TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM

author img

By

Published : May 12, 2022, 11:03 AM IST

11AM TOP NEWS

..

  • Cyclone Asani: స్థిరంగా కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం
    Cyclone Asani: మచిలీపట్నానికి పశ్చిమంగా కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. కాసేపట్లో తీవ్రవాయుగుండం బలహీనపడే సూచనలున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కష్టపడే వారికి గుర్తింపు లేదా.. వైకాపా సమన్వయ సమావేశంలో కార్యకర్తలు
    MLA Grandhi Srinivas: భీమవరంలో గడప గడపకూ వైకాపా కార్యక్రమంలో భాగంగా పార్టీ సమన్వయ సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సహా పార్టీ కోసం కష్టపడే నాయకులకు గుర్తింపు లేదంటూ కార్యకర్తలు వాపోయారు. ఎమ్మెల్యే ఎన్నిసార్లు ప్రయత్నించినా సీఎం అపాయింట్​మెంట్ ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అన్నదాతల కోసం.. 'రైతు కోసం తెలుగుదేశం' కమిటీ
    Rythu kosam telugudesam: రైతులకు అండగా ఉండేందుకు 'రైతు కోసం తెలుగుదేశం' పేరుతో తేదేపా కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వర్షాలతో నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి వారికి న్యాయం జరిగేవరకూ పోరాడుతుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.


  • అందమైన అమ్మాయి నుంచి ఫ్రెండ్​ రిక్వెస్ట్​​...ఆక్సెప్ట్ చేశారా...!
    Facebook Love Cheating: రోజూలాగానే చరవాణిలో ఫేస్​బుక్​ ఓపెన్​ చేసిన ఆ యువకుడికి.. ఫ్రెండ్​​ రిక్వెస్ట్​ కనిపించింది. ఎవరా అని ప్రొఫైల్​ ఓపెన్​ చేసి చూసిన అతడి కళ్లు మతాబుల్లా వెలిగాయి. అరె ఎంత అందంగా ఉందీ అమ్మాయి అనుకుంటూ వివరాలేవీ చూడకుండా రిక్వెస్ట్​ ఆక్సెప్ట్​ చేశాడు. ఇక అప్పటినుంచి చాటింగ్​లు మొదలయ్యాయి. మెల్లగా ఫోన్లలో మాట్లాడుకోవడం షురూ అయింది. పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది. మనోడికి అసలు సినిమా అప్పుడు మొదలైంది. శుభం కార్డు పడేలోపు.. జేబుకు కత్తెర పడింది. కళ్లు తెరుచుకునే లోపు.. అక్కడ ఖాతా మూతపడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఏడాదిలోపు పిల్లల్ని కనండి లేదా రూ.5 కోట్లు ఇవ్వండి'
    Parents Demand For Grandchildren: మనవళ్లతో ఆనంద క్షణాల్ని గడపాలని కోరుకుంటున్న ఓ వృద్ధ దంపతులు కోర్టును ఆశ్రయించారు. తమ కుమారుడు, కోడలు ఏడాదిలోపు బిడ్డకు జన్మనివ్వాలని లేదా వారిపై తాము వెచ్చించిన 5 కోట్ల రూపాయలను పరిహారంగా ఇవ్వాలని ఉత్తరాఖండ్​లోని హరిద్వార్ జిల్లా కోర్టులో ఆ దంపతులు పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశంలో స్థిరంగా కరోనా కేసులు.. పెరుగుతున్న రికవరీలు
    దేశంలో కొత్తగా 2,827 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 24 మంది వైరస్​ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 3,230 మంది కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విమానంలో 122 మంది.. టేకాఫ్​ సమయంలో చెలరేగిన మంటలు!
    విమానం టేకాఫ్​ అవుతున్న సమయంలో మంటలు చెలరేగాయి. ఘటన సమయంలో విమానంలో 113 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నారు. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం చైనాలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు.. సెన్సెక్స్​ 750, నిఫ్టీ 250 డౌన్​​
    Stock Market Live Updates: స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ దాదాపు 800 పాయింట్లకుపైగా నష్టంతో 53 వేల 260 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 250 పాయింట్లు కోల్పోయి.. 16 వేల దిగువకు చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • IPL 2022: వార్నర్​ అదృష్టం.. రాజస్థాన్​కు ఎదురుదెబ్బ!
    IPL 2022 Warner Chahal: ఐపీఎల్‌ 2022లో భాగంగా బుధవారం జరిగిన దిల్లీ క్యాపిటల్స్‌-రాజస్థాన్​ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్​లో చాహల్​, వార్నర్​ ఓ రికార్డును సాధించారు. కాగా, ఈ మ్యాచ్​లో విజయం సాధించిన దిల్లీ జట్టు ప్లేయర్​ వార్నర్​ అదృష్టమే రాజస్థాన్​ రాయల్స్‌ కొంపముంచినట్లయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రివ్యూ: మహేశ్​ 'సర్కారువారి పాట' ఆకట్టుకుందా?
    Sarkaru Vaaripata twitter review: పరశురామ్​ దర్శకత్వంలో సూపర్​స్టార్​ మహేశ్​బాబు-కీర్తిసురేశ్​ జంటగా నటించిన 'సర్కారు వారి పాట' గురువారం థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్ర పోస్టర్లు, ప్రచార చిత్రాలు 'పోకిరి' నాటి మహేశ్‌ను గుర్తు తెస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.