ట్విట్టర్ టాప్​ మేనేజర్స్​పై 'మస్క్'​ వేటు.. పరాగ్​, గద్దె విజయ భవిష్యత్తేమిటో?

author img

By

Published : May 13, 2022, 10:39 AM IST

Twitter fires two top executives

Twitter fires two top executives: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్​ను ఎలాన్​ మస్క్​ కొనుగోలు చేసిన తర్వాత పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. తాజాగా ఇద్దరు టాప్​ మేనేజర్లపై వేటు వేసింది ట్విట్టర్​. వారిని విధుల్లోంచి తొలగించింది​. ఈ క్రమంలో ప్రస్తుత సీఈఓ పరాగ్​ అగర్వాల్, గద్దె విజయ భవిష్యత్తు ఏమిటని చర్చలు మొదలయ్యాయి.

Twitter fires two top executives: ట్విట్టర్​ను కొనుగోలు చేసిన టెస్లా అధినేత ఎలాన్​ మస్క్​.. కీలక మార్పులు చేపట్టనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరు టాప్​ మేనేజర్లను తొలగించింది ఆ సంస్థ​. ట్విట్టర్​ను మస్క్​ కొనుగోలు చేసిన తర్వాత అంతర్గతంగా అనిశ్చితి నెలకొందనడానికి ఇది సంకేతంగా కనిపిస్తోంది.
ట్విట్టర్​ జనరల్​ మేనేజర్​ కేవోన్ బేక్‌పూర్ ఏడేళ్ల తర్వాత సంస్థను వీడుతున్నారు. ఈ క్రమంలో వరుస ట్వీట్లు చేశారు కేవోన్​. 'ప్రస్తుత బృందాన్ని వేరే దిశలో తీసుకెళ్లాలనుకుంటున్నానని నాకు తెలియజేసిన తర్వాత సంస్థను వీడాలని సీఈఓ పరాగ్​ అగర్వాల్ కోరారు.​ ట్విట్టర్​కు మంచి రోజులు ముందున్నాయని నేను ఆశిస్తున్నా. ప్రపంచంలో ముఖ్యమైన, ప్రత్యేక, ప్రభావవంతమైన సాధనాల్లో ట్విట్టర్​ ఒకటి. సరైన మార్గనిర్దేశం ఉంటేనే ఆ ప్రభావం కనిపిస్తుంది.' అని పేర్కొన్నారు బేక్​పూర్​. 2015లో తన స్టార్టప్​ కంపెనీని ట్విట్టర్​ కొనుగోలు చేసిన తర్వాత సంస్థలో చేరారు.

Twitter fires two top executives
కేవోన్ బేక్‌పూర్ ట్వీట్​

ట్విట్టర్​ రెవెన్యూ, ప్రొడక్ట్​ విభాగం మేనేజర్​ బ్రూస్​ ఫాల్క్​​ను సైతం తొలగించింది సంస్థ. ప్రస్తుతం ఆయన ట్విట్టర్​ ఖాతా బయోలో నిరుద్యోగి అని కనిపించటమే అందుకు నిదర్శనం.'ఇంజనీర్లకు ఈ ట్వీట్​ను అంకితం చేస్తున్నా. మీతో కలిసి పని చేసే అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది కాబట్టి తిరిగి పనిలోకి వెళ్లండి.' అని ట్వీట్​ చేశారు. మరోవైపు.. ఇద్దరిని తొలగించినట్లు ట్విట్టర్​ ధ్రువీకరించింది. ప్రస్తుతం బిజినెస్​లోని కీలక విభాగాల్లో మినహా అన్ని నియామకాలను నిలిపేసినట్లు తెలిపింది.

Twitter fires two top executives
బ్రూస్​ ఫాల్క్​ ట్వీట్​

పరాగ్​, గద్దె విజయ భవిష్యత్తేమిటి?

భారత సంతతికి చెందిన పరాగ్​ అగర్వాల్​, లీగల్ హెడ్ విజయ గద్దె ట్విట్టర్​లో కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. అయితే, ట్విట్టర్​ను 44 బిలియన్​ డాలర్లకు సొంతం చేసుకున్న మాలన్​ మస్క్​.. మొదటి నుంచే వారి పట్ల సానుకూలంగా లేరని తెలుస్తోంది. సీఈఓ పదవి నుంచి పరాగ్​​ను తొలగించి కొత్త వారిని నియమించే అవకాశం ఉన్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇద్దరు కీలక ఉద్యోగులను ట్విట్టర్​ తొలగించటం వల్ల ఆ వాదనలకు మరింత బలం చేకూరినట్లవుతోంది. అయితే, మస్క్​కు కంపెనీని అధికారికంగా అప్పగించే వరకు సీఈఓగా పరాగ్​ కొనసాగనున్నారు. కానీ, అంతకుముందే తీసివేస్తే 42 మిలియన్​ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

ట్విట్టర్​ లీగల్​ హెడ్​గా ఉన్న విజయ గద్దె పట్ల సైతం ఎలాన్​ మస్క్ సానుకూలంగా లేరని స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. గతంలో ఆమె తీసుకున్న నిర్ణయాల పట్ల సైతం మస్క్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో వారి ఇరువురికి మస్క్​ ఉద్వాసన పలకటం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: పరాగ్​కు ఉద్వాసన తప్పదా? 'ట్విట్టర్​' ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన

ట్విట్టర్​ యూజర్లకు మస్క్​ షాక్​- వారు డబ్బు చెల్లించాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.