మారుతీ సుజుకీ ఓనర్లకు బిగ్​ అలర్ట్​.. 11 వేల కార్లు రీకాల్​

author img

By

Published : Jan 24, 2023, 9:54 AM IST

maruti suzuki recalls the grand vitara cars

మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా మోడళ్ల కార్ల యజమానులకు అలర్ట్​ చేసింది. ఈ మోడల్​ కార్లలో వెనుక సీట్​ బెల్ట్​ మౌంటింగ్​ బ్రాకెట్లలో లోపాలు ఉన్నట్లు గుర్తించింది. దీని కారణంగా 11,177 కార్లను వెనక్కి రప్పిస్తున్నట్లు సోమవారం వెల్లడించింది.

మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా మోడళ్ల కార్ల యజమానులకు అలర్ట్​. ఆ మోడల్​ కార్లలో వెనుక సీట్​ బెల్ట్​ మౌంటింగ్​ బ్రాకెట్లలో లోపాలను సరిచేసేందుకు.. 11,177 కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని మారుతీ సుజుకీ సోమవారం తెలిపింది. మారుతీ సుజుకీ కార్ల రీకాల్​ గురించి స్టాక్​ మార్కెట్ రెగ్యులేటరీ ఫైలింగ్​ ద్వారా వెల్లడించింది. 2022 ఆగస్టు 8 నుంచి నవంబరు 15 మధ్య తయారైన ఈ మోడల్‌ కార్లలో.. ఈ లోపాన్ని గుర్తించినట్లు తెలిపింది. లోపాలున్న భాగాలను ఉచితంగా మార్చి ఇస్తామని తెలిపింది.

అంతకుముందు కూడా ఎయిర్​ బ్యాగ్​ కంట్రోలర్​లో లోపాలు సరిదిద్దేందుకు.. 17,362 కార్లను వెనక్కి రప్పిస్తున్నట్లు మారుతీ వెల్లడించింది. 2022 డిసెంబర్ 8 నుంచి 2023 జనవరి 12 మధ్యలో తయారైన కార్లను వెనక్కు పిలిపిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఆల్టో కే10, బ్రెజా, బలీనో, ఎస్​ప్రెస్సో, ఈకో, గ్రాండ్ విటారా మోడళ్ల కార్లను రీకాల్ చేస్తున్నట్లు మారుతి సుజుకీ ప్రకటించింది. సమస్య తీవ్రత దృష్ట్యా.. ఎయిర్ బ్యాగ్ కంట్రోలర్​లోని లోపాన్ని సరిచేసే వరకు ఆ కార్లను డ్రైవ్​ చేయొద్దని సూచించింది మారుతి సుజుకీ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.