AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 PM

author img

By

Published : Jun 18, 2022, 8:59 PM IST

9PM TOP NEWS

..

  • ' గిరిజనుల్ని మోసం చేస్తోన్న.. విక్టర్​బాబును అరెస్టు చేయాలి'

గిరిజ‌నుల్ని ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసం చేస్తోన్న వైకాపా ఎమ్మెల్సీ అనంత‌బాబు అనుచ‌రుడైన దూడ విక్టర్‌బాబు దందాల‌పై.. ద‌ర్యాప్తు చేయాల‌ని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యద‌ర్శి లోకేశ్‌ డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చెట్లవాడ గ్రామానికి చెందిన దూడ విక్టర్ బాబు.. అధికార పార్టీని అడ్డుపెట్టుకుని గిరిజ‌నుల్ని మోస‌గిస్తున్నార‌ని ట్విట్టర్‌లో ఆరోపించారు.

  • వైకాపా పాలనలో ఉత్తరాంధ్ర పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది

వైకాపా పాలనలో ఉత్తరాంధ్ర పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని.. ఆ ప్రాంత తెదేపా నేతల మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు 3 రోజుల పర్యటన విజయవంతమైందని తెదేపా సీనియర్‌ నేత కళా వెంకట్రావు అన్నారు. బస్సు యాత్ర పేరుతో వైకాపా చేసిన ప్రయత్నం ఏమైందో అందరికీ తెలుసని ఆయన ఎద్దేవా చేశారు.

  • సికింద్రాబాద్ 'అగ్నిపథ్‌' అల్లర్ల సూత్రధారి అరెస్ట్!

అగ్నిపథ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన అల్లర్లను ప్రోత్సాహించారనే అభియోగాలపై ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుబ్బారావు నరసరావుపేటలోని సాయి డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నారు.

  • మాజీ మంత్రి వెల్లంపల్లి అధికార దర్పం.. ప్రశ్నించిన యువకుడి అరెస్టుకు ఆదేశం !

నాపైనే ఆరోపణలు నిరూపించకపోతే కేసు పెట్టి లోపలేయండంటూ.. ప్రశ్నించిన యువకుడిపై మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ చిందులేశారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విజయవాడ 50వ డివిజన్​ పర్యటనకు వచ్చిన వెల్లంపల్లి వద్ద చెత్తపన్ను గురించి ఓ యువకుడు వాపోయారు. వెల్లంపల్లిపై ప్రతిపక్షాల అవినీతినీ యువకుడు ప్రస్తావించడంపై.. వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • ఆగని 'అగ్గి'.. వాహనాలు 'బుగ్గి'.. దేశవ్యాప్తంగా ఉద్ధృతంగా 'అగ్నిపథ్​' నిరసనలు

సైనికుల ఎంపిక కోసం కేంద్ర కొత్తగా ప్రతిపాదించిన అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌లలో యువత చేపట్టిన నిరసన ప్రదర్శనలు ఉద్రిక్తంగా మారాయి. ఉత్తరప్రదేశ్‌లో యువకులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించగా పంజాబ్‌ రైల్వే స్టేషన్‌లో పట్టాలపై యువత ఆందోళనకు దిగింది.

  • మహిళా సాధికారతతోనే భారత్ అభివృద్ధి: మోదీ

భారత్ అభివృద్ధి చెందాలంటే మహిళలకు సాధికారత కల్పించడం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్​లో రూ.21 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన.. మహిళల సంక్షేమం కోసం అన్ని రంగాల్లో విధానాలు రూపొందిస్తునట్లు తెలిపారు.

  • లంకలో దయనీయ పరిస్థితులు​.. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు బంద్​..

తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు మరింత దిగజారుతున్నాయి. తీవ్రమైన ఇంధన కొరత ఏర్పడిన నేపథ్యంలో సోమవారం నుంచి ప్రభుత్వ రంగంలోని కార్యాలయాలు మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శ్రీలంక ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

  • ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి

పన్ను రిటర్నులు దాఖలు చేయడం సులభతరం చేసేందుకు ఆదాయ పన్ను విభాగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో పరిమితికి మించి ఆదాయం ఉన్నవారు.. నిబంధనల మేరకు నిర్ణీత ఐటీఆర్‌ ఫారంలో రిటర్నులు దాఖలు చేసేందుకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఇన్‌కంట్యాక్స్‌ వెబ్‌సైటులో ఫారాలు అందుబాటులో ఉన్నాయి. ముందుగానే నింపిన ఈ పత్రాలను ఒకసారి పరిశీలించి, రిటర్నుల ప్రక్రియను పూర్తి చేసేయొచ్చు. దీనికన్నా ముందు మన ఆదాయానికి సంబంధించిన ఆధారాలను సేకరించాలి.

  • ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు సెంచరీలు.. వన్డేల్లో ఇది ఎన్నోసారి?

నెదర్లాండ్స్​తో మ్యాచ్​లో విజృంభించిన ఇంగ్లాండ్ బ్యాటర్లు ఏకంగా 498 పరుగులతో వన్డే చరిత్రలోనే అత్యధిక స్కోరును నమోదు చేశారు. సాల్ట్, మలన్, బట్లర్.. ముగ్గురూ​ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వన్డేల్లో ఇలాంటి అరుదైన సంఘటన గతంలోనూ రెండుసార్లు జరిగింది. అది ఎప్పుడంటే..

  • స్విమ్​సూట్​లో​ అలాయా.. మేగజైన్​ కోసం మతిపోగొట్టేలా..!

స్విమ్​వేర్​ ఫొటోలతో ఇన్​స్టాగ్రామ్​లో హీట్​ పెంచేస్తోంది బాలీవుడ్ బ్యటీ అలాయా ఫర్నిచర్​ వాలా. లైఫ్​స్టైల్​ ఏషియా ఇండియా మేగజైన్​ కోసం ఆమె చేసిన లేటెస్ట్​ ఫొటోషూట్​ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.