ఉద్యోగార్థులకు గుడ్​ న్యూస్​, ఇకపై UPSCలోనూ వన్ ​టైమ్​ రిజిస్ట్రేషన్

author img

By

Published : Aug 24, 2022, 1:06 PM IST

UPSC starts one time registration facility for govt job aspirants

UPSC One Time Registration ప్రభుత్వ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్. దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు యూపీఎస్​సీ వన్​ టైమ్​ రిజిస్ట్రేషన్​ ప్లాట్​ఫామ్​ను​ ప్రారంభించింది. దీంతో యూపీఎస్​సీ భర్తీ చేయనున్న ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ మరింత సులభంగా మారి సమయం ఆదా కానుంది.

UPSC One Time Registration : వన్​ టైమ్​ రిజిస్ట్రేషన్.. ఇప్పుడు ఏ జాబ్​కు అప్లై చేసుకోవాలన్నా ఇది తప్పనిసరి. ఒక్కసారి రిజిస్టర్​ చేసుకుంటే చాలు.. ఇంకెప్పుడైనా దరఖాస్తు చేసుకునేటప్పుడు ప్రక్రియ సులభంగా సాగుతుంది. అయితే యూపీఎస్​సీ ఉద్యోగార్థులకు మాత్రం ఇప్పటివరకు ఈ సదుపాయం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. వాటిని దృష్టిలో పెట్టుకుని యూపీఎస్​సీ కూడా తాజాగా ఓటీఆర్​ను ప్రారంభించింది.

"వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి యూపీఎస్​సీ ఏడాది పొడవునా నిర్వహించే అనేక పరీక్షల కోసం పెద్ద సంఖ్యలో ఆశావహులు దరఖాస్తు చేసుకుంటారు. వారి సమయం ఆదా చేస్తూ, దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఓటీఆర్​ ప్లాట్​ఫామ్​ను ప్రవేశపెట్టాం. ఇక నుంచి యూపీఎస్​సీలోని వివిధ రిక్రూట్​మెంట్​ పరీక్షలకు అప్లె చేసుకున్నప్పుడు ప్రతిసారీ ప్రాథమిక వివరాలు ఇవ్వాల్సిన పనిలేదు." అని ఓ సీనియర్ యూపీఎస్​సీ అధికారి తెలిపారు.

"ఉద్యోగార్థులు ఇచ్చిన ప్రాథమిక సమాచారాన్ని సర్వర్​లలో సురక్షితంగా స్టోర్​ చేస్తాం. వన్​ టైమ్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ఉద్యోగార్థులకు చాలా ఉపయోగపడుతుంది. పొరపాటున కూడా తప్పుగా సమాచారం నమోదు అయ్యే అవకాశం ఉండదు. దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసే ఉద్దేశంతోనే అధికారిక వెబ్​సైట్​ upsc.gov.inలో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాం. ఓటీఆర్​ సూచనలను పరిశీలించి, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు మొదటిసారి రిజిస్టర్​ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి." అని యూపీఎస్​సీ తెలిపింది.

ఇవీ చదవండి: బలపరీక్షకు ముందే స్పీకర్​ రాజీనామా, తీవ్ర భావోద్వేగంతో సభను వీడి

నీతీశ్​ బలపరీక్ష రోజే, ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.