Top News: నేటి ప్రధాన వార్తలు @9PM

author img

By

Published : Jun 20, 2022, 9:01 PM IST

9pm Top news

.

  • కృష్ణా, గోదావరి కలుషితం కాకుండా.. పటిష్ట చర్యలు : సీఎం జగన్
    రాష్ట్రంలో ప్రధాన నగరాలు, మున్సిపాల్టీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను సీఎం జగన్​ ఆదేశించారు. మురుగునీటి వల్ల కృష్ణా, గోదావరి నదులు కలుషితం కాకుండా పటిష్ట నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కోర్టు వ్యాఖ్యలకు సీఎం ఏం సమాధానం చెబుతారు: చంద్రబాబు
    తప్పు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని.. తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. రాత్రిపూట కూల్చివేతలపై కోర్టు వ్యాఖ్యలకు సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారని.. ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'చలో నర్సీపట్నం'కు అడ్డంకులు, గృహనిర్బంధాలు..
    అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చివేతను నిరసిస్తూ.. తెలుగుదేశం శ్రేణులు 'చలో నర్సీపట్నం'కు పిలుపునిచ్చారు. అయ్యన్నపాత్రుడే లక్ష్యంగా ప్రభుత్వం కుట్ర చేస్తోందన్న నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చలో నర్సీపట్నంను అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడే తెదేపా నేతలను గృహనిర్బంధం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సికింద్రాబాద్ విధ్వంసం.. ప్రధాన సూత్రధారి అతడే!
    అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సాగిన విధ్వంసం వెనుక ప్రధాన నిందితుడిని పోలీసులు గుర్తించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డికి చెందిన వ్యక్తే.. ఈ అల్లర్లకు ప్రధాన కారకుడని తేల్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'సంస్కరణలు ఇప్పుడు నచ్చకపోయినా.. దీర్ఘకాలంలో మేలే'
    సంస్కరణలు దీర్ఘకాలంలో దేశానికి మేలు చేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సంస్కరణలు తాత్కాలికంగా నచ్చకపోయినా.. కాలం గడిచేకొద్దీ దేశం వాటి లాభాలను అందుకుంటుందని చెప్పారు. సైనిక నియామకాల్లో సంస్కరణలపై దేశంలో నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'అగ్నిపథ్'​పై భగ్గుమన్న విపక్షాలు
    అగ్నిపథ్ స్కీమ్​పై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. యువత పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోందని, దీనికి ప్రధానమంత్రే కారణమని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాన్ని సమర్థించేందుకు తొలిసారి ఆర్మీ ఉన్నతాధికారులను ఉపయోగించుకున్నారని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి షాక్
    ఫ్రాన్స్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికై రెండు నెలలు కూడా గడవకముందే.. మేక్రాన్​కు గట్టి షాక్​ తగిలింది. జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఆయన​ కూటమి మెజారిటీని కోల్పోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • స్థిరంగా బంగారం ధర.. హైదరాబాద్​, విజయవాడలో లెక్క ఇలా..
    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. 10 గ్రాముల పసిడి ధర రూ.52,670గా ఉంది. కిలో వెండి ధర రూ.62,734గా ఉంది. మరోవైవు ఇవాళ ఆద్యంతం ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు చివరకు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 237 పాయింట్లు, నిఫ్టీ 57 పాయింట్లు మెరుగుపడ్డాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • టీ20 ప్రపంచకప్​లో పంత్​-దినేశ్​ కార్తిక్​.. ద్రవిడ్ రియాక్షన్​​
    రాబోయే కొద్ది నెలలవరకు టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ జట్టులో అంతర్భాగమని ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్​లో చూపించిన ఫామ్​నే దినేశ్​ కార్తిక్​ కొనసాగిస్తే జట్టుకు మరింత ఉపయోగమని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఈ వారం థియేటర్‌/ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే!
    రామ్​గోపాల్ వర్మ తెరకెక్కించిన 'కొండా', ఎంఎస్ రాజు '7 డేస్ 6 నైట్స్'​ సహా పలు ఆసక్తికర చిత్రాలు ఈ వారం థియేటర్లలో విడుదలకానున్నాయి. దాంతో పాటే ఈ వారంలో ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలపై ఓ లుక్కేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.