డిపాజిట్ల కోసం బ్యాంకుల స్పెషల్​ స్కీమ్స్​, పండగలు వస్తున్నాయనే

author img

By

Published : Aug 23, 2022, 8:51 AM IST

deposits in banks

కరోనా మహమ్మారి ప్రభావం తగ్గి వ్యాపార కార్యకలాపాలు జోరందుకోవడం వల్ల వ్యవసాయ, కార్పొరేట్‌ వర్గాల నుంచి రుణాలకు గిరాకీ పెరుగుతోంది. కానీ బ్యాంకుల నిధి సమీకరణకు ప్రధాన వనరైన డిపాజిట్లలోకి డబ్బు ఆ స్థాయిలో రావడం లేదు. దీంతో రుణ గిరాకీని తట్టుకునేందుకు బ్యాంకులు ప్రత్యేక పథకాలతో డిపాజిట్ దార్లను ఆకర్షించే పనిలో పడ్డాయి.

Bank Deposits: రెండేళ్లుగా దేశంలో డిపాజిట్‌ రేట్లు కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఫలితంగా రుణరేట్లు కూడా తక్కువగా ఉండి, రుణ గ్రహీతలకు పరిస్థితి అనుకూలంగానే ఉండేది. కానీ, తమ వద్ద నిధులను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి, వచ్చే వడ్డీ మీదే ఆధారపడిన ఎంతోమంది మాత్రం తక్కువ ప్రతిఫలంతో ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక పరిస్థితులు కుదుట పడి, రుణాలకు గిరాకీ పెరగడంతో, నిధులను వేగంగా సమీకరించేందుకు మళ్లీ బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచడం ప్రారంభించాయి. దీంతోపాటు ప్రత్యేక డిపాజిట్‌ పథకాలనూ అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఫలితంగా డిపాజిటర్ల కళ్లలో ఆనందం కనిపిస్తోంది.

కొవిడ్‌ పరిణామాల ప్రభావం తగ్గి, వ్యాపార కార్యకలాపాలు జోరందుకోవడంతో, రిటైల్‌, వ్యవసాయ, కార్పొరేట్‌ వర్గాల నుంచీ రుణాలకు గిరాకీ పెరుగుతోంది. కానీ బ్యాంకుల నిధి సమీకరణకు ప్రధాన వనరైన డిపాజిట్లలోకి డబ్బు ఆ స్థాయిలో రావడం లేదు. ఇటీవలి వరకు వడ్డీ రేట్లు తక్కువగా ఉండటంతో డిపాజిట్‌దారులు ప్రత్యామ్నాయంగా షేర్ల కొనుగోలుకు, మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేందుకు ఆసక్తి చూపారు. మార్కెట్‌ పతనం అయితే.. తమ పెట్టుబడులు ఉపసంహరించడం వెంటనే సాధ్యం కాదనే భావనతో ఉన్న వారు మాత్రం బ్యాంకు డిపాజిట్లలోనే తమ నిధులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయిదేళ్ల సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంలో 7.4 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టేందుకు దీన్ని చాలామంది ఎంచుకుంటున్నారు.

స్వల్పకాలిక రుణాలతో పాటు దీర్ఘకాలిక రుణాలైన గృహ, వాహన రుణాలనూ బ్యాంకులు అధికంగా ఇస్తున్నాయి. బ్యాంకులకు నిధులు రుణంగా ఇచ్చి, ఆర్‌బీఐ వసూలు చేసుకునే వడ్డీ (రెపో రేటు) 5.40 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో, బ్యాంకులు నిధులు సమీకరించుకునేందుకు రిటైల్‌ డిపాజిటర్లపై దృష్టి సారించాయి. అందుకే, పోటీలు పడి, సంప్రదాయ వ్యవధులకు భిన్నంగా ఆకర్షణీయ పథకాలను ప్రవేశ పెడుతున్నాయి.

deposits in banks
.

పండగలు ముందున్నందున..
వినాయక చవితి మొదలు.. దేశంలో పండగల సీజన్‌ ప్రారంభం అవుతుంది. డిసెంబరు వరకు కొనసాగే ఈ సీజనులో చాలామంది కొత్త వస్తువులు కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా వాహనాలు, గృహోపకరణాలు రుణంపై ఎక్కువగా అమ్ముడవుతాయి. రెండేళ్లుగా కరోనా పరిణామాల నేపథ్యంలో రిటైల్‌ రుణాలకు గిరాకీ అంతంత మాత్రంగానే ఉంది. ఈసారి ఈ రుణాలకు వినియోగదారుల నుంచి అధికంగా ఆదరణ ఉంటుందని బ్యాంకులు భావిస్తున్నాయి. అందుకే డిపాజిట్లు రాబట్టుకునేందుకు ప్రత్యేక పథకాలతో ముందుకు వస్తున్నాయి.

ఇవీ చదవండి: మొబైల్‌ కొనాలనుకుంటున్నారా, త్వరలో ధరలు పెరిగే ఛాన్స్‌

యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు, క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.