'యువతకు ఉద్యోగాల్లేవు.. ఇంకెంత కాలం ఓపిగ్గా ఉండాలి?'

author img

By

Published : Dec 2, 2021, 12:32 PM IST

varun gandhi vs bjp, వరుణ్​ గాంధీ

Varun gandhi vs bjp: యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు లభించడం లేదని సొంత ప్రభుత్వంపై మండిపడ్డారు భాజపా ఎంపీ వరుణ్​ గాంధీ. యువత ఇంకెంతకాలం ఓపికతో ఉండాలని ప్రశ్నించారు.

Varun gandhi bjp: భాజపా ఎంపీ వరుణ్​ గాంధీ.. మరోమారు సొంత ప్రభుత్వంపై తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచారు. యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు లభించడం లేదని, వారు ఇంకెంత కాలం సహనంతో ఉండాలని ప్రశ్నించారు.

varun gandhi vs bjp
వరుణ్​ ట్వీట్​

"ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. అవకాశం వచ్చినా, ప్రశ్నాపత్రాలు లీక్​ అవుతున్నాయి. పరీక్ష రాసినా.. ఏళ్ల తరబడి ఫలితాలు వెలువడటం లేదు. ఏదో ఒక కారణంగా పరీక్షనే రద్దు చేసేస్తున్నారు. రైల్వే గ్రూప్​ డీ పరీక్షల ఫలితాల కోసం 1.25కోట్ల మంది రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఆర్మీ నియామకాలకు ఇదే పరిస్థితి. దేశ యువత ఇంకెంత కాలం ఓపికతో ఉండాలి?"

--- వరుణ్​ గాంధీ, భాజపా ఎంపీ.

రైతు నిరసనలకు మద్దతిస్తూ.. సొంత పార్టీపై వరుణ్​ గాంధీ విమర్శలు చేయడం ఇటీవలి కాలంలో వార్తల్లో నిలిచింది. సాగు చట్టాలను రద్దు చేయాలని అనేకమార్లు ఆయన డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి:- భాజపాకు కొరకరాని కొయ్యగా వరుణ్- ప్రియాంక మాస్టర్ ప్లాన్!​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.