AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM
Published on: Aug 4, 2022, 2:54 PM IST |
Updated on: Aug 4, 2022, 3:01 PM IST
Updated on: Aug 4, 2022, 3:01 PM IST

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM
Published on: Aug 4, 2022, 2:54 PM IST |
Updated on: Aug 4, 2022, 3:01 PM IST
Updated on: Aug 4, 2022, 3:01 PM IST
..
- AP high court shift: కర్నూలుకు ఏపీ హైకోర్టు మార్పుపై.. కేంద్రం కీలక ప్రకటన
AP high court shift: ఏపీ హైకోర్టును అమరావతి నుంచి మార్చే ప్రతిపాదన లేదని కేంద్రం తెల్చి చెప్పింది. అమరావతి నుంచి కర్నూలుకు మార్చే ప్రతిపాదన పెండింగ్‌లో లేదని స్పష్టం చేసింది. 2019 జనవరిలో రాష్ట్ర విభజన చట్టానికి అనుగుణంగా ఏర్పాటు చేశారని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జోరు వానలు.. వాగులో చిక్కుకున్న గొర్రెల కాపరులు!
వైఎస్సార్ జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు.. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పాపాగ్ని నదిలో వేసిన మట్టి రోడ్డు కొట్టుకుపోవడంతో.. వేంపల్లి, చక్రాయపేట మండలాల్లో ఆయా గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వీరపునాయునిపల్లె మండలం ఓబుల్ రెడ్డి పల్లె వద్ద పొంగి పొర్లుతున్న వాగులో ఇద్దరు చిక్కుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈ "ఛరిష్మా"కు అందరూ ఫిదా.. "మిస్ సౌత్ ఇండియా" పోటీల్లో మెరిసిన ఏయూ విద్యార్థిని
Miss South India: విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ విభాగం విద్యార్థిని ఛరిష్మా కృష్ణ ‘మిస్ సౌత్ ఇండియా’గా ఎంపికయ్యారు. పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సోమవారం రాత్రి కేరళలోని కోచిలో నిర్వహించిన పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- New Judges: హైకోర్టు నూతన జడ్జిలుగా ఏడుగురు ప్రమాణ స్వీకారం
High Court New Judges: హైకోర్టులో ఏడుగురు కొత్త న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన జడ్జీలతో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రమాణం చేయించారు. మొదటగా జస్టిస్ అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు ప్రమాణం చేశారు. ఆ తర్వాత జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, జస్టిస్ బండారు శ్యాంసుందర్, జస్టిస్ ఊటుకూరు శ్రీనివాస్‌తో హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రూ.1400 కోట్ల 'మ్యావ్ మ్యావ్' డ్రగ్స్ సీజ్.. కేరళలో 8వేల జిలెటిన్ స్టిక్స్
Meow Meow drug Mumbai: అక్రమంగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను ముంబయి యాంటీ నార్కోటిక్ సెల్ అధికారులు అరెస్టు చేశారు. రూ.1400 కోట్లు విలువైన మత్తుపదార్థాలను సీజ్ చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మరోవైపు, కేరళలో 8వేల జిలెటిన్ స్టిక్స్ దొరకడం కలకలం రేపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రియుడి స్నేహితుల కిరాతకం.. ఆమెను దారుణంగా రేప్ చేసి, బావిలో పడేసి...
ప్రియుడిని కలిసేందుకు వెళ్లిన ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు యువకులు. అనంతరం బాధితురాల్ని కత్తితో పొడిచి చంపి.. బావిలో పడేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తైవాన్ను చుట్టుముట్టిన చైనా.. భారీ ఎత్తున సైనిక డ్రిల్స్.. యుద్ధం తప్పదా?
China drills Taiwan: తైవాన్ను తనలో కలిపేసుకోవాలని ప్రయత్నిస్తున్న చైనా.. తాజాగా ఆ దేశం చుట్టూ భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు చేపట్టింది. చైనా సైన్యం, వైమానికదళం, నౌకాదళం, వివిధ అనుబంధ బలగాలు సంయుక్తంగా ఈ డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి. తైవాన్ ప్రాదేశిక జలాల్లోనూ ఈ విన్యాసాలు జరుగుతుండటం గమనార్హం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రూ.619 పెట్టుబడికి రూ.2లక్షల లాభం.. ఈ షేరు ఐపీఓ సూపర్‌హిట్!
AMTD digital share returns: బుల్ మార్కెట్లోనూ సాధ్యంకాని అనూహ్య పరిణామం జరిగింది. ఐపీఓలో ఓ షేరు దుమ్మురేపింది. మదుపర్లకు 32,660శాతం రాబడినిచ్చింది. రూ.619 పెట్టుబడి పెడితే.. ఒక్కో షేరుపై రూ.2లక్షలకు పైగా లాభం వచ్చింది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో ఈ రికార్డు స్థాయి ట్రేడింగ్ నమోదైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బంగారు పతకాల 'లిఫ్టర్లు'.. 'ది గోల్డెన్ ట్రియో' ఫొటో వైరల్
Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత ఆటగాళ్లు దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు 18 పతకాలను అందించారు. ఈ నేపథ్యంలో వెయిట్ లిఫ్టింగ్‌లో బంగారు పతకాలు సాధించిన భారత స్టార్ లిఫ్టర్లు.. తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. మీరూ ఓ సారి వాటిని చూసేయండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'సంయుక్తా.. ఆ రోజు తారక్‌తో ఏం మాట్లాడారు?'
సంయుక్తా.. ఆరోజు మీరు తారక్‌తో ఏం మాట్లడారు? 'ఆర్ఆర్ఆర్' ఎన్నిసార్లు చూశారు? 'బింబిసార' స్క్రిప్ట్ వినగానే మీ రియాక్షన్ ఏమిటి? ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువగా వింటున్న పాటలు?.. ఇవన్నీ మలయాళీ భామ సంయుక్తా మేనన్‌ను అభిమానులు ట్విట్టర్ వేదికగా అడిగిన ప్రశ్నలు. వీటికి ఆమె ఏమని సమాధానమిచ్చారంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...