AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM

author img

By

Published : Aug 2, 2022, 8:59 AM IST

9AM TOP NEWS

..

  • తాజా లెక్కల్లోనూ తెలని మాయాజాలం.. ఫిబ్రవరి, మార్చి ఆదాయవ్యయాలకు కుదరని పొంతన
    CAG Report: రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు ఫిబ్రవరి నుంచి మార్చి నెలకు తగ్గిన నేపథ్యంలో మార్చిలో వచ్చిన అదనపు ఆదాయం రూ.20,371.12 కోట్లు ఏం చేసినట్లు? సోమవారం కాగ్‌ తాజా లెక్కలు వెల్లడైన నేపథ్యంలో ఇలా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగ్‌ వెబ్‌సైట్‌లో ఫిబ్రవరి, మార్చి ఆదాయవ్యయాలకు పొంతన కుదరడంలేదు. మ అనుమానాలపై ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చంద్రబాబుకు బాధలు చెబితే.. పునరావాస కేంద్రం నుంచి గెంటేస్తారా?
    Velerupadu: గోదావరి వరదల కారణంగా 20 రోజుల పాటు తాము పడిన బాధలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పుకుంటే అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడటం ఎంత వరకు సమంజసమని ఏలూరు జిల్లా వేలేరుపాడుకు చెందిన ఎర్రా వనజాకుమారి వాపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పునరావాస కేంద్రాలు ఖాళీ చేయండి:బాధితులకు అధికారుల హుకుం
    Flood victims: ‘వెంటనే పునరావాస కేంద్రాలను ఖాళీ చేసి గ్రామాలకు వెళ్లిపోండి.. లేకుంటే మేమే మిమ్మల్ని ఖాళీ చేయిస్తాం’ అని అంటూ ఏలూరు జిల్లా వేలేరుపాడు వరద బాధితులకు అధికారులు ఆదివారం హుకుం జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'పాలు, పెరుగు, మజ్జిగ కాదు.. పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్‌టీలోకి తెండి'
    MPs in Parliament: పేదలు, మధ్యతరగతి ప్రజలకు గోరుచుట్టుపై రోకటిపోటులా మారిన నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను తక్షణం అరికట్టాలని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆకాశాన్ని తాకుతున్న ధరలతో సామాన్య ప్రజలు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రముఖ ప్రొడ్యూసర్​ ఇంటిపై ఐటీ దాడులు.. ఆ స్టార్ హీరో​తో లింకులు!
    Anbu Chezliyan IT raids : ప్రముఖ ఫైనాన్షియర్, ప్రొడ్యూసర్ ఇంటిపై ఆదాయ పన్ను శాఖ మెరుపు దాడులు చేయడం తమిళ సినీ పరిశ్రమలో కలకలం రేపింది. చెన్నై, మధురై సహా మొత్తం 10 చోట్ల అన్బు చెళియన్​కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. 2020 ఫిబ్రవరిలోనూ ఇదే తరహాలో అన్బు ఇళ్లపై ఐటీ దాడులు జరగ్గా.. పెద్ద మొత్తంలో డబ్బు దొరికింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రజలు పెద్ద మనసుతో నన్ను క్షమించాలి: గవర్నర్
    Maharashtra Governor News: దేశ ఆర్థిక రాజధాని ముంబయి ఆర్థికస్థితిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజలకు మహారాష్ట్ర గవర్నర్ భగత్​సింగ్​ కోశ్యారీ క్షమాపణలు చెప్పారు. 'గుజరాతీలు, రాజస్థానీలు మహరాష్ట్రను మరీ ముఖ్యంగా ముంబయి, ఠాణెను విడిచివెళ్లిపోతే.. ఈ రాష్ట్రంలో డబ్బేం మిగలదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Al-Zawahiri: అల్‌ఖైదా అధినేత అయ్‌మన్‌ అల్‌ జవహరి హతం..!
    అల్‌ఖైదా అధినేత అయ్‌మన్‌ అల్‌ జవహరి హతమయ్యారు. అమెరికా దాడుల్లో అల్‌ఖైదా నాయకుడు అల్‌జవహరిని చంపేసినట్లు అమెరికా అధికారి వెల్లడించారు. అఫ్గానిస్థాన్‌లో చేపట్టిన ఓ విజయవంతమైన ఉగ్రవాద నిరోధన ఆపరేషన్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు జో బిడన్‌ ప్రకటన చేయనున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మార్చికల్లా 3 లక్షల ఐటీ ఉద్యోగాలు! జాబ్ కొట్టేందుకు మీరు సిద్ధమా?
    IT jobs India news : ఐటీ-బీపీఎం పరిశ్రమలో మార్చికల్లా 3లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని టీంలీజ్ డిజిటల్​ నివేదిక అంచనా వేసింది. టెక్నాలజీ సంస్థల్లో ఒప్పంద ఉద్యోగుల సంఖ్యా 21 శాతంపెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విశ్వనాథ్​ ఆనంద్‌నే తికమక పెట్టిన కవలలు
    దిగ్గజ చెస్​ ప్లేయర్​ విశ్వనాథ్ ఆనంద్​నే తికమకపెట్టారు కవల బాలికలు. గ్రాండ్​మాస్టర్​కు ఓ ప్రశ్న వేసి గందరగోళానికి గురయ్యేలా చేశారు. దీంతో ఆయన ఏం సమాధానం చెప్పాలో తెలియక కాసేపు తడబడ్డారు. చివరకి సమాధానం చెప్పలేక చేతులెత్తేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బాలయ్య 'ఆదిత్య 369'-కల్యాణ్​రామ్​ 'బింబిసార'కు ఉన్న లింక్ తెలుసా?
    KalyanRam Bimbisara: ఫాంటసీ సినిమాలంటే చాలా ఇష్టమని, అందుకే తొలి ప్రయత్నంగా 'బింబిసార' లాంటి కథను ఎంచుకున్నట్లు తెలిపారు దర్శకుడు వశిష్ఠ్​. ఈ కథను రూపొందించడానికి బాలయ్య నటించిన 'ఆదిత్య 369' స్ఫూర్తినిచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ మూవీ చిత్రీకరణను 135 రోజుల్లోనే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఇంకా సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర సంగతులను తెలిపారు. ఆ విశేషాలివీ.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.