AP TOPNEW:ప్రధాన వార్తలు@5PM

author img

By

Published : Jul 30, 2022, 4:58 PM IST

Updated : Jul 30, 2022, 5:14 PM IST

AP TOPNEWS

.

  • "మధ్యనిషేధమా"?.. మా మ్యానిఫెస్టోలో లేదు: మంత్రి అమర్నాథ్‌..
    మద్యపాన నిషేధంపై మంత్రి అమర్నాథ్‌ వింత వివరణ ఇచ్చారు. మా మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం అనే మాటే లేదని.. మద్యం ధరను ఫైవ్‌స్టార్ హోటల్ రేట్లకు తీసుకెళ్తామని మాత్రమే చెప్పామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వరద బాధితులకు సాయం చేయండి: చంద్రబాబు..
    గోదావరి వరదలతో సాంతం కోల్పోయి.. రోడ్డున్న పడ్డ బాధితులకు కూరగాయలు, బియ్యం, పశువులకు గడ్డి వితరణ చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఎన్టీఆర్‌ ట్రస్టు కొంతమేరకు సాయం అందించిందని.. తెదేపా కార్యకర్తలు, నాయకులు, ఎన్‌ఆర్‌ఐలు కూడా ముందుకు రావాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • BRIDGE: ఇది ప్రజలు నిర్మించుకుంటున్న వారధి.. ఎక్కడో తెలుసా?..
    వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఆ నది దాటేందుకు ప్రజలు ప్రాణాలు పణంగా పెట్టాలి. ఆరు మండలాల ప్రజలు దగ్గర దారిలో రాకపోకలు సాగించాలన్నా.. అదే మార్గం. ఏరు పారితే బల్లకట్టుపై ప్రయాణమే దిక్కు! అదీ అవసరానికి అందుబాటులో ఉంటేనే. వంతెన నిర్మించాలని ప్రజలు ఏళ్లతరబడి కోరుతున్నా.. పట్టించుకున్నవారు కరవు. ఇన్ని సమస్యల మధ్య అక్కడి ప్రజలేం చేశారో ఓసారి చూద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఎన్టీఆర్​ జిల్లాలో దారుణం.. తల్లిని చంపిన కొడుకు..
    సమాజంలో రోజురోజుకి మానవ సంబంధాలకు విలువలేకుండా పోతోంది. తల్లి మందలించిందని, తండ్రి కొట్టాడని కోపం పెంచుకుని వారిని హతమారుస్తున్నారు. పున్నామా నరకం నుంచి రక్షించాల్సిన కొడుకే విచక్షణారహితంగా దాడి చేసి చంపుతున్నారు. తాజాగా మానసిక స్థితి సరిగాలేని ఓ కుమారుడు తల్లిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన ఎన్టీఆర్​ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బాలుడి ప్రయోగం.. యూట్యూబ్ చూసి మద్యం తయారీ.. స్నేహితుడికి తాగించగానే..
    ప్రస్తుతం సోషల్​ మీడియాలో వీడియోలు చూసి నెటిజన్లు.. తమకు రాని విద్యలను నేర్చుకుంటున్నారు. తెలియని ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నారు. అయితే కేరళకు చెందిన ఓ 12 ఏళ్ల విద్యార్థి మాత్రం కాస్త వెరైటీగా యూట్యూబ్​ చూసి మద్యం​ తయారు చేశాడు. కానీ కథ అక్కడే అడ్డం తిరిగి.. ఆ వైన్ అతడి ఫ్రెండ్​​ తాగి అస్వస్థతకు గురయ్యాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మరో భాజపా నేత దారుణ హత్య.. కారులో వెళ్తుంటే చుట్టుముట్టి..
    బిహార్​లోని షాపుర్​ ప్రాంతంలో ఓ భాజపా నేతను దారుణంగా హత్య చేశారు దుండగులు. మృతుడు.. షాపుర్​కు చెందిన విపిన్​ కుమార్​గా గుర్తించారు పోలీసులు. అంతకుముందు కర్ణాటకలోనూ ఓ భాజపా నేత దారుణ హత్యకు గురయ్యాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సినీ పరిశ్రమలో విషాదం.. మరో సీనియర్​ నటుడు కన్నుమూత..
    భారత చిత్ర పరిశ్రమ మరో నటుడిని కోల్పోయింది. ప్రముఖ సీనియర్​ నటుడు రసిక్ దవే కన్నుమూశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భారత్​ బోణీ.. వెయిట్​ లిఫ్టింగ్​లో రజతం.. గాయంతోనే 248 కేజీలు ఎత్తి!..
    ఇంగ్లాండ్​లో జరుగుతున్న కామెన్​వెల్త్​ గేమ్స్​లో భారత్​ బోణి కొట్టింది. తొలి పతకాన్ని సాధించింది. వెయిట్​లిఫ్టింగ్​లో 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్‌​ సార్గర్​ రజత పతకం అందుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ముదురుతున్న వివాదం.. ట్విట్టర్​పై ఎలాన్​ మస్క్​ కౌంటర్ దావా..
    టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ట్విట్టర్​ మధ్య వివాదం ముదురింది. ట్విట్టర్​తో కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల ఆ సంస్థ కోర్టును ఆశ్రయించి ఎలాన్​ మస్క్​పై కొన్ని రోజుల క్రితం దావా వేసింది. తాజాగా ట్విట్టర్ దావాను సవాలు చేస్తూ మస్క్ కూడా కౌంటర్ దావా వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బస్సును ఢీకొట్టిన రైలు.. 11 మంది మృతి.. ఐదుగురికి గాయాలు..
    రైల్వే క్రాసింగ్ వద్ద ఓ మినీ బస్సును రైలు బలంగా ఢీకొన్న ఘటన బంగాదేశ్​లోని చిట్టగాంగ్​ జిల్లాలో జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో 11 మంది అక్కడిక్కడే మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
Last Updated :Jul 30, 2022, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.