కొత్త బైక్​ కొంటే.. రెండు హెల్మెట్లు ఫ్రీగా ఇవ్వాల్సిందే!

author img

By

Published : Aug 29, 2021, 4:47 PM IST

Updated : Aug 30, 2021, 11:44 AM IST

free helmet

ద్విచక్ర వాహనంపై వెళ్లాలంటే హెల్మెట్ ఉండాల్సిందే. వెనక కూర్చునే వ్యక్తికీ హెల్మెట్ తప్పనిసరి అనే నిబంధన(two helmet rule) ఉంది. అయితే, బైక్ కొంటే ఉచితంగా రెండు బీఐఎస్ హెల్మెట్లు(free helmets) ఇస్తారన్న విషయం మీకు తెలుసా?

హెల్మెట్ లేకుండా ట్రాఫిక్ పోలీసుల కంట పడితే అంతే! మన బైక్ పేరు మీద ఓ చలానా పడిపోయినట్టే. నిబంధనల ప్రకారం ద్విచక్రవాహనాన్ని నడిపేవారితో పాటు.. వెనక కూర్చునేవారు కూడా హెల్మెట్(two helmet rule) తప్పనిసరిగా ధరించాలి. దీని ప్రకారం ఒక బైక్​ ఉన్నవారు రెండు హెల్మెట్లు తప్పక కొనాలి.

అయితే, ఈ విషయంలో వాహనదారులకు ఊరట కలిగించే అంశం ఒకటి ఉంది. కొత్త బైక్ కొనేవారికి రెండు హెల్మెట్లు ఉచితంగా(free helmet with new bike) ఇవ్వాలన్న నిబంధన ఒకటి 1989 కేంద్ర మోటార్ వాహనాల చట్టంలో ఉంది. చట్టంలోని రూల్ 138(4)(f) ప్రకారం.. ఏ రకం బైక్ కొన్నా రెండు హెల్మెట్లు ఇవ్వాల్సిందే. విక్రేతలే ఈ వ్యయాన్ని భరించాలి. ఉచితంగా ఇచ్చే హెల్మెట్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) నిబంధనలకు లోబడి ఉండాలి.

దీనిపై వాహనదారులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు కూడా. నిబంధనల ప్రకారం రావాల్సిన హెల్మెట్లను ప్రజలు తప్పకుండా అడిగి తీసుకోవాలని ప్రచారం చేస్తున్నారు.

  • CTP appeals citizens to rightfully claim two standard helmets along with any type of motor cycle they purchase as per the Rule 138(4)(f) of the Central Motor Vehicles Rules, 1989.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/EEbx5ud8kC

    — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) August 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: 'ఇకపై ఆ హెల్మెట్​లు మాత్రమే వాడాలి'

Last Updated :Aug 30, 2021, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.