Gold Rate Today: తగ్గిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో ఎంతంటే..?

author img

By

Published : Nov 22, 2021, 10:07 AM IST

Gold price

బంగారం ధర (Gold Rate Today) సోమవారం తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రేటు రూ.50 తగ్గింది. అయితే కిలో వెండికి రూ.10 పెరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు (Silver price today) ఇలా ఉన్నాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో బంగారం ధర (Gold Rate Today) సోమవారం స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.50 తగ్గింది. కిలో వెండి ధర (Silver price today) రూ.10 మేర పెరిగింది.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర (Gold Price in Hyderabad) రూ.50,500 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.67,850 వద్ద ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.50,500గా ఉంది. కిలో వెండి ధర రూ.67,850 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.50,500గా ఉంది. కేజీ వెండి ధర రూ.67,850 వద్ద కొనసాగుతోంది

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,849 డాలర్లుగా ట్రేడవుతోంది.
  • స్పాట్ వెండి ధర ఔన్సుకు 24.76 డాలర్లు పలుకుతోంది.

ఇంధన ధరలు..

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో (Petrol Prices Hyderabad) లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61కి వద్ద ఉంది.
  • వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  • గుంటూరు నగరంలో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

ఇదీ చూడండి: 300 ఎకరాల్లో అంబానీ ఇల్లు- రెండో నివాసంగా మారబోతోందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.