AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM

author img

By

Published : Jul 31, 2022, 10:58 AM IST

11AM TOP NEWS

..

  • Couple murder: దంపతులు దారుణ హత్య.. ఎక్కడంటే..?
    Couple murder: చింతూరు మండలం రత్నాపురంలో దారుణం జరిగింది. దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఏనుగులు బీభత్సం.. ఒకరు మృతి.. మరొకరికి గాయాలు.. ఎక్కడంటే..?
    Elephants attack: కుప్పం నియోజకవర్గంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. వీటి దాడిలో ఒకరు చనిపోగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఏనుగుల దాడుల పట్ల జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • క్రాంతి కుమార్‌ బాగున్నారా?: అల్లూరి జిల్లావాసితో ప్రధాని
    Kranti Kumar: ‘క్రాంతి కుమార్‌ బాగున్నారా?’ అని అల్లూరి సీతారామరాజు జిల్లా వాసిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలకరించారు. దృశ్యశ్రవణ విధానంలో ‘ఉజ్వల భారత్‌-ఉజ్వల భవిష్యత్తు-పవర్‌ 2047’ కార్యక్రమంలో క్రాంతి కుమార్​తో ప్రధాని మోదీ మాట్లాడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాష్ట్ర ఆడిట్‌కు పింఛను మంజూరు అధికారం.. ప్రయోగాత్మకంగా ఆ జిల్లాల్లో..
    State Audit: రాష్ట్రవ్యాప్తంగా పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల పింఛను మంజూరు అధికారాన్ని రాష్ట్ర ఆడిట్‌ కార్యాలయం పరిధిలోకి తీసుకురానున్నారు. ఇప్పటివరకూ ఉద్యోగులు పదవీవిరమణ ప్రయోజనాల ప్రతిపాదనలను ఏజీ కార్యాలయానికి సమర్పిస్తున్నారు. ఇకనుంచి రాష్ట్ర ఆడిట్‌ విభాగమే పింఛను, గ్రాట్యుటీ, కమ్యుటేషన్‌ నిర్ణయిస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశంలో స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు.. జపాన్​లో 2 లక్షలకుపైనే..
    Covid Cases In India: భారత్​లో కొవిడ్​ కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 19,673 మంది వైరస్ బారిన పడగా.. 39 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు జపాన్​లో కొత్తగా 2.21 లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్ సంబరాలు.. ఎందుకంటే?
    ఎన్నికల్లో గెలిచిన తర్వాత అభ్యర్థి, పార్టీ సంబరాలు చేసుకోవడం సాధారణమే. అయితే ఓడిపోయిన అభ్యర్థి, పార్టీ సంబరాలు చేసుకోవడం ఎప్పుడైనా చూశారా? మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో అలాంటిదే జరిగింది. జిల్లా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కుండపోత వర్షం.. కొట్టుకుపోయిన ఇళ్లు.. 25 మంది మృతి
    Kentucky Floods: అమెరికాలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కెంటకీ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. 25 మందికిపైగా మరణించారు. ఇందులో నలుగురు చిన్నారులు ఉన్నారు. పాకిస్థాన్​లోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరద సంబంధిత ఘటనల్లో లాహోర్​, సింధ్​, బలోచిస్థాన్​లో పదుల కొద్దీ ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఆ నిర్ణయం తప్పు.. పన్ను ఎగ్గొట్టేందుకు గోల్డ్​ స్మగ్లింగ్ పెరగొచ్చు'
    బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల పసిడి స్మగ్లింగ్ పెరగవచ్చని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఛైర్మన్ ఎం.పి. అహ్మద్ అన్నారు. దీని వల్ల సంస్థాగత ఆభరణాల రంగంపైనా ప్రభావం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రముఖ వార్తా సంస్థ 'ఇన్ఫామిస్ట్‌​'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను అహ్మద్ తెలిపారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అదరగొట్టిన వెయిట్​లిఫ్టర్లు.. కామన్​వెల్త్​ గేమ్స్​లో భారత్​కు 4 పతకాలు
    టోక్యోలో అంచనాల్ని మించిన ప్రదర్శనతో రజతం గెలిచి అబ్బుర పరిచిన అమ్మాయి మీరాబాయి చాను. ఆ దూకుడు చూశాక కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణానికి తక్కువగా ఏ పతకం సాధించినా ఆమె స్థాయికి తగని ప్రదర్శనే అవుతుందంటూ భారీ అంచనాలే పెట్టుకున్నారు అభిమానులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జాన్వీ కపూర్​ లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసిన స్టార్​ హీరో.. ధర ఎంతంటే?
    బాలీవుడ్​ హీరో రాజ్‌కుమార్ రావ్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడు. ఆ ఇల్లు అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్​దే అట. ఇంతకీ దాని ఖరీదు ఎంతంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.