- రాష్ట్రంలో అద్భుతం జరగనుంది.. ఆ బాధ్యత విపక్షాలందరిదీ : పవన్
వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమతో ఎవరెవరు కలిసి వస్తారో ఇప్పటికీ తెలియదన్నారు. ఇవాళ్టికీ తమకు భాజపాతోనే పొత్తు ఉందన్న పవన్..రాష్ట్రాన్ని రక్షించాలంటే వైకాపా వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అందరూ కలిసి చర్చించాలని చెప్పారు.
- వైకాపా అరాచకాలకు.. బదులు చెప్పి తీరుతాం - చంద్రబాబు
Chandrababu Fired on YCP: రాష్ట్రంలో వైకాపా నాయకుల అరాచకాలు ఎక్కువయ్యాయనీ.. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారనీ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. తన ప్రాణాలను అడ్డు పెట్టి కార్యకర్తల ప్రాణాలను కాపాడుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
- విశాఖకు ఆగ్నేయంగా 'అసని'... కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం
Cyclone ASANI : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు "అసని"గా నామకరణం చేశారు. గంటకు 16 కి.మీ వేగంతో కదులుతున్న తుఫాను విశాఖపట్నంకు ఆగ్నేయంగా 970 కి.మీ దూరంలో ఉంది.
- ఆ పార్టీలకు మేం వ్యతిరేకం.. వాటితో కలవబోం: సోము వీర్రాజు
కుటుంబ పార్టీలకు తాము వ్యతిరేకమని.. వాటితో కలిసి ముందుకు సాగబోమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీలతో కలిసి త్యాగాలకు తాము సిద్ధంగా లేమని..ఆయన స్పష్టం చేశారు.
- అసెంబ్లీపై ఖలిస్థాన్ జెండాలు ప్రత్యక్షం.. పోలీసులు హైఅలర్ట్
Khalistan Flags Found in Assembly: హిమాచల్ ప్రదేశ్ తపోవన్లోని అసెంబ్లీపై ఖలిస్థాన్ జెండాలు ప్రత్యక్షమయ్యాయి. ఎవరో దుండగులు.. విధానసభ గేటుకు, గోడలకు జెండాలు అంటించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనను పిరికిపంద చర్యగా అభివర్ణించారు సీఎం జైరాం ఠాకుర్.
- కారులోని సోదరులపై తూటాల వర్షం.. నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే..
Firing in Subhash Nagar Delhi: దిల్లీలో అంతా చూస్తుండగానే.. ముగ్గురు దుండగులు కాల్పులు జరపడం కలకలం రేపింది. సుభాష్ నగర్ ప్రాంతంలో శనివారం రాత్రి ఇద్దరు అన్నదమ్ములు కారులో వెళుతుండగా కొందరు తుపాకులతో విరుచుకుపడ్డారు. భారీగా ట్రాఫిక్ ఉన్న సమయంలో దాడి చేయగా.. కారులో ఉన్న వారు తప్పించుకునేందుకు వాహనాన్ని ముందుకు నడిపే ప్రయత్నం చేశారు. అయినా వాహనాన్ని వెంబడించి మరీ 10 రౌండ్ల కాల్పులు జరిపారు.
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. సింపుల్ విద్యార్హత... రూ.98వేల జీతం!
ONGC non executive notification: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన ఓఎన్జీసీ నుంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. భారీ వేతనంతో కూడిన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం ఎలాగో తెలుసుకోండి..
- పుజారా నాలుగో సెంచరీ... పాకిస్థాన్ బౌలర్‌కు చుక్కలు!
Cheteshwar Pujara county: ఫామ్ అందిపుచ్చుకున్న టెస్టు బ్యాట్స్‌మన్ పుజారా... ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. టోర్నీలో నాలుగో శతకాన్ని నమోదు చేశాడు. అదేసమయంలో పాక్ బౌలర్‌పై ఆధిపత్యం ప్రదర్శించాడు.
- అలా చేస్తే నా కోరికలు తప్పకుండా నెరవేరేవి: సమంత
తల్లి ఒడే బిడ్డకు తొలి పాఠశాల అంటుంటారు. పిల్లల భవిష్యత్తుకు ఆమే బలమైన పునాది వేస్తుంది. వారిని ఉన్నత స్థితిలో నిలిపేందుకు ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడుతుంది. అందుకే 'అమ్మ అండతోనే మేమీ స్థాయికి చేరుకున్నాం..' అంటుంటారు చాలామంది. ఆ జాబితాలో తామూ ఉన్నామంటున్నారు కొందరు సినీతారలు.
- ఉక్రెయిన్‌లో పాఠశాలపై బాంబు దాడి- 60 మంది మృతి!
Ukraine school bombed: Ukraine school bombed: తూర్పు ఉక్రెయిన్‌లోని ఓ పాఠశాలపై రష్యా సైన్యం బాంబు దాడి చేయగా.. 60 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. లుహాన్సక్లోని బిలోహోర్వికా ప్రాంతంలో ఉన్న పాఠశాలపై ఈ దాడి జరిగింది. ఘటన జరిగిన సమయంలో భవనంలో 90 మంది ఉన్నారని.. 30 మందిని మాత్రమే సురక్షితంగా బయటకు తీసుకురాగలిగిన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.