ఆ రోజు చనిపోతాననుకున్నా: గౌతమ్​ అదానీ

author img

By

Published : May 15, 2022, 9:40 AM IST

Gautam Adani

Gautam Adani: దేశంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో అంబానీతో పోటీపడుతున్నారు గౌతమ్​ అదానీ. పలు వ్యాపార కార్యకలాపాల వెనుక తనదైన ముద్రవేసిన అదానీ తన మనసులోని ముచ్చట్లను పంచుకున్నారు. 2008, నవంబర్​ 26న ముంబయిలోని తాజ్​ హోటల్​లో భోంచేస్తున్న సమయంలో ఉగ్రవాదులు దాడి చేశారని, ఆ క్షణాన చావును చాలా దగ్గర నుంచి చూశానని చెప్పారు.

Gautam Adani: గౌతమ్‌ అదానీ.. దేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో అంబానీతో పోటీపడుతున్న ఈ వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు అధినేత. సోలార్‌, థర్మల్‌ విద్యుత్తు తయారీ, రవాణా, ఓడరేవుల నిర్వహణ.. ఇలా పలు వ్యాపార కార్యకలాపాల వెనుక తనదైన ముద్రవేసిన అదానీ తన మనసులోని ముచ్చట్లను పంచుకుంటున్నారిలా..

ముంబయికి వెళ్లిపోయా
మా స్వస్థలం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌. నాన్న శాంతిలాల్‌, అమ్మ శాంతి. మేం మొత్తం ఏడుగురం సంతానం. నాన్నకు చిన్నపాటి వస్త్ర వ్యాపారం ఉండేది. నేను చిన్నప్పటి నుంచీ నాన్నలా కాకుండా ఇంకేదైనా చేయాలనుకునేవాడిని. దాంతో డిగ్రీ రెండో ఏడాదిలో ఉన్నప్పుడు జేబులో వంద రూపాయలు పెట్టుకుని ముంబయి రైలు ఎక్కేశా. అక్కడ రెండుమూడేళ్లు ఓ వజ్రాల వ్యాపారి దగ్గర పనిచేసి ఆ కిటుకులన్నీ నేర్చుకున్నా. తరువాత నేనే సొంతంగా ఆ వ్యాపారం చేయడం మొదలుపెట్టా. అలా ఇరవై ఏళ్లకే పది లక్షల రూపాయలు చేతికొచ్చాయి. ఆ రోజున నేను కూడా ఏదో ఒకటి సాధించగలననే నమ్మకం కలిగింది.

Gautam Adani
కుటుంబంతో గౌతమ్​ అదానీ

నా కోరిక తీరింది
చిన్నప్పుడు మా స్కూల్‌ ట్రిప్‌లో భాగంగా కాండ్లా ఓడరేవుకు తీసుకెళ్లారు. అక్కడ ఆ పోర్టును చూశాక పెద్దయ్యాక నేను కూడా అలాంటిది ఒకటి ఏర్పాటు చేయాలనుకున్నా. అనుకున్నట్లుగానే ముంద్రా పోర్టు కాంట్రాక్టును సొంతం చేసుకున్నాక దాన్ని విస్తరించి.. భారతదేశంలోనే అది పెద్ద కార్గో పోర్టుగా మార్చా. నా చిన్ననాటి కల నెరవేరిందనిపించింది.

బతికి బయటపడ్డా
అది నవంబరు 26, 2008. వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా నేను కొందరు అతిథులతో కలిసి ముంబయిలోని తాజ్‌ హోటల్‌లో భోంచేస్తున్నా. ఆ సమయంలోనే ఉగ్రవాదుల దాడి మొదలైంది. ఒక్క క్షణం ఏం చేయాలో తెలియలేదు. మొదట భయపడ్డా చివరకు మేమంతా అక్కడి నుంచి జాగ్రత్తగా బయటపడి హోటల్‌లో ఓ మూలన దాక్కున్నాం. ఆ క్షణాన నేను చాలా దగ్గర నుంచి చావును చూశా.

వ్యాపారంతోనే ఆగిపోలేదు
మేం వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత శాతాన్ని మా అదానీ ఫౌండేషన్‌కు మళ్లిస్తున్నాం. అదేవిధంగా మొబైల్‌ ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ వైద్యశాలల్ని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశాం. వీటి ద్వారా నెలకు సుమారు పాతికవేలమందికి ఉచిత వైద్య సాయం అందుతోంది.

ఆ కలలు గుర్తున్నాయి
కాలేజీలో ఉన్నప్పుడు నేను పరీక్షల్లో ఫెయిల్‌ అయినట్లుగా కలలు వచ్చేవి. ఆ భయంతోనే తరచూ కాలేజీ మానేసే వాడిని. చివరకు చదువు నా వల్ల అయ్యే పని కాదని నిర్ణయించుకునే బీకాం రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు కాలేజీ వదిలేశా.

వ్యాపారమే ఎందుకంటే..
చిన్నప్పటినుంచీ నాపైన ఎవరైనా ఆధిపత్యం చెలాయిస్తే నచ్చేది కాదు. ఆజ్ఞాపించే ధోరణిలో మాట్లాడినా తట్టుకోలేకపోయేవాడిని. అప్పుడే నాలాంటి వాడికి ఉద్యోగం సరిపోదని అర్థం చేసుకుని వ్యాపారం వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నా.

ఇంటికే ప్రాధాన్యం

నేను నలుగురిలో త్వరగా కలిసిపోయే వ్యక్తిని కాదు. అందుకే ఆఫీసు పనయ్యాక ఇంటికి వచ్చేస్తాను. మరీ తప్పనిసరైతే తప్ప పార్టీల్లాంటివాటికి వెళ్లను.

ఆ బాధ్యత నా భార్యదే
నా భార్య ప్రీతీ అదానీ దంతవైద్యురాలు. పెళ్లై బాధ్యతలు పెరిగేకొద్దీ తన వృత్తిని పక్కన పెట్టేసింది. ఇప్పుడు మా అదానీ ఫౌండేషన్‌కు ఛైర్‌పర్సన్‌గా వీలైనంతమందికి సాయం చేయడంలో ముందుంటుంది. భుజ్‌లో భూకంపం వచ్చాక ప్రీతి స్కూల్‌ను ప్రారంభించి... పేద పిల్లలకు ఉచితంగా చదువు చెబుతోంది. నేను వ్యాపారం దిశగా ఒక్కో మెట్టూ ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటే... తనేమో వీలైనంతమందిని ఆదుకునేందుకు ఏం చేయాలా అని ఆలోచిస్తుంటుంది. తీరిక దొరికితే..పుస్తకాలు చదువుతాను.

ఇష్టమైన ఆహారం
ఢోక్లా ఇష్టం

Gautam Adani
ఢోక్లా

మెచ్చిన కారు
ఎరుపు రంగు ఫెరారీ

Gautam Adani
ఎరుపు రంగు ఫెరారీ

ఇదీ చూడండి: ప్రపంచ కుబేరుల్లో ఐదో స్థానానికి గౌతమ్​ అదానీ

Adani : సెకి కొనుగోలు చేసే విద్యుత్‌లో రెండొంతులు అదానీ సంస్థదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.