Bank Holidays In June : జూన్​ నెలలో బ్యాంక్​ సెలవుల పూర్తి లిస్ట్​ ఇదే..

author img

By

Published : May 29, 2023, 7:33 PM IST

Bank Holidays In June

June Bank Holidays 2023 : మీరు తరచూ ఆర్ధిక లావాదేవీల కోసం బ్యాంక్‌కు వెళ్తుంటారా?.. రూ.2000 నోట్ల మార్పిడి కోసం జూన్​లో బ్యాంక్​కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. జూన్​ నెలలో 12 రోజులు (అన్ని రాష్ట్రాల్లో కలిపి) బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. మరి బ్యాంకులు ఏఏ రోజుల్లో మూతపడి ఉంటాయంటే?

Bank Holidays In June 2023 : బ్యాంకులతో మనకు ఎప్పుడూ ఏదో ఒక పని పడుతూనే ఉంటుంది. డెబిట్/ క్రెడిట్ కార్డులు, చెక్ బుక్స్ తీసుకునేందుకు, డబ్బులు డిపాజిట్/ విత్‌డ్రా చేసుకునేందుకు, లోన్లు తీసుకునేందుకు, ఎఫ్​డీలు వేసేందుకు ఇలా బ్యాంకుల్లో పని ఉంటుంది. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంకు రూ.2000 నోట్లను ఇటీవలే ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో నోట్లను మార్చుకునేందుకు ప్రజలు బ్యాంకులకు వెళ్తున్నారు. అయితే వినియోగదారులు ముందస్తుగా జూన్​ సెలవుల జాబితాను గమనించి బ్యాంక్‌ పనులను ప్లాన్‌ వేసుకోవడం మంచిది. ఎందుకంటే మీరు వెళ్లాక బ్యాంకు మూతపడి ఉంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది!

జూన్‌లో బ్యాంకులకు సెలవులు ఇలా..
June Bank Holidays 2023 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బ్యాంక్‌ కస్టమర్ల సౌలభ్యం కోసం ప్రతి నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల జాబితాను ముందుగానే విడుదల చేస్తుంది. ప్రతి రాష్ట్రంలోని పండుగలు, ఇతర ముఖ్యమైన రోజుల్లో వచ్చే సెలవుల వివరాలు ఈ లిస్ట్‌లో ఉంటాయి. జూన్‌ నెలలో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు కలిపి 12 రోజులు సెలవులు ఉన్నట్లు ఆర్​బీఐ తెలిపింది. శని, ఆదివారాల్లో వచ్చే సాధారణ సెలవులతో పాటు రథయాత్ర, ఖర్చీ పూజ, ఈద్ ఉల్ అజా వంటి కొన్ని ముఖ్యమైన పండుగలు జూన్​లో ఉన్నాయి. మరి జూన్​ నెలలో ఏఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం.

  • జూన్ 4 (ఆదివారం): దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
  • జూన్ 10 (రెండో శనివారం): దేశంలో బ్యాంకులు అన్నింటికీ సెలవు.
  • జూన్ 11 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు.
  • జూన్ 15 (గురువారం): రజ సంక్రాంతి సందర్భంగా ఒడిశా, మణిపుర్​లోని బ్యాంకులకు సెలవు
  • జూన్ 18 (ఆదివారం): దేశంలోని అన్ని బ్యాంక్​లకు సెలవు.
  • జూన్ 20 (శనివారం): పూరీ జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా ఒడిశా, మణిపుర్‌లో బ్యాంకులు మూతపడి ఉంటాయి.
  • జూన్ 24 (నాలుగో శనివారం): దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.
  • జూన్ 25 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు.
  • జూన్ 26 (సోమవారం): ఖర్చీ పూజ సందర్భంగా త్రిపురలోని అన్ని బ్యాంకులకు సెలవు.
  • జూన్​ 28 (బుధవారం): ఈద్-ఉల్-అజా సందర్భంగా జమ్ముకశ్మీర్, మహారాష్ట్ర, కేరళలో అన్ని బ్యాంకులు మూతపడి ఉంటాయి.
  • జూన్ 29 (గురువారం): ఈద్-ఉల్-అజా సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు.
  • జూన్​ 30 (శుక్రవారం): ఈద్-ఉల్-అజా సందర్భంగా మిజోరం, ఒడిశాలో అన్ని బ్యాంకులకు సెలవు

బ్యాంకు సెలవు రోజుల్లో నగదు లావాదేవీలు ఎలా?
జూన్​ నెలలో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు ఏడు రోజులు మూతపడి ఉంటాయి. బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలను వినియోగించుకోవచ్చు. వీటి ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఏటీఎంల ద్వారా నగదు విత్​డ్రా చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్ మెషీన్ల ద్వారా మీ అకౌంట్లో నగదు జమ చేసుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.