Top news: ప్రధాన వార్తలు @9AM

author img

By

Published : Oct 20, 2021, 9:01 AM IST

Top news

..

  • బంద్​కు తెదేపా పిలుపు.. నేతల ముందస్తు అరెస్టులు

తెదేపా కార్యాలయాలపై వైకాపా దాడులను తీవ్రంగా ఖండించింది తెలుగుదేశం పార్టీ. ఇందుకు నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్తంగా బంద్​(tpd call state bandh)కు పిలుపునిచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • YCP PROTEST: తెదేపా నేతల అనుచిత వ్యాఖ్యలపై నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలు: సజ్జల

తెలుగుదేశం పార్టీ నేతల అనుచిత వ్యాఖ్యలపై నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు(ycp call statewide protests) చేపట్టనున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తెదేపా నేతల వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు క్షమాపణ చెప్పాలని సజ్జల డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • jagananna thodu: నేడే 'జగనన్న తోడు' వడ్డీ జమ

జగనన్న తోడు(jagananna thodu scheme)" పథకం కింద రుణాలు పొంది, సకాలంలో చెల్లించిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం ఇవాళ వడ్డీని జమ చేయనుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్​.. బటన్‌ నొక్కి జమ చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • HIGH COURT: ఆ నివేదికలను ఎనిమిది వారాల్లో పిటిషనర్లకు అందజేయాలి: హైకోర్టు

ప్రాథమిక విచారణ నివేదికలను పిటిషనర్లకు అందజేయకుండా ఎస్టీ - వాల్మీకి కుల ధ్రువపత్రాల వాస్తవికతను తేల్చే నిమిత్తం విచారణకు హాజరుకావాలంటూ.. తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్, జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ(డీఎల్ఎస్సీ) ఛైర్మన్ నోటీసులు ఇవ్వడం సరికాదని హైకోర్టు పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చైనా కుటిల నీతి.. తిప్పికొట్టేందుకు భారత్​ వ్యూహ రచన

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిపోయిన నేపథ్యంలో యుద్ధ పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ సన్నద్ధం అవుతోంది. వ్యూహాత్మకంగా కీలక ప్రాంతమైన అరుణాచల్​ ప్రదేశ్​లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వర్షాల దెబ్బకు ఉత్తరాఖండ్‌ విలవిల..

ఉత్తరాఖండ్​లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. వానల ధాటికి ఇప్పటివరకు 47 మంది ప్రాణాలు కోల్పోయారు. నైనీతాల్‌లో ఒక్కరోజే 28 మంది మృత్యువాత పడ్డారు. వరద ఉద్ధృతికి పలు ప్రాంతాల్లో వంతెనలు కూలిపోయాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారత జలాంతర్గామిని అడ్డుకున్నాం: పాక్‌

భారత్​కు చెందిన ఓ జలాంతర్గామిని అడ్డుకున్నట్లు పాకిస్థాన్​ (Indian Submarine Pakistan) తెలిపింది. తమ దేశ సముద్ర జలాల్లోకి ప్రవేశించబోవడమే ఇందుకు కారణం అని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Fuel Price Today: పెట్రో మోత- మళ్లీ పెరిగిన చమురు ధరలు

దేశంలో ఇంధన​ ధరల (Fuel Price Today) పెంపు కొనసాగుతోంది. లీటర్​ పెట్రోల్​పై 37 పైసలు, డీజిల్​పై 38 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • T20 world cup: ఆస్ట్రేలియాతో వార్మప్​ మ్యాచ్​.. బరిలోకి హిట్​మ్యాన్​

టీ20 ప్రపంచకప్​లో మరో వార్మప్​ మ్యాచ్​కు (T20 world cup 2021) టీమ్​ఇండియా సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో బుధవారం ఢీకొంటుంది. వార్మప్​ మ్యాచ్​ల్లోనే తన బ్యాటింగ్​ ఆర్డర్​ను ఖరారు చేసుకోనుంది టీమ్ఇం​డియా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Cinema release: సినిమాలు రెడీ.. కానీ రిలీజ్ ఎప్పుడు?

తెలుగు చిత్ర సీమలో(telugu cinema news) సినిమాలు ప్రేక్షకుల ముందుకు క్యూ కట్టేందుకు రెడీ అయిపోతున్నాయి. కానీ కొన్ని చిత్రాలకు సంబంధించిన పని మొత్తం పూర్తయినప్పటికీ, రిలీజ్​ డేట్​లు(cinema release) మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇంతకీ అవి ఎప్పుడొస్తాయి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.