రూ.1,000లోపు దుస్తులపై కేంద్రం జీఎస్టీ ఎందుకు పెంచింది?

author img

By

Published : Nov 23, 2021, 3:36 PM IST

Updated : Nov 23, 2021, 10:43 PM IST

gst rate on readymade garments

వచ్చే ఏడాది ప్రారంభంలో సామాన్యులకు కేంద్రం షాక్​ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అగ్గిపెట్టె నుంచి ఎలక్ట్రానిక్​​ వస్తవుల వరకు ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులుపడుతుండగా.. రానున్న రోజుల్లో దుస్తులపై (gst rate on readymade garments) కూడా భారం పడనుంది. ముడి సరుకుల ధరల పెరుగుదల, జీఎస్​టీ పెంపు ప్రధాన కారణాలు. ఇంతకీ దుస్తులు, చెప్పులు వంటి వస్తువులపై కేంద్రం జీఎస్​టీని పెంచడానికి కారణాలేంటి?

వచ్చే ఏడాది ఆరంభంలో సామాన్యులకు మరో షాక్​ తగిలేలా కనిపిస్తోంది. టెక్స్​టైల్​ రంగంలో ధరలు (gst rate on readymade garments) పెరగనున్నాయి. ఇంధన, ఎల్​పీజీ, వంట నూనె సహా పలు వస్తువుల ధరలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతుండగా.. రానున్న రోజుల్లో మరిన్ని వస్తువుల ధరలు రెక్కలు తొడగనున్నాయి. ఫలితంగా ఇప్పటికే కరోనా వల్ల ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న ప్రజలపై మరింత భారం పడనుంది. ముడి పదార్థాల ధరలు పెరగడం సహా వస్తుసేవల పన్ను(జీఎస్​టీ) పెంపు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అయితే వీటిపై కేంద్రం జీఎస్​టీని పెంచడానికి అసలు కారణాలేంటి?

దస్తులపై జీఎస్​టీ​ని ఎందుకు పెంచారు?

జీఎస్​టీ కౌన్సిల్ సిఫారసుల మేరకు దుస్తులపై పన్నురేటును పెంచినట్లు కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. కరోనా కారణంగా ఈ ఉత్పత్తులపై జీఎస్​టీ రేట్లను పెంచే నిర్ణయాన్ని రెండేళ్లపాటు వాయిదా వేసినట్లు పేర్కొన్నాయి. క్రమంగా పరిశ్రమ కోలుకున్న నేపథ్యంలో ఇన్‌వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్​ సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ఈ నిర్ణయం (gst on readymade garments 2021) తీసుకున్నట్లు చెబుతున్నాయి.

ఇన్వర్టెడ్​ డ్యూటీ స్ట్రక్చర్​ సమస్య ఏమిటి?

ఇన్వర్టెడ్​ డ్యూటీ స్ట్రక్చర్ అంటే ఇన్‌పుట్‌పై (ముడిపదార్థాలు) ఎక్కువ పన్నులు.. అవుట్‌పుట్ లేదా తుది ఉత్పత్తిపై తక్కువ పన్ను చెల్లించడం. వ్యాపారులు.. అంతిమ ఉత్పత్తులపై కంటే ముడి పదార్థాలపై అధిక జీఎస్​టీని చెల్లిస్తున్నారు. ఈ సమస్యను పలు రంగాల్లో పరిష్కరించినప్పటికీ.. చెప్పులు, దుస్తులు, ఔషధాలు, ఎరువుల రంగంలో అలాగే కొనసాగుతోంది. దీని వల్ల జీఎస్​టీ ఇన్వర్టెడ్​ డ్యూటీ స్ట్రక్చర్ కింద ఉపయోగించని ఇన్‌పుట్ ట్యాక్స్​ క్రెడిట్‌ను వ్యాపారాలకు వాపసు చేసే సమస్య చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది.

టైక్స్​టైల్స్​ రంగలో జీఎస్​టీ రేటు పెంపుపై ఆందోళన ఎందుకు?

భారత టెక్స్‌టైల్స్​ పరిశ్రమ ప్రకారం.. ఈ రంగంలో 15 శాతం మాత్రమే ఇన్‌వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్​ సమస్యలను ఎదుర్కొంటోంది. అయితే జీఎస్​టీ రేటు పెంపు వల్ల మిగిలిన 85 శాతం ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ఇది పరిశ్రమలో వర్కింగ్​ క్యాపిటల్​ అవసరాలపై.. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై ఎక్కువ ఒత్తిడిని సృష్టించే అవకాశం ఉంది.

దేశీయ వస్త్ర పరిశ్రమలో 65 శాతమే కొవిడ్ పూర్వ స్థాయిలో పనిచేస్తోంది. ఇదే రిటైల్ దుస్తుల తయారీకి జీవనాధారం. కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో టైక్స్​టైల్స్​ ఒకటి. వైరస్ వ్యాప్తితో ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల 20 శాతం మంది ఉపాధి కోల్పోయారు.

"కొవిడ్​తో తీవ్రంగా ప్రభావితమైన ఇప్పుడిప్పుడే టైక్స్​టైల్స్​ రంగం కోలుకుంటుంది. పండగ సీజన్​లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. అయితే ఇంకా ఎంతో కాలం ఇలా సాగకపోవచ్చు. వచ్చే ఏడాది జనవరి నుంచి రూ.1,000లోపు వస్తువులపై పెంచిన జీఎస్​టీ అమల్లోకి రావడమే ఇందుకు కారణం. ఇది టైక్స్​టైల్స్​ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు నష్టపోతాయి."

- కుమార్​ రాజగోపాల్​, రిటైల్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా సీఈఓ

రూ.1000 కంటే తక్కువ ధర ఉన్న దుస్తులపై (gst rate on readymade garments under rs.1000) 5 నుంచి 12 శాతానికి జీఎస్​టీ పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. అయితే ప్రణాళికాబద్ధమైన పన్ను రేటు పెంపుపై వస్త్ర పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది 85 శాతం పరిశ్రమపై ప్రభావం చూపుతుందని తుది ఉత్పత్తుల ధరలు 80 శాతం పెరగడానికి దారితీస్తుందని వాదిస్తోంది.

మరోసారి పరిశీలిచండి

టైక్స్​టైల్స్​ సహా పలు వస్తువులపై ప్రతిపాదిత జీఎస్​టీ పెంపును మరోసారి పరీశీలించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్​తో పాటు రాష్ట్రాలను, జీఎస్​టీ కౌన్సిల్​ను కోరింది రిటైల్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా.

ఇదీ చదవండి:అమెజాన్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌ వివాదానికి త్వరలోనే చెక్​!

Last Updated :Nov 23, 2021, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.