AP TOPNEWS: ప్రధాన వార్తలు@1PM

author img

By

Published : Aug 3, 2022, 1:00 PM IST

TOPNEWS

.

  • వడ్డీ లేని రుణాలతో.. చిరు వ్యాపారులను ప్రోత్సహిస్తున్నాం: సీఎం జగన్​..
    వడ్డీ లేని రుణాలతో చిరు వ్యాపారుల స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలను.. సీఎం జగన్‌ విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అచ్యుతాపురం సీడ్స్ కంపెనీ మూసివేత-మంత్రి అమర్నాథ్..
    అచ్యుతాపురం సీడ్స్(atchutapuram sez company) కంపెనీలో విషవాయువు లీకైన ఘటనలో బాధితులకు అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులు ఇప్పుడిప్పుడే కొలుకుంటున్నారు. బాధితులను పరామర్శించిన మంత్రి అమర్నాథ్‌....పూర్తిస్థాయి నివేదిక వచ్చే వరకూ సంబంధిత కంపెనీని మూసేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి..
    రాష్ట్రంలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,91,846 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1,23,231 మంది ఉత్తీర్ణత సాధించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Rain update: సీమ జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు..
    సీమ జిల్లాలను వానలు వదలడం లేదు. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో....భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరి...ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తల్లి మృతదేహం పక్కనే చిన్నారి నిద్ర.. 5గంటలు అలాగే... ఆకలేస్తోందని విలపిస్తూ..
    కన్నతల్లి చనిపోయిందని తెలియని ఓ బాలుడు.. ఆమె పక్కనే సుమారు ఐదు గంటలసేపు పడుకున్నాడు. 'అమ్మా ఆకలేస్తోంది.. లే' అని పిలుస్తూ తల్లి మృతదేహం పక్కనే కూర్చున్నాడు. ఈ హృదాయవిదారక ఘటన బిహార్​లో వెలుగు చూసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'మంకీపాక్స్ విషయంలో అలా చేయొద్దు'.. ప్రజలకు కేంద్రం కీలక సూచనలు..
    దేశంలో మంకీపాక్స్‌ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఎనిమిది మంది ఈ వ్యాధి బారినపడగా.. ఒకరు మరణించారు. ఈ నేపథ్యంలో తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. మంకీపాక్స్​ వ్యాప్తి నివారణకు ఏం చేయాలో, బాధితులతో ఎలా ఉండాలో వివరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Unstoppable: బాలయ్య రెమ్యునరేషన్​ అన్ని కోట్లా?..
    'చూడు ఒక వైపే చూడు.. రెండో వైపు చూడాలనుకోకు' అంటూనే బాలయ్య అన్​స్టాపబుల్​ షోలో తనలోని రెండో కోణాన్ని చూపించి ప్రేక్షకుల్ని తెగ ఆకట్టుకున్నారు. సెలబ్రిటీలతో సరదా సంభాషణలు, పంచ్​లు, కామెడీ టైమింగ్​తో అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులను అలరించారు. ఈ షో తొలి సీజన్​ సూపర్​హిట్​ అవ్వడం వల్ల రెండో సీజన్​ కోసం వీక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Commonwealth games: లాన్‌ బౌల్స్‌ ఆట ఎలా ఆడతారో తెలుసా?..
    కామన్వెల్త్‌ క్రీడల మహిళల లాన్‌బౌల్‌ ఫోర్‌ విభాగంలో భారత్‌ మొట్టమొదటి సారి గోల్డ్​ మెడల్​ సాధించింది. ఇంతకీ ఈ ఆట ఎలా ఆడతారో తెలుసా?. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధర.. నేటి లెక్కలు ఇలా..
    దేశంలో బంగారం, వెండి ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భారత్​పైనా జవహరీ కన్ను.. ఆ వర్గాలను రెచ్చగొట్టాలని చూసి...
    అల్​ఖైదా అధినేత అల్‌ జవహరీ మృతి భారత్‌కు అత్యంత ముఖ్యమైన అంశమేనని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల భారత్​పై జవహరీ ప్రత్యేకంగా దృష్టిసారించాడని, పలు వర్గాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడని అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.