ట్విట్టర్​ ఉద్యోగులకు మస్క్​ మొయిల్.. రిప్లై ఇవ్వకుంటే ఇంటికే!

author img

By

Published : Nov 16, 2022, 9:05 PM IST

elon musk employees twitter

తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఓ మొయిల్​ పంపారు ట్విట్టర్​ అధినేత ఎలాన్​ మస్క్. దీనికి గురువారం సాయంత్రంలోగా రిప్లై ఇవ్వాలని కోరారు. రిప్లై ఇవ్వని ఉద్యోగులకు మూడు నెలల వేతనం ఇచ్చి తొలగిస్తామని వెల్లడించారు.

ట్విట్టర్​ ఉద్యోగులు తమ భవిష్యత్​ను నిర్ణయించుకోవడానికి ఓ అవకాశం ఇచ్చారు అధినేత ఎలాన్​ మస్క్. ఉద్యోగులు సంస్థలో భాగం కావాలంటే.. గురువారం సాయంత్రంలోగా తాను పంపిన మొయిల్​కి రిప్లై ఇవ్వాలని కోరారు. మస్క్​ పంపిన మొయిల్​ ప్రకారం.. ట్విట్టర్​ 2.0ని అభివృద్ధి చేయడానికి ఉద్యోగులు అధిక సమయం పాటు తీవ్రంగా కష్టపడి పని చేసి సంస్థ విజయంలో భాగం కావాలని కోరారు. అక్టోబర్​లో ట్విట్టర్​ సంస్థను ఎలాన్​ మస్క్ 44 బిలియన్​ డాలర్లకు కొనుగోలు చేశారు. దీంతో తనదైన శైలిలో తిరిగి లాభాల్లో పెట్టేందుకు మస్క్ తన ప్రయత్నాలు చేస్తున్నారు.

'అధిక పని ఒత్తిడి, ఎక్కువ సమయం పని ఉంటుంది. చెమటోడ్చి పని చేయడానికి సిద్ధంగా ఉండాలి' అని మస్క్ పేర్కొన్నారు. దీనికి అంగీకరిస్తూ పత్రంపై ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా సంతకం చేయాల్సి ఉంటుందని మస్క్ సూచించారు. ఒకవేళ ఈ ఒప్పందంపై సంతకం చేయకపోతే ఉద్యోగాన్ని వదిలేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే అలా ఉద్యోగాన్ని వదులుకునే వారికి మూడు నెలల వేతనాన్ని ఇవ్వనున్నట్లు మస్క్ ప్రకటించారు. 'మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, ట్విట్టర్​ను విజయవంతం చేసేందుకు మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు' అని మొయిల్​ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.