనగర్​ జిల్లా కలెక్టర్​ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక బరిలో వివిధ పార్టీలకు చెందిన 30 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ నెల 30న ఉప ఎన్నిక పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 2వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది.

కాగా ఈసీ నిర్ణయంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ స్పందించారు. సీఎం కేసీఆర్​ చర్యల వల్లే దళిత బంధు ఆగిందని బండి సంజయ్‌ ఆరోపించారు. దళితబంధును పూర్తి స్థాయిలో ప్రారంభించకుండా... ఆపివేసే అవకాశాన్ని ఈసీకి కల్పించారని విమర్శించారు. దళితుల్ని కేసీఆర్​ మరోసారి మోసం చేశారన్నారు. తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:jagananna thodu: నేడే 'జగనన్న తోడు' వడ్డీ జమ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.