అదుపుతప్పి బైకర్లపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు స్పాట్​ డెడ్​

author img

By

Published : Nov 28, 2022, 3:10 PM IST

Updated : Nov 28, 2022, 4:25 PM IST

Truck accident in Dehradun

ఉత్తరాఖండ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి ముగ్గురు బైకర్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ బైకర్​ అక్కడికక్కడే మృతిచెందాడు. మరోవైపు, మతపరమైన వేడుకలో భాగంగా గుమిగూడిన జనంలోకి ఓ ఎస్​యూవీ దూసుకెళ్లింది. ఈ ఘటన బిహార్​లో జరిగింది.

అదుపుతప్పి బైకర్లపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు స్పాట్​ డెడ్​

ఉత్తరాఖండ్​లోని దెహ్రాదూన్​ చంద్రమణి చౌక్​ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సహారన్​పుర్​ నుంచి వేగంగా వస్తున్న ఓ లారీ అదుపుతప్పి ముగ్గురు బైకర్లపైకి దూసుకొచ్చింది. ఈ ఘటన పటేల్​ నగర్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. బైకర్లలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇద్దరు బైకర్లతో పాటు స్థానిక దుకాణదారుడు ఈ ఘటనలో గాయపడ్డాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆ రోడ్డుపై భారీ ట్రాఫిక్​ జామ్​ అయ్యింది. ట్రాఫిక్​ క్లియర్​ చేయడానికి పోలీసులు చర్యలు తీసుకున్నారు. లారీ బ్రేకులు ఫెయిల్​ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

జనంపైకి దూసుకెళ్లిన ఎస్​యూవీ..
బిహార్​లో దారుణం జరిగింది. వేగంగా వస్తున్న ఓ ఎస్​యూవీ జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 మంది గాయపడగా.. తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సమస్తీపుర్​ జిల్లా ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిత్వార్‌పుర్‌లోని కన్హయ్య చౌక్ సమీపంలో.. ఓ మతపరమైన వేడుకలో భాగంగా పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. వేగంగా వస్తున్న ఓ ఎస్​యూవీ అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది.

SUV plowed into crowd
ప్రమాదంలో గాయపడిన మహిళ

ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఎస్​యూవీ డ్రైవర్​ పారిపోవడానికి ప్రయత్నించగా.. అతడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇవీ చదవండి : అదానీ పోర్టుకు వ్యతిరేకంగా 3వేల మంది నిరసన.. ఆజ్యం పోసిన మతపెద్దలు?.. సర్కారు గరం!

భర్త హత్య.. ఫ్రిడ్జ్​లో 10 శరీర భాగాలు.. దిల్లీలో మరో 'శ్రద్ధ' తరహా దారుణం

Last Updated :Nov 28, 2022, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.