AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM

author img

By

Published : Jun 18, 2022, 12:59 PM IST

1PM TOP NEWS

..

  • సికింద్రాబాద్ 'అగ్నిపథ్‌' అల్లర్ల సూత్రధారి అరెస్ట్!
    secunderabad agitations accused arrested : అగ్నిపథ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన అల్లర్లను ప్రోత్సాహించారనే అభియోగాలపై ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పాలిసెట్-2022 ఫలితాలు విడుదల.. 91.84 శాతం మంది అర్హత
    Polycet-2022 Results: 2022 పాలిసెట్‌లో 91.84శాతం విద్యార్థులు అర్హత సాధించారు. పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం మే 29న నిర్వహించిన పాలిసెట్ ఫలితాలను.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ విజయవాడలో.. విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రేపు ప్రకాశం జిల్లాకు పవన్​కల్యాణ్.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం
    Janasena News: రేపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారని పార్టీ రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు లక్ష రూపాయల చెక్కులను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన దురదృష్టకరమని.. యువత బలంగా నిరసన తెలపాలి.. కానీ ఇలా హింసకు దారి తీసేలా ఉండకూడదన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వాట్సాప్​లో పెద్ద ఎత్తున పోస్టులు.. పోలీసుల అదుపులో యువకుడు
    Agnipath Agitation: విశాఖ రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానస్పదంగా తిరుగుతున్న ఓ యువకుడిని పోలీసులు గుర్తించారు. స్టేషన్​కు ఏ మార్గం ద్వారా చేరుకోవాలో.. వాట్సాప్​లో పెద్ద ఎత్తున పోస్టు చేస్తున్నట్లు గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ను మూసివేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'సాగు చట్టాల మాదిరిగానే అగ్నిపథ్​నూ వెనక్కి తీసుకోవాలి'
    Agnipath Rahul Gandhi: కేంద్రం తీసుకొచ్చిన 'అగ్నిప‌థ్ ప‌థ‌కం'పై కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శ‌లు కురిపిస్తూనే ఉంది. త్రివిధ ద‌ళాల్లో నియామ‌కాల కోసం తీసుకొచ్చిన ఆ ప‌థ‌కాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేశారు రాహుల్​ గాంధీ. మోదీ 'మాఫీవీర్'గా మారి.. యువ‌త డిమాండ్‌కు త‌లొగ్గుతారంటూ రాహుల్​ ట్వీట్​ చేశారు. మరోవైపు.. దిల్లీలోని జంతర్​మంతర్​ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం సత్యాగ్రహ దీక్ష చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 18 ఏళ్ల తర్వాత భార్యాపిల్లల చెంతకు.. ఇన్నిరోజులు పాపం ఒక్కడే!
    Man Met His Family After 18 Years: మతిస్తిమితం కోల్పోయి ఛత్తీస్​గఢ్​ చేరుకున్న ఓ వ్యక్తి.. 18 ఏళ్ల తర్వాత తన కుటుంబసభ్యులను కలుసుకున్నాడు. ఈ సంఘటన గుజరాత్​లోని రాజ్​కోట్​లో జరిగింది. చాలా ఏళ్ల తర్వాత కలిసినందుకు అతడి భార్య, పిల్లలు, కుటుంబసభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కాబుల్​ గురుద్వారాపై ఉగ్రవాదుల దాడి.. పలు చోట్ల పేలుళ్లు
    Explosions In Kabul Gurudwara: అఫ్గానిస్థాన్​ కాబుల్​లోని గురుద్వారా కర్తా పర్వ్​పై ఉగ్రవాదులు దాడి చేశారు. గురుద్వారా సాహిబ్​ ప్రాంగణంలో పలు చోట్ల పేలుడు ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. గురుద్వారా గేటు బయట దాడులు జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పేలుళ్లతో పక్కనే ఉన్న షాపులు కూడా దగ్ధమయ్యాయని చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. బిట్​కాయిన్​ విలువ ఎంతంటే?
    Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల పసిడి ధర రూ.52,640గా ఉంది. కిలో వెండి ధర రూ.62,668గా ఉంది. క్రిప్టోకరెన్సీలు కూడా నష్టాలను నమోదు చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఆ విషయంలో ఆందోళన లేదు.. వాటిని సరిచేసుకుంటా'
    దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో తన ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉందన్నాడు టీమ్‌ఇండియా పేసర్‌ అవేశ్‌ ఖాన్‌. ఈ ప్రదర్శనను తన తండ్రికి అంకితమిస్తున్నట్లు తెలిపాడు. మరోవైపు.. ఈ మ్యాచ్​లో సీనియర్‌ బ్యాటర్​ దినేశ్‌ కార్తీక్‌ ప్రత్యర్థి బౌలర్లను చితక్కొట్టాడని కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ హర్షం వ్యక్తం చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'కోడలు వస్తుందని మీ అమ్మకు చెప్పు'.. ఇమ్మూకు వర్ష ప్రపోజల్
    Jabardasth Varsha Immanuel love story: 'జబర్దస్త్​' వర్ష​.. మరోసారి ఇమ్మాన్యుయెల్​తో తనకున్న బంధాన్ని బయటపెట్టింది. అతడంటే ఇష్టమని అందరి ముందు ప్రపోజ్ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.