RTO ఆఫీస్​కు వెళ్లే పనిలేదు.. లైసెన్స్, రిజిస్ట్రేషన్ సహా 58 సేవలు ఆన్​లైన్​లోనే

author img

By

Published : Sep 17, 2022, 7:20 PM IST

Updated : Sep 17, 2022, 8:36 PM IST

RTO Online Services

వాహనాలకు సంబంధించిన సేవలు సులభతరం కానున్నాయి. వాహన రిజిస్ట్రేషన్‌, ఓనర్‌షిప్‌ ట్రాన్స్‌ఫర్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ సహా 58 పౌర సంబంధిత సేవలు ఆధార్‌ అథంటికేషన్‌ ఆధారంగా ఆన్‌లైన్‌ ద్వారా పొందొచ్చు. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్​ జారీ చేసింది.

RTO Online Services : వాహనాలకు సంబంధించిన సేవలు సులభతరం చేసేందుకు.. కేంద్రం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. వాహన రిజిస్ట్రేషన్‌, ఓనర్‌షిప్‌ ట్రాన్స్‌ఫర్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ సంబంధిత సేవలను ఇకపై ఆన్‌లైన్‌లోనే పొందే సదుపాయాన్ని కల్పించింది. ఆధార్‌ ధ్రువీకరణ ఆధారంగా 58 సేవలను ఆన్‌లైన్‌లో పొందొచ్చని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటిలో ఆధార్‌ వినియోగం స్వచ్ఛందమేనని పేర్కొంది.

లెర్నర్‌ లైసెన్స్‌, డూప్లికేట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి ఉంటాయని.. అయితే డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే మాత్రం భౌతికంగా హాజరు కావాల్సిందేనని తెలిపింది. అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్‌, కండక్టర్‌ లైసెన్స్‌లో అడ్రస్‌ మార్పు, వాహన ఓనర్‌షిప్‌ మార్పు వంటి సేవలూ ఆన్‌లైన్‌లో లభిస్తాయని తెలిపింది. దీనివల్ల ఆర్టీఓ కార్యాలయాలపై భారం తగ్గి సేవలు సులభతరం అవుతాయని పేర్కొంది.

ఇవీ చదవండి: మళ్లీ ఆర్థిక మాంద్యం భయాలు.. ఈ జాగ్రత్తలతో ధీమాగా..!

చైనా లోన్​ యాప్స్​ నగదు ఫ్రీజ్​.. కీలక పత్రాలు స్వాధీనం

Last Updated :Sep 17, 2022, 8:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.