Stock Market today: వారాంతంలోనూ మార్కెట్లకు నష్టాలే..

author img

By

Published : Oct 22, 2021, 3:45 PM IST

stocks close

అమ్మకాల ఒత్తిడి, అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలతో దేశీయ స్టాక్​ మార్కెట్ (Stock Market today)​ సూచీలు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 102 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ 63 పాయింట్లు నష్టపోయింది.

వారాంతంలో స్టాక్​ మార్కెట్లు(Stock Market today) నష్టాలతో ముగిశాయి. లాభాలతో ప్రారంభమైన శుక్రవారం సెషన్.. తర్వాత అమ్మకాల వెల్లువెత్తడం వల్ల సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. దీనికితోడు ప్రతికూల అంతర్జాతీయ పరిణామాలు, మదుపర్ల లాభాల స్వీకరణ మార్కెట్లను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్​ 102 పాయింట్లు కోల్పోయి.. 60,821 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ 63 పాయింట్లు నష్టపోయి..18,114 వద్ద ముగిసింది.

స్థిరాస్తి, బ్యాంకింగ్​ రంగాలు మినహా.. ఐటీ, లోహ, ఫార్మా, ఎఫ్​ఎంసీజీ సహా దాదాపు అన్ని రంగాల సూచీలు 1-3 శాతం నష్టపోయాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​(Stock Market today) ఉదయం 61,044 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడితో కాసేపటికే.. నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో 60,551 వద్ద కనిష్ఠాన్ని తాకింది. రోజులో 869 పాయింట్లు కదలాడిన సూచీ.. మరోదశలో 61,420 గరిష్ఠానికి చేరింది. చివరికి 101.88 పాయింట్ల నష్టంతో.. 60,821 వద్ద ముగిసింది.

ఇంట్రాడేలో 18,034 (కనిష్ఠం)-18,314 (గరిష్ఠం) మధ్య కదలాడిన నిఫ్టీ.. చివరకు 63.20 పాయింట్లు(Stock Market today) నష్టపోయి.. 18,119 వద్ద స్థిరపడింది.

లాభనష్టాలోనివి ఇవే..

హెచ్​డీఎఫ్​సీ 2.25 శాతం, బజాజ్​ ఆటో 1.81, ఇండస్​బ్యాంక్​ 1.21, కోటక్​ బ్యాంక్​ 1.19, టైటాన్​ 1.04 యాక్సిస్​ .98 శాతం లాభపడ్డాయి.

ఐటీసీ 3.39 శాతం, మారుతీ 2.24 ఇన్ఫోసిస్​ 1.96, ఎన్​టీపీసీ 1.93, హెచ్​సీఎల్​ టెక్​ 1.44, టాటాస్టీల్​ 1.43 నెస్లే 1.35, ఎం అండ్ ఎం 1.25 శాతం మేర నష్టపోయాయి.

ఇదీ చూడండి: పండగ సమయంలో కొలువుల జాతర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.