AP TOP NEWS: ఏపీ తాజా వార్తలు @ 3 PM

author img

By

Published : Oct 3, 2022, 3:00 PM IST

3PM TOP NEWS

..

  • భాజపా పోరుయాత్రను అడ్డుకున్న స్థానిక వైకాపా నాయకులు..
    అనంతపురం జిల్లాలో భాజపా పోరు యాత్ర చేస్తున్న నాయకులపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ..కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నసంక్షేమ పథకాలను భాజపా నేతలు ప్రజలకు వివరించారు. ఈ క్రమంలో వైకాపా శ్రేణులు ఒక్కసారిగా భాజపా నేతలు, కార్యకర్తలపై దాడికి దిగారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సమస్యలకు నిలయాలుగా... విజయవాడలోని కొండ ప్రాంతాలు
    Hilly areas in Vijayawada: విజయవాడలో కొండ ప్రాంతాలు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. వానాకాలం వస్తే చాలు.. ఎక్కడ కొండచరియలు విరిగిపడతాయో అన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సిన పరిస్థితి. వీటికి తోడు పారిశుధ్య నిర్వహణాలోపం కారణంగా రోగాలు ప్రబలుతున్నాయి. విజయవాడలోని కొండ ప్రాంత వాసులు కష్టాలపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మునుగోడు ఉపఎన్నికకు మోగిన నగారా.. తక్షణమే అమల్లోకి ఎన్నికల నియమావళి
    Munugode By poll Schedule: తెలంగాణలో కీలకంగా మారిన మునుగోడు ఉపఎన్నికకు నగారా మోగింది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉపఎన్నిక షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సీఐడీ పోలీసుల తీరుపై వర్ల రామయ్య ఆగ్రహం.. డీజీపీకి లేఖ
    TDP VARLA LETTER : చింతకాయల విజయ్ వ్యవహారంలో సీఐడీ పోలీసుల తీరుపై తెదేపా నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ్​రెడ్డికి లేఖ రాశారు. విజయ్ ఇంట్లో ప్రవర్తించిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని.. సీఐడీ పోలీసులు బ్యాడ్జీలు ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • హైదరాబాద్‌ నగర నడిబొడ్డు నుంచే భారత్​ జోడో యాత్ర.. రూట్​ మ్యాప్​ ఇదే..
    Rahul Gandhi Bharat Jodo Yatra Route Map: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో రూట్‌ మ్యాప్‌ ఖరారైంది. హైదరాబాద్‌ నగర నడిబొడ్డు నుంచే.. ఈ యాత్ర సాగేట్లు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు. 7 పార్లమెంట్, 17 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా 375 కిలోమీటర్ల మేర 14 రోజుల పాటు రాహుల్‌ జోడో యాత్ర సాగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 29 ఏళ్ల పంతానికి తెర.. రెండు వర్గాలను కలిపిన రాహుల్ గాంధీ!
    Rahul Gandhi Bharat Jodo Yatra : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్​ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా వర్గ విభేదాల కారణంగా విడిపోయిన రెండు వర్గాలతో కలిసి భోజనం చేశారు రాహుల్ గాంధీ. ఇదే భారత్​ జోడో యాత్ర స్ఫూర్తి అని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వాయుసేనకు 'ప్రచండ' అస్త్రం.. కన్ఫ్యూజ్ చేస్తూ శత్రువుకు దెబ్బ!
    Light combat helicopter induction : స్వదేశీ పరిజ్ఞానంతో 'ప్రచండ్' పేరిట రూపొందిన తేలికపాటి పోరాట హెలికాప్టర్లు (ఎల్‌సీహెచ్‌) సోమవారం లాంఛనంగా భారత వైమానిక దళంలో చేరాయి. అనేక రకాల క్షిపణులు, ఇతర ఆయుధాలను ప్రయోగించగల ఈ లోహవిహంగాల రాకతో మన వాయుసేన సత్తా మరింత ఇనుమడించనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గాల్లో ఉన్న విమానానికి బాంబు బెదిరింపు.. రంగంలోకి వాయుసేన.. టెన్షన్ టెన్షన్!
    ఇరాన్​కు చెందిన ఓ పాసింజర్ విమానంలో బాంబు ఉందన్న హెచ్చరిక.. కలకలం రేపింది. ప్రయాణికులతో చైనా వెళ్తున్న ఈ విమానం భారత గగనతలంలో ఉండగా ఈ సమాచారం అందింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • IND VS AUS: క్లీన్​స్వీప్​​పై టీమ్​ఇండియా కన్ను.. ఆ ప్లేయర్స్​కు విశ్రాంతి
    ఆస్ట్రేలియాతో జరగబోయే మూడో టీ20లోనూ గెలిచి సిరీస్​ను క్లీన్​స్వీన్​ చేయాలని భావిస్తోంది టీమ్​ఇండియా. ఈ మ్యాచ్​ కోసం జట్టులో పలు మార్పులు చేయాలని భావిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నడిచేందుకు ప్రభాస్ ఇబ్బందులు​.. ఈవెంట్​లో ఏమైంది?
    ఆదిపురుష్​ టీజర్ రిలీజ్​ ఈవెంట్​లో ప్రభాస్​ సరిగ్గా నడవలేని స్థితిలో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆయనకి ఏమైందంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.